స్వరాష్ట్రంలో మహిళా సంక్షేమానికి ఇది స్వర్ణ యుగం!
మహిళల సంక్షేమం గురించి ఆలోచించింది BRS పార్టీ, కెసిఆర్ ప్రభుత్వమే!
కాంగ్రెస్, బీజేపీ లకు చిల్లర రాజకీయాలు చేయడం తప్ప వేరే తెలియదు
మహిళలంటే ఆ పార్టీలకు గౌరవం లేదు
ఆకాశంలో సగంగా ఉన్న మహిళలకు సమంగా అవకాశాలు
సీఎం కెసిఆర్ గారు మహిళల పక్షపాతి
అంగన్వాడీ లను టీచర్లుగా గుర్తించింది సీఎం కెసిఆర్ గారే
ఆశా వర్కర్లకు మంచి వేతనాలు ఇస్తున్నది సీఎం కెసిఆర్
కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ లాంటి పథకాలతో ఆడబిడ్డ పెండ్లికి పెద్దన్న సీఎం కెసిఆర్ అయ్యిండు
బ్యాంక్ లింకేజ్ రుణాలతో మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారు
సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ తో పోటీగా పాలకుర్తి అభివృద్ధి
దయన్న లాంటి ఎమ్మెల్యే మీకు ఉండటం పాలకుర్తి నియోజకవర్గం అదృష్టం
పాలకుర్తి నియోజకవర్గ స్థాయి తెలంగాణ మహిళ దినోత్సవ వేడుకల్లో మంత్రి సత్యవతి రాథోడ్
రెండవ విడత కుట్టు మిషను శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకి కుట్టు మిషన్ల పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి
ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సత్యవతి రాథోడ్
బ్యాంక్ లింకేజి రుణాల చెక్కుల పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి
తొర్రూరు, రాయపర్తి, పెద్ద వంగర మండలాలకు కలిపి తొర్రూరు లో, పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాలకు కలిపి పాలకుర్తి ఘనంగా నిర్వహించిన సభలు
భారీగా హాజరైన డ్వాక్రా సంఘాల మహిళలు
హాజరైన ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ మహా నగర పాలక సంస్థ మేయర్ గుండు సుధారాణి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సల్తానియా, 3 జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, మహిళలు
పాలకుర్తి, తొర్రూరు లలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా మహిళా సంక్షేమ ఉత్సవాలు
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
పాలకుర్తి, తొర్రూరు: తొర్రూరు, పెద్ద వంగర, రాయపర్తి మండలాలను కలిపి తొర్రూరు లో గల ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో, పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాలను కలిపి పాలకుర్తి లో గల ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ మహిళ దినోత్సవం సందర్భంగా రెండవ విడత కుట్టు మిషను శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకి కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించగా, పాలకుర్తి సభకు రాష్ట్ర మహిళ, స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ హాజరయ్యారు.
తొర్రూరు సభలో రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరు అయ్యారు. కాగా అతిధులుగా, ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ మహా నగర పాలక సంస్థ మేయర్ గుండు సుధారాణి, ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు, మహబూబాబాద్, వరంగల్, జనగామ 3 జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు (స్థానిక సంస్థలు), అధికారులు,స్థానిక ప్రజా ప్రతినిధులు, ఈ రెండు సభలలో వివిధ డ్వాక్రా సంఘాలను చెందిన మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, సీఎం కెసిఆర్ గారు మహిళల పక్షపాతి. మహిళ సంక్షేమం గురించి అలోచించి అనేక సంస్కరణలు తీసుకొచ్చింది సీఎం కెసిఆర్ గారే. వారి ఆలోచనలు రాష్ట్రంలో పథకాలు గా మారి దేశానికి ఆదర్శంగా నిలిచాయి. కాంగ్రెస్, బీజేపీ లకు చిల్లర రాజకీయాలు చేయడం తప్ప వేరే తెలియదు. కాంగ్రెస్, బీజేపీ లు అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నాయి. సమైక్య పాలనలో ఏనాడు అయినా మహిళల సంక్షేమం గురించి ఆలోచించారా? అని ప్రశ్నించారు.
ప్రతి ఇంట్లో సంక్షేమం… ప్రతి ముఖంలో సంతోషం చూడాలన్నదే సీఎం కెసిఆర్ గారి లక్ష్యం. తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలు మన రాష్ట్ర ప్రగతికి గుర్తులు. తెలంగాణ రాష్ట్రం వచ్చాకే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు వస్తున్నాయి. సీఎం కెసిఆర్ గారికి అభివృద్ధి, సంక్షేమం రెండు రెండు కళ్ళు. బడ్జెట్ లో సగం సంక్షేమానికి ఇస్తున్నారు.అన్నారు.
అలాగే, సీఎం కెసిఆర్ ప్రత్యేకించి మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. ప్రతి పథకాన్ని మహిళలకు చెందే విధంగా చేస్తున్నారు. మహిళలకు స్థానిక సంస్థలలో 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. అనేక పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి తెలిపారు.
ఆడపిల్ల పెండ్లి కోసం ఆర్థిక భారంతో కుంగిపోయే నిరుపేద కుటుంబాలను పెండ్లి ఖర్చుల అవస్థల నుంచి గట్టెక్కించడానికి రాష్ట్రంలోని ప్రతీ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సాయం చేయాలని సీఎం కెసిఆర్ నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు ‘కల్యాణలక్ష్మి’ పథకాన్ని, మైనారిటీలకు షాదీముబారక్ పథకాలన్నీ ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఆడబిడ్డ పెండ్లి ఖర్చులకుగాను రూ.1,00,116 ఆర్థికసాయం అందిస్తున్నది. దివ్యాంగులకు కళ్యాణలక్ష్మి పథకం కింద రూ. 1,25,145 చెల్లిస్తున్నారు. 2014 నుండి 2023 మే మధ్య కాలంలో 12,71,839 నిరుపేద కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు రూ 11,130 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. అని మంత్రి వివరించారు.
మహిళలు, తల్లీ బిడ్డల సంక్షేమమే సమాజ ప్రగతికి తొలి మెట్టు. సీఎం కెసిఆర్ గారి పథకాలు మహిళ సమాజ పురోగతికి దోహదం చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమానికి సంబంధించి దేశంలోనే విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టింది. బ్యాంక్ లింకేజ్ రుణాలతో మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారు. పిల్లలు మరియు తల్లుల్లో పోషణలోపం లేకుండా చేయడానికి చర్యలు తీసుకోవడంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవడానికి ముందు గర్భిణులు, బాలింతలకు ఒక పూట భోజన పథకం 58 శాతం అంగన్ వాడీ కేంద్రాల్లో మాత్రమే అమలు చేయబడుతుండేది.
ఈ అంగన్వాడీ కేంద్రాలు నెలలో 25 రోజులు మాత్రమే పాలు, గుడ్లు పంపిణీ చేసేవారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు గర్భిణులు, బాలింతలు, చిన్నారులలో పౌష్టికాహార లోపం, రక్తహీనత నివారణకు గాను ‘ఆరోగ్యలక్ష్మి’ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ పథకం ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు బలవర్ధకమైన పౌష్ఠికాహారం ఇస్తున్నాం. ఇప్పటి వరకు, 20 లక్షల 72 వేల మంది గర్భిణులు, 15 లక్షల 42 వేలబాలింతలకు, 97 లక్షల 49 వేల 7 నెలల నుండి 3 సంవత్సరాలు వయస్సు పిల్లలు, 55 లక్షల 86 వేల 3 నుండి 6 సంవత్సరాల పిల్లలు ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం ద్వారా లబ్ధి పొందారని మంత్రి చెప్పారు.
మహిళలకి లైంగిక వేదింపులు, వర కట్న బాధిత మహిళలకు సహాయ సేవలను గాను సీఎం కెసిఆర్ గారి నిర్ణయం మేరకు సఖి కేంద్రాలు అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేశాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యవసర సహాయ సేవలను అందించడానికి సఖి కేంద్రాలకు రక్షణ వాహనాలు అందించాం. లైంగిక హింసకు గురైన పిల్లలు మరియు మహిళలకు అవసరమైన సేవలను అందించడానికి భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం కెసిఆర్ గారు సంకల్పించారన్నారు.
దీనితో పాటు షి టీమ్స్ ఏర్పాటు చేసి మహిళలను రక్షిస్తున్నాం ఈ కేంద్రాలు, షి టీమ్స్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. సీఎం కెసిఆర్ గారు మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసం SHE టాక్సీ పథకం ప్రారంభించారు. మహిళా ప్రయాణికుల భద్రత, ఉపాధి కోసం మహిళా డ్రైవర్లకు టాక్సీలు సబ్సిడీ ద్వారా అందిస్తున్నాం. మహిళలకోసం భారతదేశపు మొట్టమొదటి ప్రభుత్వ మోటర్ డైవింగ్ శిక్షణా కేంద్రం ను హైదరాబాద్ మహిళా ప్రాంగణంలో ఏర్పాటు చేశాం. హింసకు గురైన మహిళలు, బాలికలకు అశ్రయం, విద్య, వృత్తి శిక్షణలు అందించడం. కోసం మొత్తం 76 సదనాలు మరియు సంస్థలు పనిచేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కొన్ని వేల మందికి (ట్రాన్స్ జెండర్ మహిళలతో సహా) టైలరింగ్, బ్యూటీషియన్, కంప్యూటర్ శిక్షలు, చీరలపై ప్రింటింగ్, బాబ్ బ్యాగ్ తయారి మొదలైన వృత్తి విద్యలపై శిక్షణను ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు.
పాలకుర్తి నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని రెండు విడతలు గా మహిళలకు కుట్టు మిషన్ల శిక్షణను ఇచ్చి వారికి ఉచితంగా కుట్టు మిషన్లని ఇస్తున్నాం. వారికి ఉపాధి కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే టీచర్లు, సిబ్బంది సమైక్య పాలనలో చాలి చాలని జీతాలతో బతుకు బండి నడిపేవారు. వారి వేతనాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 300% పెంచారు. అంగన్వాడీ టీచర్ తెలంగాణకు ముందు రూ.4200 నెలకు ప్రస్తుతం రూ.13850 నెలకు, అంగన్వాడి హెల్పర్ 2,200 నెలకు ప్రస్తుతం రూ.7,800 నెలకు ఇస్తున్నాం. అంగన్వాడీ కార్యకర్త పేరును అంగన్వాడీ టీచర్ గా గౌరవప్రదమైన స్థాయికి చేర్చిన ఘనత సీఎం కెసిఆర్ గారిదని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.
అనాథలు, నిరాదరణకు గురైన పిల్లలను సంరక్షించడానికి రాష్ట్రంలో 17 శిశు గృహాలు సం.ల పిల్లలకు), 15 బాల సదనాలు (7 నుండి 10 సం.ల పిల్లలకు జువనైల్ హోమ్స్ ఏర్పాటు చేశాం. ఇవి దేశంలో ఎక్కడా లేని విధంగా ఏర్పాటు అయిన ప్రత్యేకమైన ప్రభుత్వ కార్యాలయాలు. ఇవి ఆపదలో, బ్బందుల్లో ఉన్న పిల్లలకు సమగ్ర సేవలను అందిస్తున్నాయను మంత్రి ఎర్రబెల్లి వివరించారు.
పాలకుర్తి సభలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, ఆకాశంలో సగం కానీ అవకాశాల్లో సగం రాలేదని, అలా అవకాశాలు ఇవ్వాలని సీఎం కెసిఆర్ గారు ఈ దశాబ్ది వేడుకల మహిళల సంక్షేమ ఉత్సవాలు జరపడం సంతోషదాయకం. ఈ సభను చూస్తుంటే పండుగ వాతావరణం కనిపిస్తున్నది. మీ అందరికీ శుభాకాంక్షలు. కెసిఆర్ కు ముందు ఇన్ని అవకాశాలు, ఇంత సంక్షేమం చూడలేదు. అప్పుడు ntr 9 శాతం రిజర్వేషన్ ఇస్తే పొంగిపోయినం. కానీ, సీఎం కెసిఆర్ 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. పోలీస్ ఉద్యోగాల్లో 33 శాతం, చదువు, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించారను తెలిపారు.
పథకాలన్నీ మహిళల పేరుతో ఇస్తున్నారు. కెసిఆర్ ఒక తండ్రి స్థానంలో ఉండి ఆలోచించి ఆరోగ్య పథకాలు తెచ్చారు. అంగన్వాడీ వర్కర్స్ ని టీచర్లు గా గౌరవిస్తారు. 4,200 నుండి 13,650 కి పెంచారు. ఆశా వర్కర్ల కు 9,750 కి పెంచారు. 16 వస్తువులతో కూడిన కెసిఆర్ కిట్ అందిస్తున్న తాత కెసిఆర్. మన ఇంట్లో పెళ్లికి పెద్ద దిక్కు గా కట్నం కింద డబ్బులు ఇస్తూ 12 వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత సీఎం కెసిఆర్. కెసిఆర్ కిట్ కోసం 1,600 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పెన్షన్లు 2016 కు పెంచారు. ఒంటరి మహిళలకు, కిడ్నీ, బోదకాలు, ఎయిడ్స్ బాధితులకు కూడా పెన్షన్లు ఇస్తున్న మహానుభావుడు సీఎం కెసిఆర్.అని మంత్రి సత్యవతి వివరించారు.
దయన్న లాంటి ఎమ్మెల్యే మీకు ఉండటం మీ అదృష్టం. మనకు మంచినీళ్ళు, పెన్షన్లు, రోడ్లు, మురుగునీటి కాలువలు మెటల్ చ్చే మంత్రి మన దయన్న. ఇన్ని సౌకర్యాలు చేయడం, ఈ శాఖలకు మంత్రి దయన్న ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టం. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ కు రాలేని నిధులు, మన పాలకుర్తి కి తెచ్చిన గొప్ప నాయకుడు మన దయన్న అని ఆమె కొనియాడారు.
పండుగలకు బతుకమ్మ చీరలు, రంజాన్, క్రిస్మస్ కానుకలు, సెలవులు ఇచ్చారు. దయన్న ను దివిస్తే, కెసిఆర్ ను దీవించినట్లే. ప్రతి ఒక్కరూ సీఎం కెసీఆర్ వెంట ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. అన్నారు.
ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ, మహిళల కోసం మన రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలు మరే రాష్ట్రంలో కూడా అమలు కావడం లేదని చెప్పారు. దేశం మొత్తం మన రాష్ట్రం వైపే చూస్తున్నాయని, సీఎం కెసిఆర్ నాయకత్వం, తెలంగాణ మోడల్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు.
వరంగల్ మహా నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ, కెసిఆర్ లాంటి సీఎం ను, దయన్న లాంటి మంత్రి, ఎమ్మెల్యే ను చూడలేమని తెలిపారు. తెలంగాణ లోని అభివృద్ధితో పోటీ పడుతూ, పాలకుర్తి ని అభివృద్ధి చేయడం మన దయన్న కే చెందిందని అన్నారు. సీఎం కెసిఆర్ కి, దయన్న కు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు మాట్లాడుతూ, ఇంతగా నియోజకర్గాన్ని, ప్రజలను పట్టించుకున్న వాళ్ళు లేరని అన్నారు. అయితే కొందరు వచ్చి, మాయ మాటలు చెబుతారు. ప్రజలను మోసం చేస్తారు. మీరు వాళ్ల మాయలో పడొద్దు. దయన్న ను, సీఎం కెసీఆర్ ను వదులుకోవద్దు అన్నారు.
పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తా నియా మాట్లాడుతూ, మహిళల కోసం చేపట్టిన ప్రతి కార్యక్రమం విశేషమైనది. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని మహిళలకే అందిస్తున్నారు. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. విద్యా, ఉద్యోగాలు, వ్యాపారాలు, క్రీడలు రంగం ఏదైనా మహిళలే రాణిస్తున్నారు. మహిళలు బాగుంటే, కుటుంబం నుంచి దేశం వరకు బాగుపడుతుంది అన్నారు.
పలువురు మహిళా ప్రజా ప్రతినిధులు, మహిళలు మహిళా సంక్షేమం పై మాట్లాడారు. ఈ సందర్భంగా మహిళా ఉత్పత్తులను ప్రదర్శించారు. వాటిని మంత్రి పరిశీలించారు. అలాగే మంత్రికి మహిళలు ఘనంగా బతుకమ్మ లతో స్వాగతం పలికారు. సంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.