హైదరాబాద్ : వర్షాకాలంలో కంటోన్మెంట్ పరిధిలో ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులపై బోర్డు సమావేశంలో చర్చించామన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… రోడ్లు, నాళాలు, సీవరేజ్ ప్లాంట్ ఏర్పాటు అంశాలపై సమావేశంలో చర్చించాం.
మాజీ ఎంపీ నంది ఎల్లయ్య, మాజీ ఎమ్మెల్యే సాయన్న విగ్రహాలను కంటోన్మెంట్ పరిధిలో ఏర్పాటు చేయాలని సమావేశంలో చర్చించాం. ఇందుకు సరైన స్థలాన్ని బోర్డు పరిశీలిస్తామని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కంటోన్మెంట్ కు రావాల్సిన నిధులు సరైన సమయంలో విడుదల చేయడంలేదు.
దీనివల్ల కంటోన్మెంట్ అభివృద్ధి కుంటుపడుతోంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ కు రావాల్సిన నిధులు విడుదల చేయాలి. లేకపోతే కోర్టుకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను కంటోన్మెంట్ బోర్డు రాబట్టుకోవాలి.
కంటోన్మెంట్ లో వచ్చిన ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దొంగిలిస్తోది. ఇది నియమ, నిబంధనలకు విరుద్ధం కేంద్రం నుంచి కంటోన్మెంట్ కు రావాల్సిన నిధులను తక్షణమే విడుదల చేయించేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపాలి.
తలసాని వ్యాఖ్యలకు కౌంటర్
పేడ పిసికే అలవాటున్న తలసానికి పిసుకుడు గురించే మాట్లాడుతారు. పిసుకుడు సంగతి దేవుడెరుగు.. అతను నమిలే పాన్ పరాక్ మానేస్తే బాగుంటుంది. అరతిపళ్ల బండిదగ్గర మేక నమిలినట్లు పాన్ పరాక్ లు నమిలే వారు కూడా నా గురించి మాట్లాడితే అంత గౌరవంగా ఉండదు.
ఆయనకు అంతగా కోరిక ఉంటే.. ఏం పిసకాలనుకుంటున్నారో, ఎక్కడకు రావాలో తారీఖు చెబితే వస్తా… ఎవరేం పిసుకుతారో చూద్దాం. కేసీఆర్ కాళ్లు పిసకడం అనుకుంటున్నాడా రేవంత్ రెడ్డిని పిసకడం అంటే…
మంత్రిగా మాట్లాడేటప్పుడు బాధ్యతగా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. నేను పీసీసీసీ అధ్యక్షుడిని. తలసాని జీవితాంతం కేసీఆర్ కాళ్లు పిసికినా నా స్థాయికి రాలేరు.