మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యం
యువతకు బాసటగా తెలంగాణ ప్రభుత్వం
రైతును రాజును చేయడమే సిఎం కెసిఆర్ ధ్యేయం
రాయపర్తి మండలంలో మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
పెరకవేడులో కుట్టు శిక్షణ ముగింపు ఉత్సవం
కాట్రపల్లిలో కుట్టు శిక్షణ కేంద్రం సందర్శన
రాయపర్తిలో క్రమబద్ధీకరించిన ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ
నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
రాయపర్తి : మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే, ఆ కుటుంబం, గ్రామం, రాష్ట్రం, దేశం బాగుపడుతుందని, అందుకే సీఎం కెసిఆర్ ఆశీస్సులతో తాను, ప్రభుత్వం కూడా మహిళల ఆర్థిక అభివృద్ధి కోసమే పాటుపడుతున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం, రాయపర్తి మండలంలో మంత్రి ఎర్రబెల్లి శనివారం సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రాయపర్తి మండలం సూర్యాతండా జాంబవ రైతు ఉత్పత్తిదారుల సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
రాయపర్తి మండలం పెరవేడులో మ్యాక్స్ భవనంలో కుట్టు శిక్షణ ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి, శిక్షణ ముగించుకున్న మహిళలతో కొద్దిసేపు మాట్లాడారు. శిక్షణ తీరు తెన్నులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత రాయపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉషోదయ రైతు ఉత్పత్తిదారుల సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే, అనంతరం జీవో 58,59 ప్రకారం క్రమబద్ధీకరించిన ఇండ్ల పట్టాలను పలువురికి పంపిణీ చేశారు. కాట్రపల్లిలో రైతు వేదికలో నిర్వహిస్తున్న కుట్టు శిక్షణా కేంద్రాన్ని పరిశీలించారు.
ఆయా చోట్ల వేర్వేరుగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగా ఎదిగితే ఆ కుటుంబం సహా, దేశం బాగుపడుతుందన్నారు. సహజంగా మహిళల్లో పొదుపు, మదుపు, నిర్వహణ అద్భుతంగా ఉంటాయని చెప్పారు. అందుకే సిఎం కెసిఆర్ మహిళా సాధికారత మీద ప్రత్యేక దృష్టి సారించారన్నారు. పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా, స్త్రీ నిధి సంస్థ ద్వారా డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ, వడ్డీలేని, బ్యాంకు లింకేజీ రుణాలు అందచేస్తున్నామన్నారు. మహిళల రికవరీ బాగుండటం వల్ల బ్యాంకులు కూడా ఎంత అడిగితే అంత మహిళలకు ఇస్తున్నారన్నారు.
అలాగే, రాష్ట్రంలోనే మొదటిసారిగా పైలెట్ ప్రాజెక్టుగా పాలకుర్తి నియోజకవర్గంలో చేపట్టి ఉచిత కుట్టు శిక్షణ, ఉచితంగా కుట్టు మిషన్‌ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. రూ.5 కోట్ల నిధులతో 3 వేల మందికి ఈ శిక్షణ ఇస్తున్నామని, ఈ విడత పూర్తి కాగానే, మిగతా 7 వేల మందికి శిక్షణ ఇస్తామని, మిషన్లు కూడా పంపిణీ చేస్తామని చెప్పారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి వరంగల్ టెక్స్ టైల్ పార్క్ లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. కనీసం 10వేల మంది అవసరం ఉందని, ఇప్పటికిప్పుడు శిక్షణ పూర్తి చేసుకున్న వాళ్ళఃదరికీ దాదాపు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. అలాగే యువకుల కోసం కూడా ఇలాంటి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించే విధంగా ఏర్పాట్టు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఇక ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలు కేంద్రాలను ఏర్పాటు చేసి, ఆయా రైతుల పంటలను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని మంత్రి ఎర్రబెల్ల చెప్పారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్న వైనాన్ని చూసిన సీఎం, ధాన్యం, మక్కలను కోనుగోలు చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే రైతులకు ఎదురు పెట్టుబడి సత్ఉన్న సీఎం, ఉచిత విద్యుత్, సాగునీరు సమృద్ధిగా అందిస్తున్నారన్నారు. ఈ దశలోనే ప్రభుత్వానికి భారమైనప్పటికీ, నష్టాలను భరిస్తూ రైతుల కోసం సిఎం ఇదంతా చేస్తున్నారన్నారు.
రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పిన మనసున్న మహరాజు మన సిఎం కెసిఆర్ అన్నారు. అలాగే ముందుగా కొనబోమని చెప్పినప్పటికీ, రైతుల కోసమే మక్కలను కొనుగోలు చేస్తున్నారని, నష్ట పరిహారాన్ని ఎకరాకు రూ.10వేలు ఇస్తున్న ది కూడా ఒక్క తెలంగాణ రాష్ట్రమేనని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, డిఆర్ డిఓ సంపత్ రావు, సంబంధిత అధికారులు, రైతులు, మహిళలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
హనుమకొండ జిల్లా పెద్ద పెండ్యాల కరుణాపురం క్రీస్తు జ్యోతి చర్చిని ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఈ సందర్భంగా ఏసు భక్తులతో కలిసి మంత్రి చర్చీలో ప్రార్థనలు చేశారు.
చర్చీ పెద్దలు, ఫాదర్స్ అంతా కలిసి మంత్రి ఎర్రబెల్లికి ఆశీర్వచనం అందించారు.
కరుణాపురం క్రీస్తు జ్యోతి చర్చి ప్రారంభోత్సవానికి అనేక ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ఏసు భక్తులందరికీ శుభాకాంక్షలు! దాదాపు 150 కోట్లతో ఆసియా ఖండంలోనే అతి పెద్ద చర్చిని నిర్మించిన పాల్ సన్ రాజ్ అతని బృందానికి అభినందనలు!
ఈ కరుణాపురం చర్చికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. క్రీస్తు జ్యోతి చర్చి ఆసియాలోనే అతి పెద్ద చర్చి అత్యధికంగా ఖర్చు చేసిన ఈ నిధులన్నీ మొత్తం ప్రజలు ఇచ్చిన విరాళాలతోనే కట్టడం విశేషం. 40వేల ప్రజలు సీటింగ్ కెపాసిటీ ఉన్న చర్చి ఇదే చర్చి గోపురం అమెరికా నుంచి తెప్పించారు.
వియత్నాం, ఫ్రాన్స్ నుంచి మరికొన్ని టైల్స్ వంటివి తెప్పించారు. చర్చిలోపల అభివృద్ధికి నా వంతుగా నేను కోటి రూపాయలు ఇచ్చాను. ఇక్కడ ప్రతి ఏటా ఈ పూజలు ఘనంగా జరుగుతున్నాయి. శాంతి, కరుణ, ప్రేమ, సేవ అన్న క్రీస్తు బోధనలు అందరికీ ఆచరణీయం. అందరినీ ప్రేమించాలి. శాంతి మార్గంలో నడవాలి సేవాభావంతో మెలగాలి అన్న క్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆచరణీయము.
క్రీస్తు బాటలో నడిస్తే ఈ ప్రపంచంలో మోసాలు, పాపాలు ఉండవు. యుద్దాలకు ఆస్కారం ఉండదు. అన్ని మతాల సారం మానవత్వమే, అన్ని మతాలకు దేవుడు ఒక్కడే. ఇవే బోధనల ప్రేరణతో మన సీఎం కెసిఆర్ గారు పరిపాలన చేస్తున్నారు. సిఎం కేసిఆర్ గారు అన్ని మతాలను సమానంగా చూస్తూ అధికారికంగా అన్ని పండుగలు నిర్వహిస్తున్నారు
తెలంగాణలో క్రిస్టియన్ మైనారిటీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. దేశం మొత్తంలో క్రిస్మస్ పండగను అధికారికంగా నిర్వహిస్తూ, 2 లక్షల 85వేల మంది క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు నూతన బట్టలిచ్చి, విందు ఇస్తున్న గొప్ప సంస్కృతిని నెలకొల్పిన ఏకైక ముఖ్యమంత్రి కేసిఆర్ గారు.
క్రిస్టియన్ మైనారిటీల ఆత్మగౌరవం పెంపొందించేలా వారికి 2 ఎకరాల స్థలంలో 10 కోట్ల రూపాయలతో క్రిస్టియన్ భవనం నిర్మిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా చర్చిల నిర్మాణానికి, మరమ్మత్తులకు, ఆధునీకరణకు, మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టేందుకు అనుమతినిచ్చిన ఏకైక ప్రభుత్వం. క్రిస్టియన్ విద్యార్థులు నాణ్యమైన విద్య పొందేందుకు రెసిడెన్షియల్ పాఠశాలల్లో అడ్మిషన్లు ఇస్తున్నారు.
విదేశాల్లో విద్య అభ్యసించేందుకు ఓవర్సీస్ స్కాలర్ షిప్ 20 లక్షల రూపాయలు అందిస్తున్నారు. క్రిస్టియన్ యువతకు ఉపాధి కల్పించేందుకు డ్రైవర్ ఎంపవర్ మెంట్ కింద 60 శాతం సబ్సిడీతో కార్లను అందిస్తున్నారు. రూ.10 లక్షల వరకు సబ్సిడీ అందేలా బ్యాంకు లింకేజీతో రుణాలు కల్పిస్తున్నారు.
ఇప్పటి వరకు 1718 మందికి 19 కోట్ల రూపాయలను సబ్సిడీగా కెసిఆర్ ప్రభుత్వం అందించింది. టిఎస్ ప్రైమ్ కింద క్రిస్టియన్ మైనారిటీ యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తున్నాము. ఐటి పారిశ్రామిక వేత్తల కోసం ఐటి పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇలా క్రిస్టియన్ మైనారిటీల సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసిఆర్ గారి నాయకత్వంలో కృషి చేస్తోంది.
దీనిని క్రిస్టియన్లందరూ గుర్తించి కేసిఆర్ గారికి మద్దతుగా నిలవాలి. ఈ కార్యక్రమంలో చర్చి ఫాదర్ పాల్ సన్ రాజ్, గోపు జయప్రకాశ్, వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన క్రీస్తు భక్తులు తదితరులు పాల్గొన్నారు.