హైదరాబాద్ : JNTU-హైదరాబాద్ కాంపస్ లో గల యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సైన్స్ ఆండ్ టెక్నాలజీ, PG విద్యార్థులు టెక్నికల్ ఫెస్ట్ ఆవిష్కార్ 2023 ను మే 10 నుండి 12 వరుకు నిర్వహిస్తున్నారు.
అందులో భాగంగా మంగళవారం ఫెస్ట కన్వీనర్ Prof Dr సైదా, కో-కన్వీనర్ Prof Dr T విజయలక్ష్మీ మరియు Prof M సునితా రెడ్డీ ఆటల పోటీలను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ… చదువుతో పాటు ఆటలు కూడ విద్యార్థుల జీవితంలో ఎంతో ముఖ్యమని, అందరూ కలిసిమెలసి ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేకుండ ఈ యోక్క టెక్నికల్ ఫెస్ట్ ను విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో Prof Dr హిమబిందు, Dr శశికళ, Dr జయశ్రీ, Dr ఉమ, Dr అర్చన గిరి, Dr వంశికృష్ణ రెడ్డీ, Dr దిలీప్, PD అశోక్, హరి మరియు స్టూడెంట్ కో-ఆర్డినేటర్లు తదతరులు పాల్గోన్నారు.
