హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ నూతన సచివాలయ భవనంలో తనకు కేటాయించిన కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి గారు ఆసీనురాలయ్యారు.
రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో పని చేస్తున్న 19,800 మంది ఉపాధ్యాయులకు రూ. 34.25 కొట్లతో ట్యాబ్ లను, 5వేల ప్రాథమిక పాఠశాలల్లో లైబ్రరీ కార్నర్ లను ఏర్పాటు చేసే ఫైళ్ళ పై నూతన సచివాలయంలో తొలి సంతకం చేసిన విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి గారు.
పాఠశాలలను పునః ప్రారంభించే నాటికి అనగా జూన్ 12 వ తేదీ నాటికి ట్యాబ్ లను ఉపాధ్యాయులకు అందించడం జరుగుతుంది. అదే విధంగా లైబ్రరీ కార్నర్ లను కూడా జూన్ 12 వ తేదీ నాటికి ఏర్పాటు చేస్తారు.
నూతన సచివాలయం మొదటి అంతస్తులోని బి వింగ్ కార్యాలయం నుంచి మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి గారు ఇకనుంచి తన విధులను నిర్వర్తించనున్నారు.