हैदराबाद : पल भर का क्रोध या चिंता दो लोगों की आत्महत्या का कारण बन गई। कारणों का पता नहीं चला है, लेकिन पल भर में गुस्से में लिए गए फैसले ने एक खुशहाल दंपत्ति जीवन का अंत कर दिया। तेलंगाना के जनगांव जिले में एसएस दंपती की आत्महत्या की घटना से मातम छा गया है।
मिली जानकारी के अनुसार, जनगांव जिला केंद्र में एसआई दंपति ने आत्महत्या कर ली है। जनगांव टाउन पुलिस स्टेशन में श्रीनिवास एसआई के रूप में काम करते हुए शहर में रह रहा था। दंपत्ति को दो बेटे हैं। एसआई श्रीनिवास की पत्नी कासरला स्वरूप ने आज सुबह फांसी लगाकर आत्महत्या कर ली। उसने बाथरूम में फांसी लगा ली।
एसआई श्रीनिवास पत्नी की आत्महत्या को बर्दाश्त नहीं कर पाया। पत्नी के पास खूब रोया। श्रीनिवास के रोने के दृश्य से सभी की आंखें नम हो गई। पत्नी की मौत से दुखी श्रीनिवास बाथरूम में गया और अपनी सर्विस रिवॉल्वर से खुद को गोली मारकर आत्महत्या कर ली। आत्महत्या के कारणों का पता तो नहीं चल पाया है। मगर एसआई दंपत्ति के आत्महत्या फैसले से दो बच्चे अनाथ हो गये।
ఉరేసుకొని భార్య, రివాల్వర్‌తో కాల్చుకొని భర్త, ఎస్సై దంపతుల ఆత్మహత్య
హైదరాబాద్ : క్షణికావేశం రెండు ప్రాణాలు తీసింది. కారణాలు ఏంటో తెలీదు కానీ ఓ బలహీన క్షణంలో ఆవేశంతో తీసుకున్న నిర్ణయం అప్పటిదాకా సంతోషంగా సాగుతున్న జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేలా చేసింది. జనగామ జిల్లాలో జరిగిన ఎస్సై దంపతుల ఆత్మహత్య ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే జనగామ జిల్లా కేంద్రంలో ఎస్సై శ్రీనివాస్ దంపతుల బలవన్మరణానికి పాల్పడ్డారు. జనగాం టౌన్ పోలీస్ స్టేషన్‌లో శ్రీనివాస్ ఎస్సైగా విధులు నిర్వహిస్తూ పట్టణంలోనే నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ఇవాళ ఉదయం ఎస్సై శ్రీనివాస్ భార్య కాసర్ల స్వరూప ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బాత్‌రూంలో ఉరేసుకొని ఆమె తనువు చాలించారు.
భార్య దూరమైందన్న సంగతిని ఎస్సై శ్రీనివాస్ భరించలేకపోయారు. ఆమె మృతదేహాం వద్ద గండెలవిసేలా రోధించాడు. శ్రీనివాస్ రోదిస్తున్న దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించాయి. అప్పటిదాకా తోడూనీడగా నిలిచిన అర్థాంగి దూరమైన సంగతిని శ్రీనివాస్ జీర్ణించుకోలేకపోయాడు. మనస్తాపం చెందిన ఆయన బాత్‌రూంలోకి వెళ్లి తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారు.
ఎస్‌ఐ దంపతుల ఆత్మహత్యకు గల కారణాలపై స్ఫష్టత లేనప్పటికీ క్షణికావేశంలో భార్యాభర్తలు తీసుకున్న నిర్ణయం వారి ఇద్దరి కొడుకులను అనాథలుగా మార్చింది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబ కలహాలు, దంపతుల మధ్య తలెత్తిన ఘర్షణే ఆత్మహత్యలకు కారణంగా తెలుస్తోంది. పోలీసుల విచారణ తర్వాత పూర్తిస్థాయి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. (ఏజెన్సీలు)