“టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ తీగ లాగితే లింక్ ప్రగతి భవన్లో తేలింది”

లింగారెడ్డి బావమరిది రాజశేఖర్ రెడ్డి సీఎంవో ఉద్యోగి

మా ఫిర్యాదుతోనే ఈడీ కేసు నమోదు

టీఎస్పీఎస్సీ పాలకమండలిని రద్దు చేయాలి

10 నుంచి తిరిగి హాత్ సే హాత్ జోడో యాత్ర

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ తీగ లాగితే లింక్ ప్రగతి భవన్లో తేలిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలనం ఆరోపణలు చేశారు.పేపర్ లీక్ పై విచారణ ఎదుర్కొంటున్న టీఎస్పీఎస్సీ సభ్యుడు లింగారెడ్డి బావమరిది రాజశేఖర్ రెడ్డి సీఎంవోలో పని చేస్తున్నారు. కేసీఆర్ కు రాజశేఖర్ రెడ్డికి ఉన్న అనుబంధం తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.

పేపర్ లీకేజీ వ్యవహారంపై టీ కాంగ్రెస్ ఫిర్యాదు చేయడంతోనే ఈడీ కేసు నమోదు చేసిందని తెలిపారు. మా పోరాటం, ఒత్తిడి ఫలించాయన్నారు. పూర్తి స్థాయిలో పోరాట కార్యాచరణతో ముందుకెళతాం. టీఎస్పీఎస్సీ వ్యవహారాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాల్సిందే అనే డిమాండ్ ను మరోసారి పునరుద్ఘాటించారు. టీఎస్పీఎస్ సీ కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

తక్షణమే టీఎస్పీఎస్సీ పాలకమండలిని రద్దు చేసి కొత్త నియామకాలు చేపట్టాలి. ఇప్పుడున్న కమిటీపై తెలంగాణ ప్రజలకు విశ్వసనీయత లేదు. కొత్త కమిటీ ఏర్పాటు చేశాకే పరీక్షలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పేపర్ల లీకేజీపై కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ దాఖలు చేసిన పిటిషన్ కోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. ఏప్రిల్ 25న సీఎం కేసీఆర్ ఇలాకా గజ్వేల్‌లో భారీ నిరుద్యోగ సభ నిర్వహించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.

ఈ నెల 10న జుక్కల్ నుంచి హాత్ సే హాత్ పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుందన్నారు.

ప్రధాని మోడీ, అమిత్ షా కలిసి అదానీకి ప్రజాధనం దోచిపెడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.2014లో 20వేల కోట్లు ఉన్న ఆదానీ 2023 జనవరి 15 నాటికి 13 లక్షల కోట్లకు ఎగబాకారు. మోదీ, అమిత్ షా సహకారంతోనే ఆదానీ ప్రజా ధనాన్ని లూఠీ చేశారు. ప్రజాధనం లూటీ చేయడం వల్లే అదానీ సంపద పెరిగిందని ఆరోపించారు. ఎల్ఐసీ, ఎస్బీఐ, ఇతరు సంస్థలను అదానీ మోసం చేశారని అన్నారు. కృత్రిమంగా షేర్ల విలువ పెంచి వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టారని ఆరోపించారు. అవినీతి చేయడం వల్ల అదానీకి చెందిన రూ.11 లక్షల కోట్లు ఆవిరి అయ్యాయని తెలిపారు. ఈ విషయాలన్నీ పార్లమెంట్‌లో మాట్లాడితే అన్ని బయటకు వస్తాయనే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని మండిపడ్డారు.

ప్రధాని మోడీ, అమిత్ షా రాహుల్ గాంధీపై కక్ష కట్టారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిజాయతీ గల కుటుంబం నుండి వచ్చాడన్నారు. రాహుల్ ఉన్న ఇంటిని కూడా ఖాళీ చేయించి ఆయనపై బీజేపీ ప్రభుత్వం కక్ష సాధిస్తోందని విమర్శించారు. నడిబజార్లో నిలబెట్టి పైశాచిక ఆనందం పొందాలని చూశారని మోదీ ప్రభుత్వం పై ఫైరయ్యారు. ఇందుకు నిరసనగా రేపు పోస్టు కార్డు ఉద్యమం చేపడతాం. రాహుల్ పై అనర్హత వేటు, టీఎస్ పీఎస్ సీ పేపర్లీక్ పై జనంలోకి వెళ్తామన్నారు రేవంత్. రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా ఏప్రిల్ 3 నుంచి పోస్ట్ కార్డుల ఉద్యమం చేపడ్తామని చెప్పారు. ఈ నెల 8న మంచిర్యాలలో భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపడతామన్నారు.వచ్చే ఎన్నికల్లో కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. తెలంగాణలో వచ్చినట్లేనని రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ నెల 7న కాంగ్రెస్ ఆధ్వర్యంలో రంజాన్ నేపథ్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. షర్మిలతో కలిసి వెళ్లవద్దని మా కమిటీ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. టీఆరెస్, బీజేపీ కాకుండా మేం చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో ఎవరు పాల్గొన్నా అభ్యంతరం లేదన్నారు. బీజేపీ నేతలు పేపర్ పులుల్లా టీవీల ముందు రంకెలు వేయొద్దు. పేపర్ లీక్ పై అమిత్ షా కు ఎందుకు పిర్యాదు చేయలేదు? అని కిషన్ రెడ్డి, బండి సంజయ్ పై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ అంశంపై గవర్నర్ కు కిషన్ రెడ్డి ఎందుకు లేఖ రాయలేదు? అని ప్రశ్నించారు.

బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మద్దతుగా నిలవాలని గద్దర్ ను కోరామన్నారు. భవిష్యత్ లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గద్దర్ గళం వినిపిస్తారు. రాహుల్ గాంధీ సత్యాగ్రహ దీక్షలో పాల్గొనాలని గద్దర్ ను ప్రత్యేకంగా కోరామని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఆ విషయంలో సీఎం కేసీఆర్‌ను మించినోడు లేడు: రేవంత్ రెడ్డి

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై మరోసారి ధ్వజమెత్తారు. పచ్చి అబద్ధాలను కూడా ఇదే నిజం అని నమ్మించేలా చెప్పడంలో కేసీఆర్ ను మించినవాళ్లు లేరని విమర్శించారు.

తెలంగాణలో రైతుల ఆత్మహత్యల గణాంకాలు ఎన్సీఆర్బీ రికార్డుల్లో భద్రంగా ఉన్నాయని తెలిపారు. రైతులు ఉరికొయ్యకు వేలాడిన ఘటనలు లెక్కకు రానివి ఇంతకు పదింతలు ఉన్నాయని రేవంత్ పేర్కొన్నారు. రైతు స్వరాజ్య వేదిక సమక్షంలో చర్చకు కూర్చుందాం… తెలంగాణలో ఆత్మహత్యలు లేవన్న వ్యాఖ్యల్లో నిజమెంతో నిగ్గు తేల్చుదాం… కేసీఆర్ సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు.

నిన్న హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మహారాష్ట్ర రైతు సంఘం నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేవని చెప్పేందుకు గర్విస్తున్నానని తెలిపారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ప్రస్తుతం సున్నా అని తెలిపారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి పైవిధంగా ట్విట్టర్ లో స్పందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X