నందమూరి తారకరామారావు గారి గురించి కరుణశ్రీ గారు చెప్పిన పద్యం..
రాముడవై సజ్జనులకు,
భీముడవై దుర్జనులకు, పృథివికి శ్రేయః
కాముడవై తులసీదళ
దాముడవై పరిమళించు తారకరామా..
అన్నట్లుగా ప్రజాస్వామ్యం లో అడుగుపెట్టి తెలుగుదేశం పార్టీని స్థాపించి, నవ శకానికి నాంది పలికిన మహనీయుడు. తెలుగు సినిమా రంగంలో తిరుగులేని రారాజు, సౌకర్యవంతమైన జీవితం అనుభవిస్తూ, ఉన్నతంగా బ్రతుకుతూ ఉన్నప్పటికీ, తనను ఆదరించి తన ఎదుగుదలకు కారణమైన ప్రజలకు ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో, తెలుగువారి గుర్తింపుకోసం నిత్యము తహతహలాడుతు. ప్రజల రుణం తీర్చుకునేందుకు “సమాజమే దేవాలయం అని ప్రజలే దేవుళ్ళు” తెలుగు దేశం పార్టీని స్థాపించడం జరిగింది.
1982, మార్చి 29న ప్రారంభం
తెలుగుదేశం పార్టీ లేదా తె.దే.పా (TDP) భారతదేశంలోని, ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించాడు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు. పార్టీ స్థాపించిన తరువాత సన్యాసము పుచ్చుకొని తన జీవితము తెలుగు ప్రజలకు, తెలుగు జాతి ఆత్మగౌరవ పునరుద్ధరణకే తన జీవితము అంకితమని ప్రతినబూనాడు.
చైతన్య రధంపై సుడిగాలి పర్యటన
నందమూరి తారక రామారావు తన చైతన్య రధంపై సుడిగాలి పర్యటన జరిపి ఎన్నికల ప్రచారం కొనసాగించారు. అప్పటికే సినిమా రంగంలో సాధించిన అనితరసాధ్యమైన ఆదరణతో ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. తెలుగువారి “ఆత్మగౌరవ” నినాదంతొ, పార్టీ పెట్టిన 9 నెలలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి తెలుగుదేశం పార్టీ అందరినీ ఆశ్చర్యపరచింది. సినిమావాళ్ళకు రాజకీయాలేమి తెలుసన్న అప్పటి ప్రధాని “ఇందిరా గాంధీ” హేళనకు గట్టి జవాబు చెప్పారు.
కిలోబియ్యం రెండు రూపాయలు
అంతే కాదు అప్పట్లో ఉన్న 42 లోక్‌సభ స్థానాలకుగాను 35 స్థానాలను గెలుచుకుని ప్రత్యర్థులను మట్టికరిపించింది. ఆ సంవత్సరం దేశం మొత్తం మీద 544 లోక్‌సభ స్థానాలకుగాను 400 స్థానాలను గెలుచుకున్న కాంగ్రేసు హవా కొనసాగుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో మట్టుకు తెలుగుదేశం విజయం వలన, అప్పటి లోక్‌సభలో కూడా ప్రధాన ప్రతిపక్షమయింది. తెలుగుదేశం పదవిలోకి వచ్చిన తొలివిడత, ప్రజా బాహుళ్యమైన కిలోబియ్యం రెండు రూపాయల పధకాన్ని అమలు పరిచింది.
తెలుగుతల్లి ముద్దుబిడ్డ
వ్యక్తిత్వరీత్యా ఆవేశపరుడిగా కనిపించినా, పేద ప్రజల గుండెలలో ఛిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప పేరు సాధించిన నాయకుడు రామారావు. ముఖ్యంగా “మదరాసీ” లుగా మాత్రమే గుర్తింపబడుతున్న తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఉత్తేజపరిచి, ప్రపంచానికి తెలుగువారి ఉనికిని చాటిన ధీశాలి, తెలుగుతల్లి ముద్దుబిడ్డ, శ్రీ నందమూరి తారక రామారావు. రాజకీయ సన్యాసిగా కాషాయ వస్త్రధారణ చేసినా, “ఒక్క రూపాయి” మాత్రమే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి భృతిగా స్వీకరించినా, అది కేవలం ఎన్.టి.ఆర్.కు మాత్రమే చెల్లింది. 1989లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి తెలుగుదేశం పార్టీ అధికారం నుండి తప్పుకుంది.
నేషనల్ ఫ్రంట్
దేశం లోని కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలని చిన్న చిన్న జాతీయ పార్టీలను ఒక తాటి పైకి తెచ్చి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా “నేషనల్ ఫ్రంట్” కూటమిని స్థాపించి కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకుని వి.పి.సింగ్ ని ప్రధానిని చేశారు “నేషనల్ ఫ్రంట్”కు చైర్మెన్ గా వ్యవహరించారు.1994లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. రామారావు మూడవ సారి ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
తెలుగుజాతికీ, తెలుగుభాషకూ గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్
సిసలైన ప్రజానాయకుడు ఎన్టీఆర్. ఆంధ్ర ప్రదేశ్ లో, అతను సమకాలికుల్లో అతనుంతటి ప్రజానాయకుడు మరొకరు లేరు. వటవృక్షంలాంటి కాంగ్రెసు పార్టీకి ఆంధ్ర ప్రదేశ్ లో దీటైన ప్రత్యామ్నాయాన్ని నిలబెట్టిన గొప్పదనం. పట్టుదలకూ, క్రమశిక్షణకు మారుపేరైన వ్యక్తి అతను. ఈ కారణాలవల్లనే కాంగ్రెసు పార్టీని ఎదుర్కొని స్థిరమైన ప్రభుత్వాన్నీ, ప్రభావవంతమైన ప్రతిపక్షాన్ని రాష్ట్ర ప్రజలకు ఇవ్వగలిగారు. తెలుగుజాతికీ, తెలుగుభాషకూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్.
స్త్రీలకు ఆస్తిలో వాటా
స్త్రీలకు ఆస్తిలో వాటా ఉండాలని చట్టం తెచ్చిన ఘనత ఆయనకే చెల్లింది.బలహీన వర్గాలకు లక్షలాదిగా ఇళ్ళు కట్టించిన గొప్పతనం దక్కింది.రెండు రూపాయలకే కిలో బియ్యం వాగ్దానం చేసి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులకు ఓర్చి, తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. తెలుగుగంగ ప్రాజెక్టులో పట్టుబట్టి రాయలసీమ సాగునీటి అంశాన్ని చేర్చిన ఘనత కూడా రామారావు. దేశంలో ప్రధాన ప్రతిపక్షాలను ఒకతాటిపైకి తెచ్చిన నేత అతను.
బాగా చదువుకున్నవారిని రాజకీయాలకు పరిచయం
ఎందరో కొత్తవారిని, బాగా చదువుకున్నవారిని రాజకీయాలకు పరిచయం చేసి, ఒంటిచేత్తో వారిని గెలిపించిన ప్రజానాయకుడు అతను. దేవేందర్ గౌడ్, కె.చంద్రశేఖరరావు మొదలైన నేతలు అతను పరిచయం చేసినవారే.“నక్సలైట్లు కూడా దేశభక్తులే బ్రదర్” అంటూ సమర్థించటం ఒక విశేషం.మహిళలకు ఆస్తి హక్కు, వెనుకబడినకులాల వారికి రిజర్వేషన్లు, పురోహితులుగా ఎవరైనా ఉండవచ్చుననే అంశం.రామారావుగారికి బాబాల, మాతల పిచ్చి లేదు. దేవునిపట్ల భక్తి ఉంది. బుద్ధునిపట్ల అపార గౌరవమున్నది.
విధానాలు
రామారావుగారి కొన్ని విధానాలు: ప్రజల యొక్క శక్తిని వినియోగించుకోవడం. గంగ నుంచి కావేరి వరకు నదుల అనుసంధానం. కూడు, గూడు, గుడ్డ. ప్రతి స్వాతంత్ర పౌరుడికి ఇవ్వాలి. నిర్బంధ ఉచిత విద్య.అందరికి ఆరోగ్యం. ఉచిత వైద్యం. హెల్త్ కార్డ్.ఆడవాళ్ళకు సమాన ఆస్థి హక్కు. వారి నాయకత్వన జరిగిన కార్యక్రమాల.
వర్గాలవారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు
జాబిత: ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అప్పటిదాకా రెడ్డి కులం వారికి మాత్రమే అన్ని రాజకీయ పదవులను కట్టబెట్టడంతో, ఎన్టీఆర్ మిగతా కులముల వారికి ఆశాకిరణం లాగ కనిపించారు ఎన్టీఆర్ మొట్ట మొదటి సారిగా అన్ని కులముల వారికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలవారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు కల్పించారు. అయన చేసిన కృషి ఫలితంగా ఈనాటికి బడుగు బలహీన వర్గాలు. తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు.
పటేల్ పట్వారి వ్యవస్థ లని రద్దు
తెలంగాణాలో బడుగు బలహీనవర్గాలని పట్టి పీడుస్తున్న పటేల్ పట్వారి వ్యవస్థ లని రద్దు చేసి తెలంగాణాలోని బడుగు బలహీన వర్గాలకి ఆరాధ్యదైవంగా మారినారు.
కొప్పుల ప్రసాద్,
తెలుగు ఉపన్యాసకులు,
నంద్యాల,
9885066235