పాదయాత్ర పేరుతో బీజేపీ, కాంగ్రెస్ ప్రజలను రెచ్చగొడుతున్నారు
మేం తలుచుకుంటే మీరు పల్లెల్లో తిరుగలేరు
ఐనా మా నాయకులు, కార్యకర్తలు ఓర్పుతో ఉన్నారు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై కక్ష్యగట్టింది
ఈడీ విచారణ పేరుతో ఎమ్మెల్సీ కవితను వేధిస్తున్నారు
హైదరాబాద్ : రానున్న ఎన్నికల్లో మూడోసారి బీఆర్ఎస్ హ్యట్రిక్ విజయం సాధించేలా ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని అటవీ, పర్యావరణ, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆదేశాల మేరకు నిర్మల్ నియోజకవర్గంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మొదటి ఆత్మీయ సమ్మేళనం నర్సాపూర్ (జి) మండల కేంద్రంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, బీఆర్ఎస్ నిర్మల్ జిల్లా ఇంచార్జ్ గంగాధర్ గౌడ్, బీఆర్ఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నల్లా వెంకట్రామ్ రెడ్డి, జిల్లా గ్రంథాయల సంస్థల చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్లు చిలుక రమణ, ఆశ్రిత రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ముడుసు సత్యనారాయణ, బీఆర్ఎస్ మండల కన్వీనర్ రాజేశ్వర్, బీఆర్ఎస్ నాయకులు అల్లోల గౌతంరెడ్డి, అల్లోల సురేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సభలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పార్టీని మరింత బలోపేతం దిశగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకుంటున్నాం.
సీయం కేసీఆర్ నాయకత్వంలో 14 ఏళ్ళ పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం, కొట్లాడి సాధించకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సీయం కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. గత తోమ్మిదేళ్ళుగా ప్రజా సంక్షేమ ధ్యేయంగా పాలన సాగిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో మూడోసారి బీఆర్ఎస్ హ్యట్రిక్ విజయం సాధించేలా ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త కృషి చేయాలి. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని వివరించారు. ఈ క్రమంలోనే ప్రజాప్రతినిధులు, నాయకులు వీలైనంత వరకు ప్రజల్లోనే ఉండాలని పేర్కొన్నారు.
రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్లు, ఉచిత చేప పిల్లలు, సబ్సిడీ గొర్రెల పంపిణీ, లాంటి తదితర స్కీములు ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ఇక దళిత వర్గాలు సగర్వంగా తలెత్తుకునేలా దళిత బంధు, దళిత బస్తీ అమలు చేస్తున్నది. విద్య, వైద్య రంగాలకు నిర్మల్ జిల్లా కేంద్రంగా మారింది. కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యను అందిసస్తున్నాం. కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందుతున్నాయి.
దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. ఇతర రాష్ట్రాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ లో బడుగు బలహీన వర్గాల జీవితాలు ఎలా ఉన్నాయో మనం కళ్ళారా చూస్తున్నాం. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం సీయం కేసీఆర్ బీఆర్ఎస్ జాతీయ పార్టీని ఏర్పాటు చేశారు. మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ మోడల్ కావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు.
సీయం కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేసేందుకు నిరంతరం శ్రమిస్తుంటే… అసలు తెలంగాణ అభివృద్ధి, ఈ ప్రాంత ప్రజల సంక్షేమం పట్టని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్ర పేరుతో తెలంగాణ మీద దండయాత్ర చేస్తున్నారు. తెలంగాణ ఇంత అభివృద్ధి పథంలో ముందకుపోతుంటే… ప్రతిపక్షాలు నానాయాగీ చేస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క పైసా ఇవ్వడం లేదు… అయినా ఏ మోహం పెట్టుకుని మా పల్లెల్లోకి వస్తున్నారు. మేము తలుచుకుంటే మీరు పల్లెల్లో తిరుగలేరు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎంతో ఓర్పుతో ఉన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీ ఆటలన్ని ప్రజలు గమినిస్తున్నారు. మీకు ఓట్లు వేసేంత అమయాకులు కాదు ఇక్కడి ప్రజలు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీజేపీయేతర రాష్ట్రాల్లో ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు చేయిస్తుంది. సీయం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాడులు చేపిస్తున్నారు. విచారణ పేరుతో కవితను వేధిస్తున్నారు. మీరెన్ని చేసినా తెలంగాణ ప్రజలు సీయం కేసీఆర్ వెంటే ఉంటారనే విషయం మరిచిపోవద్దు.
రాబోవు ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలి
గంగాధర్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్
రాష్ట్ర పార్టీ ఆదేశం మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశం మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మొదటి ఆత్మీయ సమ్మెళనం నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండలంలో ఏర్పాటు చేసుకున్నాం.
పార్టీ పటిష్టం కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉండి రాజకీయంగా వారికి భరోసానివ్వడానికే ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు దిశానిర్ధేశం, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆదేశాల మేరకు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకుంటున్నాం. రానున్న ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేయడంతోపాటు ప్రజా సంక్షేమం, అభివృద్ధి పథకాలను ఇంటింటికీ ప్రచారం చేసేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలి. క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతం కోసం కార్యకర్తల అభిప్రాయాలు, మనోభావాలను పంచుకునేందుకే ఈ ఆత్మీయ సమ్మేళనాలను ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
రానున్న ఎన్నికలకు ఇప్పటినుంచే పార్టీ శ్రేణులు సమయాత్తం కావాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందరికీ తెలిసేలా ఇంటింటికీ వెళ్ళి వివరించాలి. కరపత్రాలను పంపిణీ చేస్తూ… విస్తృత ప్రచారం నిర్వహించాలి. డివిజన్, మండల, గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలి. కమిటీలు అందరితో సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి.
మరోవైపు అభ్యర్థులే కరువైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పార్టీలు బీఆర్ఎస్ ను బలహీన పరిచేందుకు కుట్రలు చేస్తున్నారు. లేని పోని విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వారి కుట్రలను, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి.