హైదరాబాద్ : పంజాబ్, గోవా రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినప్పుడు ఆప్ పార్టీ డబ్బులు ఏవిధంగా సమకూర్చింది అనే విషయంపై ఫిర్యాదులు వచ్చినప్పుడు సెంట్రల్ ఏజెన్సీస్ విచారణ జరిపే క్రమంలో కవిత యొక్క లిక్కర్స్ స్కాం బయటపడిందని, పంజాబ్ లో జరిగిన ఎన్నికలలో కవిత ఇచ్చిన 100 కోట్ల అడ్వాన్స్ ని ఆప్ పార్టీ ఉపయోగించిందని ఈడి ఆరోపణలు చేస్తుందని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తుందని, 100 కోట్లు ఏ విధంగా సమకూర్చారు, హైదరాబాదులో ఎక్కడ కవిత ఆప్ పార్టీ నాయకులు మీటింగ్ పెట్టారు అనే వివరాలు ఈడి దగ్గర ఉన్నాయని, దోషులు ఎవరైనా చట్ట ప్రకారం శిక్ష అర్హులని ఆయన అన్నారు.
ఇటీవల రాష్ట్రంలో జరిగిన హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ ప్రభుత్వం వందల కోట్ల డబ్బును పంచిపెట్టిందని, అది ఎక్కడి నుండి సమకూర్చారు అనే విషయంపై బీజేపీ ప్రభుత్వం ఎందుకు విచారణ జరిపించడం లేదని, కాళేశ్వరం ప్రాజెక్ట్ కెసిఆర్ కు ఏటీఎంల మారిందని చెప్పిన అమిత్ షా, విద్యుత్ రంగంలో భారీ కుంభకోణం జరిగిందని చెప్పిన కిషన్ రెడ్డి ఎందుకు కేసీఆర్ ప్రభుత్వం పై విచారణ జరిపించలేదని, బిజెపి ప్రభుత్వం సరైన విచారణ జరిపించి ప్రస్తుతం కేసీఆర్ జైల్లో ఉండేవాడని, బిజెపి బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఒకటి కాకుంటే ఆప్ ప్రభుత్వం పై విచారణ జరిపించిన విధంగా బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతిపై విచారణ ఎందుకు జరిపించడం లేదని, కేంద్రంలో బిజెపిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి దేశంలోని మైనారిటీ ఓట్లను చీల్చడానికి కేసీఆర్ బిఆర్ఎస్ గా ఏర్పాటు చేశారని ,రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పాత్రను తగ్గించడానికి కేసీఆర్ ప్రధాన ప్రతిపక్షంగా బిజెపి పార్టీ అని చెప్తూ కుట్రలు చేస్తున్నాడని, బిజెపి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ప్రభుత్వం పై విచారణ జరిపించి ఏ విధంగా ఎన్నికలకు డబ్బులు సమకూర్చుతున్నారో ప్రజలకు వివరించాలని ,బిజెపి టీఆర్ఎస్ రెండు కలిసి డ్రామాలు చేస్తున్నాయని దీనిని ప్రజలు గమనిస్తున్నారని, బిజెపి ప్రభుత్వం వెంటనే కేసీఆర్ ప్రభుత్వం పై విచారణ జరిపించాలని ఈరవత్రి అనిల్ డిమాండ్ చేశారు.