విజయవంతంగా ముగిసిన ఫార్ములా ఈ కార్‌ రేసు, అసౌకర్యానికి మన్నించాలని నగరవాసులకు KTR విజ్ఞప్తి

हैदराबाद: वर्ल्ड चैंपियनशिप फॉर्मूला रेस के तहत समुद्र के टैंकबंड पर आयोजित रेस का सफलतापूर्वक समापन हो गया है। शनिवार दोपहर को हुई रेस में इलेक्ट्रिक कारों प्रतिस्पर्धा हुई। रेसर्स ने 322 किलोमीटर प्रति घंटे की रफ्तार से दौड़ लगाई। इस दौड़ में 22 चालकों वाली 11 टीमों ने भाग लिया।

హైదరాబాద్ : వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫార్ములా ఈ రేసులో భాగంగా సాగరతీరాన నిర్వహించిన రేసు విజయవంతంగా ముగిసింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ రేసులో ఎలక్ట్రిక్‌ కార్లు ఒకదానికి మించి మరొకటి పోటీపడ్డాయి. గంటకు 322 కిలోమీటర్ల వేగంతో రేసుర్లు దూసుకెళ్లాయి. 11 టీమ్‌లు 22 మంది డ్రైవర్లు ఈ రేసులో పాల్గొన్నారు.

ఈ రేసులో జీన్‌ ఎరిక్‌ విన్నర్‌గా నిలిచారు. రెండో స్థానంలో నిక్‌ క్యాసిడీ, మూడో స్థానంలో సెబాస్టియన్‌ బ్యూమీ నిలిచారు. ఈ సందర్భంగా విన్నర్‌కు మంత్రి కేటీఆర్ బహుమతి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అసౌకర్యానికి మన్నించాలని హైదరాబాద్‌ నగరవాసులను విజ్ఞప్తి చేశారు.

సాగరతీరాన జరిగిన ఫార్ములా ఈ రేసు చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు సినీ ప్రముఖులు హాజరయ్యారు. మంత్రి కేటీఆర్‌తో పాటు సినీ ప్రముఖులు రామ్‌ చరణ్‌, నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌ హాజరయ్యారు. వీరితో పాటు సచిన్ టెండూల్కర్, చాహల్‌, ధావన్‌ తదితరులు ఫార్ములా ఈ రేసు వీక్షించారు. కాగా కార్ల వేగం ప్రేక్షకుల కేరింతలతో సాగరతీరం హోరెత్తిపోయింది.

ఫార్ములా ఈ రేస్‌ పోటీలకు అనేక దేశాలు శాశ్వత హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాయి. అందులో ప్రధానంగా దిరియా, మెక్సికో సిటీ, బెర్లిన్‌, మొనాకో, రోమ్‌, లండన్‌, జకార్తా, సియోల్‌ వంటి నగరాల్లో ఈ పోటీ ఏటా జరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ పోటీలు జరుగుతున్నాయి. ఇక మీదట భారతదేశంలో నుంచి హైదరాబాద్‌ ఈ నగరాల జాబితాలో చేరనుందని నిర్వాహకులు వెల్లడించారు. కాగా ఫార్ములాలో మొత్తం 16 రేసులు నిర్వహిస్తారు. ఒక్కో రేస్‌లో రేసర్‌ పొందిన పాయింట్ల వారీగా సీజన్ల వారీ పాయింట్లు కలిపి, చివరకు ప్రపంచ చాంపియన్‌ను ప్రకటిస్తారు.

https://twitter.com/ntdailyonline/status/1624366064145690624?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1624366064145690624%7Ctwgr%5E2cf3cbcbb1cd51d217a636699e5b9ee1f96edd54%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fhyderabad%2Fformula-e-car-race-grandly-successfully-completed-in-hyderabad-964502

పెట్రోల్‌ వంటి శిలాజ ఇంధనాలు కాకుండా కరెంటుతో నడిచే ఎలక్ట్రిక్‌ వాహనాలతో రేస్‌ చేయడమే ‘ఫార్ములా ఈ’ రేసింగ్‌ ప్రత్యేకత. ఎలక్ట్రిక్‌ కార్ల ద్వారా సుస్థిర రవాణాను ప్రోత్సహించడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశం. భారతదేశంలో ఈ పోటీలు నిర్వహించేందుకు అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు పోటీపడినా ఐటీ మంత్రి కేటీఆర్‌ చొరవతో ఈ ప్రతిష్టాత్మక పోటీలు హైదరాబాద్‌ వేదికగా జరగడం విశేషం. 2014 బీజింగ్‌ ఒలింపిక్స్‌ గ్రౌండ్‌ దగ్గర మొట్టమొదటి ‘ఫార్ములా ఈ’ జరిగింది. 2014లో బీజింగ్‌లో ఈ రేస్‌ ప్రారంభం కాగా చివరిసారి దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరిగింది. ఇవాళ హైదరాబాద్‌లో రేసు జరిగింది. ఆ తర్వాత దక్షిణ ఆఫ్రికాలోని కేప్‌ టౌన్‌లోజరుగనుంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X