రేగుల గ్రామ దేవత బొడ్రాయి మరియు ముత్యాలమ్మ గుడి పునః ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
Hyderabad: “బొడ్రాయి బాగుంటే ఊరంతా బాగుంటారు. అందుకే నేను బొడ్రాయి బాగు చేసుకోండి… ఊళ్ళో
అక్కడక్కడ ఉన్న అసమ్మతులు బాగవుతాయని చెప్తుంటాను. ఈరోజు ఈ గ్రామ దేవత బొడ్రాయి మరియు ముత్యాలమ్మ గుడి పునః ప్రతిష్ట చేసుకోవడం సంతోషం. ఇందులో నేను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మవారు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను.” అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు నేడు జనగామ జిల్లా, కొడకండ్ల మండలం, రేగుల గ్రామం, గుడి పునః ప్రతిష్ట పవిత్ర కార్యక్రమంలో అన్నారు. గ్రామంలో ముందుగా హనుమంతుని దేవాలయంలో పూజలు చేశారు.
గ్రామదేవత బొడ్రాయి కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు…
బొడ్రాయి సరి చేసుకుంటే, బాగు చేసుకుంటే అందరూ బాగుండాలి నేను చెప్తాను.
మొదటి నుంచి ఇది అందరినీ కోరుతాను.
నేడు రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం చేస్తాం రమ్మన్నారు..నేను అదృష్టంగా భావించాను.
ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు.
ఊరు బాగు పడాలి.. అందరూ సంతోషంగా ఉండాలి.
మీ అందరి ఆశీర్వాదం కోసం వచ్చాను.
రెగుల నుంచి కాలువ పోయేటట్లు చేస్తాను.
ఊరిలో ఒకరిద్దరు అట్లా, ఇట్లా ఉన్నారనే బొడ్రాయి మంచిగా వేయమన్నాను.
రేగుల గ్రామంను అందంగా తయారు చేస్తాను.
ముత్యాలమ్మ గుడికి ఎంత ఖర్చు అయినా నేనే ఇస్తాను.
మీ అందరినీ కాపాడుకునే బాధ్యత నాది.
ఈ శుభ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన గ్రామస్తులకు పేరు, పేరున ధన్యవాదాలు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కుందురు వెంకటేశ్వర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు సిందే రామోజీ, రాష్ట్ర ఈ జి ఎఎస్ కౌన్సిల్ సభ్యులు అందే యాకయ్య, స్థానిక సర్పంచ్ కల్సాని వెంకటరెడ్డి, ఎంపీటీసీ దోపతి లక్ష్మి- సోమారెడ్డి, దేవస్థానం డైరెక్టర్ కె. ఉప్పల్ రెడ్డి, మండల సీనియర్ నాయకులు బాకి ప్రేమకుమార్, గ్రామపార్టీ అధ్యక్షుడు కమ్మగాని రాములు, మండల యూత్ అధ్యక్షుడు సతిష్ గౌడ్, ఉప్పసర్పoచ్ ఎల్లమ్మ, మాజీ సర్పంచ్ ఎం. సోమయ్య, వార్డు సభ్యులు జీ. శ్రీను, బి జ్యోతి, కె సంపత్, కె మహిదర్ గ్రామపార్టీ ముఖ్య నాయకులు, వి. ప్రభాకర్, వి. రామచంద్రు, జి. నర్సిహ్మ రెడ్డి, రైతు బంధు అధ్యక్షులు బాల మల్లయ్య, డి. రాజిరెడ్డి, గ్రామ యూత్ అధ్యక్షుడు సతిష్, సోషల్ మీడియా నాయకులు బి. రామూర్తి, వి. బాబు, బాబు, శ్రీరాములు, సందీప్, జి. శ్రీను, వి జపయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.