తెలంగాణ లో భూ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తో భేటీ అయిన టీ కాంగ్రెస్ ప్రతినిధుల బృందం

హైదరాబాద్: ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కు తెలంగాణ లో భూ సమస్యలు పరిష్కరించాలని మెమోరండం అందజేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ,సీఎల్పి నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే లు జగ్గారెడ్డి, సీతక్క, వర్కింగ్ ప్రసిడెంట్స్ అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, అజారుద్దీన్, కిసాన్ కాంగ్రేస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి, మాజీ మంత్రులు నాగం, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, ప్రసాద్ కుమార్, మాజీ ఎంపీలు బలరాం నాయక్, మల్లు రవి, రాములు నాయక్ పలువురు నేతలు.

డిమాండ్స్…

ధరణి ని రద్దు చేసి పాత పద్దతి ని తీసుకురావాలి. నిషేదిత జాబితాలో పొరపాటు గా నమోదైన భూముల సమస్య పరిష్కరించాలి. అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి..పోడు భూముల కు పట్టాలు ఇవ్వాలి. అసైన్డ్ భూములకు అర్హులకు పట్టాలు ఇవ్వాలి. కౌలు రైతు చట్టాన్ని అమలు చేసి.. కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి. టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని అమలు చేయాలి .

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి స్క్రోలింగ్ పాయింట్స్…

భూమి, వ్యవసాయం, రైతుల సమస్యలపై సీఎస్ కు వినతిపత్రం అందజేశాము. రైతుల కష్టాలు, సమస్యలను సీఎస్ కు వివరించాం. కూర్చోవడానికి సచివాలయం లేదు, కలవడానికి సీఎం లేడు. వివిధ సామాజిక వర్గాల సమస్యలపై కొట్లాడుతున్న సంఘాలకు ఎనిమిదేళ్లుగా సీఎం దర్శనం కలగలేదు. సీఎం ప్రజలకు అందుబాటులో ఉండాలి. సమస్యలపై దృష్టి సారించాలి. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్నది ప్రభుత్వం కాదు. సీఎం ప్రజల ఆస్తుల వివరాలను ప్రయివేటు కంపెనీలకు దారాదత్తం చేశారు. వ్యక్తుల ఆస్తుల వివరాల సమాచారం రహస్యంగా ఉంచాలి. కానీ ప్రయివేటు వ్యక్తులకు, కంపెనీలకు చేతుల్లోకి వెళ్లి దుర్వినియోగం అవుతోంది. వారిపై చర్యలు తీసుకోవాలని సీఎస్ కు వివరించాం. భూములు ఉన్న ప్రతి ఒక్కరు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. 24లక్షల ఎకరాల భూముల వివరాలు ధరణిలో కనిపించడం లేదు. తక్షణమే భూ సమస్యలను పరిష్కరించాలి. ధరణితో రాష్ట్ర ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతోంది. ప్రభుత్వం తక్షణమే రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పోడు భూముల పట్టాలు ఇవ్వకుండా కమిటీలతో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూములకు పట్టాలివ్వాలి. తక్షణమే ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 24న మండల కేంద్రాల్లో రెవెన్యూ కార్యాలయాల వద్ద నిరసన తెలుపుతాం. ఈ నెల 30న ధరణి బాధితులతో నియోజకవర్గాల్లో నిరసన చేపడతాం. డిసెంబర్ 5న జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల వద్ద ధర్నా చేపడతాం. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఈ సమస్యలకు పరిష్కారం చూపాలి. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో టీఆరెస్,బీజేపీ వివాదాలు సృష్టిస్తున్నాయి. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారు. దాడులు, ప్రతిదాడులతో గందరగోళం సృష్టిస్తున్నారు. పెట్టుబడులను గుజరాత్ కు తరలించుకుపోయేందుకు మోదీ కుట్ర చేస్తున్నారు. ఇది తెలంగాణకు తీరని నష్టం చేకూరుస్తుంది. పంతాలు, పట్టింపులతో కేసీఆర్,మోదీ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యం. ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశంతో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X