భూ కేటాయింపు ప్రభుత్వ లేఖ నెం: 1043/TE/A12/2024 ను ఉపసంహరించుకునేలా చూడాలని జేఏసీ విజ్ఞప్తి
నిర్ణయం వచ్చే వరకు నిరసనలు యధాతథంగా కొనసాగుతాయి : జేఏసీ
79వ రోజుకు చేరిన అంబేద్కర్ యూనివర్సిటీ ఉద్యోగుల నిరసన
హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పది ఎకరాల స్థలం జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఏ.ఎఫ్.ఏ.యూ) కేటాయించాలనే ప్రభుత్వ లేఖ నెం: 1043/TE/A12/2024 ను వెంటనే ఉపసంహరించుకోవాలని విశ్వవిద్యాలయ నూతనంగా నియామకమైన ఉపకులపతి ప్రొ. ఘంటా చక్రపాణిని జేఏసి సభ్యులు శనివారం విశ్వవిద్యాలయంలో కలిశారు.
ఉన్నత విద్యా శాఖ జారీ చేసిన లేఖను ఉపసంహరించుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఉపకులపతి ప్రొ. చక్రపాణి జేఏసీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ విశ్వవిద్యాలయ భూమి ఇతర యూనివర్సిటీ కి కేటాయించేలా ఇచ్చిన లేఖ ఉపసంహరించుకునేలా, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి సమస్య పరిష్కారం కోసం పనిచేస్తానని, అప్పటి వరకు జేఏసీ విశ్వవిద్యాలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
Also Read-
[इच्छुक ड्रामा प्रेमी 12 जनवरी 2025 को मंचित होने वाले शो के टिकटों और अन्य जानकारी के लिए मोबाइल नंबर 93460 24369 पर संपर्क कर सकते हैं]
వీసీని కలిసిన వారిలో జేఏసీ బృందంలో ఛైర్పర్సన్ ప్రొ. పల్లవీ కాబడే; జేఏసి కన్వీనర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్; సెక్రటరీ జనరల్ డా. వేణుగోపాల్ రెడ్డి, డా. రంబింద్రనాథ్ సోలమన్; డా. ఎల్వీకే రెడ్డి; డా. వై. వెంకటేశ్వర్లు; కాంతం ప్రేమ కుమార్, డా. యాకేశ్ దైద; ప్రొ. చంద్రకళ, ఎన్.సి. వేణుగోపాల్, రుశేంద్రమణి, రజనీకాంత్, పాండు, షబ్బీర్, డా. కిషోర్; డా. రాఘవేంద్ర; తదితరులు ఉన్నారు.
అనంతరం 79 వ రోజు కూడా జేఏసీ సభ్యులు, ఉద్యోగులు, విద్యార్థులు విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ లేఖను ఉపసంహరించుకోవాలంటూ మధ్యాహ్న భోజన విరామ సమయంలో పరిపాలన భవనం ముందు బైఠాయించి, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసను కొనసాగించారు. ప్రభుత్వం నుంచి తమ డిమాండ్ కు అనుకూలంగా నిర్ణయం వచ్చే వరకు నిరసనలు కొనసాగుతాయని జేఏసీ నేతలు ప్రకటించారు. ప్రభుత్వం ప్రొ. ఘంటా చక్రపాణిని వీసీగా నియమించడాన్ని జేఏసీ సభ్యులు స్వాగతించారు.