हैदराबाद : जिलाधीश कार्यालय में अटेंडेंर के पद पर कार्यरत एक व्यक्ति की गत माह की 29 तारीख को अचानक मौत हो गई थी। उसकी पत्नी ने उसे यह कहते हुए अस्पताल में भर्ती कराया कि उसका पति शराब पीकर आया और घर में फिसलकर गिर गया। इसके चलते उसके सिर में चोट लग गई। इलाज के दौरान उसकी मौत हो गई।
मृतक के बेटे ने यह कहते हुए थाने में शिकायत दर्ज की कि उसे अपने पिता की मौत पर संदेह है। पुलिस की जांच के दौरान सनसनीखेज बातों को खुलासा हुआ है। पता चला कि अटेंडर को उसकी पत्नी ने ही पीट-पीटकर मार डाला। महिला ने स्वीकार किया कि उसका पति हर दिन शराब पीकर आता था और मारता था। साथ ही उसकी प्रताड़ना से तंग आकर और उसकी नौकरी पाने के इरादे से ही उसने पति की हत्या की है। यह मामला भद्राद्री कोत्तागुडेम जिले में सामने आई।
मिली जानकारी के अनुसार, गांधी कॉलोनी निवासी के श्रीनिवास (50) कोत्तागुडेम जिलाधीश कार्यालय में अटेंडर के पद पर कार्यरत था। उसकी पत्नी सीता महालक्ष्मी (43) ने पुलिस को बताया कि वह हमेशा शराब पीता था और उसके मारपीट करता था। उसने बताया कि वह अपने पति की उत्पीड़न को सहन नहीं कर सकी और उससे छुटकारा पाने का फैसला किया। 29 दिसंबर की रात को उसका पति शराब के नशे में घर आया। सो जाने के बाद उसने पति के सिर पर डंडे से वार कर दिया। इसके बाद वह उसे किचन में ले जाकर लिटा दिया। कुछ घंटे बाद उसे कोत्तागुडेम अस्पताल में भर्ती कराया।
श्रीनिवास की मौत पर संदेह के चलते उसके बेटे साई कुमार ने थाने में शिकायत दर्ज की। इसी बीच सीता महालक्ष्मी अस्पताल से गायब हो गई। पुलिस ने संदेह के चलते जाल बिछाया और हैदराबाद जाने के लिए कोत्तागुडेम रेलवे स्टेशन पहुंची सीता महालक्ष्मी को गिरफ्तार किया। पुलिस की पूछताछ में उसने अपना अपराध स्वीकार किया। उसने पुलिस को बताया कि उसका पति हर दिन शराब पीकर आता था और मारपीट करता था। पति की प्रताड़ना से तंग आ गई थी और उसकी नौकरी हासिल करने के इरादे से उसकी हत्या की है।
తెలంగాణలోని భద్రాది కొత్తగూడెం జిల్లాలో ఓ మహిళ భర్తను హత్య చేసింది
హైదరాబాద్ : కలెక్టరేట్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి గత నెల 29న అకస్మాత్తుగా మరణించాడు. మద్యం తాగొచ్చి ఇంట్లో జారిపడ్డాడని, తలకు గాయమైందని అతడి భార్య అతడిని ఆస్పత్రిలో చేర్పించింది. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. తన తండ్రి మరణంపై తనకు అనుమానం ఉందంటూ కుమారుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల విచారణలో సంచలనం వెలుగులోకి వచ్చింది. అటెండర్‌ను అతడి భార్యే కొట్టి చంపిందని తేలింది. నిత్యం తాగొచ్చి వేధింపులకు గురిచేస్తున్న భర్త అడ్డుతొలగించుకోవడమే కాకుండా, అతడి ఉద్యోగం తనకు వచ్చేలా పథకం వేసి అలా చేసినట్లు అంగీకరించింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
గాంధీ కాలనీకి చెందిన కె. శ్రీనివాస్ (50) కొత్తగూడెం కలెక్టరేట్‌లో అటెండర్‌గా పనిచేస్తున్నారు. అతడు తరచూ మద్యం తాగొచ్చి తనను కొడుతున్నాడని భార్య సీతామహాలక్ష్మి (43) పోలీసులతో చెప్పింది. భర్త వేధింపులు భరించలేక అతడి అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపింది. డిసెంబర్ 29న రాత్రి ఆమె భర్త మద్యం తాగి ఇంటికొచ్చాడు. నిద్రలోకి జారుకున్న తర్వాత కర్రతో తలపై కొట్టింది. అనంతరం వంటగదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టింది. కొన్ని గంటల తర్వాత కొత్తగూడెం ఆస్పత్రిలో చేర్పించింది.
శ్రీనివాస్ మృతిపై అనుమానంతో అతడి కుమారుడు సాయికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈలోగా ఆస్పత్రి వద్ద నుంచి సీతామహాలక్ష్మి కనిపించకుండా పోయింది. పోలీసులు అనుమానంతో ఆమెపై నిఘా పెట్టి మంగళవారం రాత్రి హైదరాబాద్ వెళ్లేందుకు ఆమె కొత్తగూడెం రైల్వే స్టేషన్‌కు రాగా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె తన నేరం అంగీకరించింది. నిత్యం తాగొచ్చి వేధిస్తున్న భర్తను చంపేసి, కారుణ్య నియామకం కింద అతడి ఉద్యోగం దక్కించుకోవాలనే ఆలోచనతో హత్య చేసినట్లు నిందితురాలు పోలీసుల విచారణలో చెప్పిందని ఎస్సై సుమన్ తెలిపారు. (Agencies)