हैदराबाद: आंध्र प्रदेश के पूर्वी गोदावरी जिले के ताल्लपुडी मंडल के ताड़ीपुडी गांव के पास गोदावरी नदी में लापता हुए पांच युवकों के शव मिले हैं। शिवरात्रि का त्यौहार मनाने के लिए कुल 11 लोगों ने गोदावरी रेती रैप में स्नान करने उतरे। उनमें से पांच युवक गहरे पानी में चले गये और लापता हो गये। जबकि छह युवक सुरक्षित बाहर आ गये। लापता युवकों में तिरुमलशेट्टी पवन (19), पडाला दुर्गा प्रसाद (17), अनिशेट्टी पवन (19), गर्रे आकाश (17) और पडाला साईं (19) शामिल हैं।

इस हादसे की जानकारी मिलते ही एनटीआरएफ कर्मियों ने बचाव अभियान शुरू कर दिया है। लेकिन वे असफल रहे। पुलिस घटनास्थल पर पहुंची और गोताखोरों की मदद से तलाशी अभियान शुरू किया। करीब चार घंटे की तलाशी अभियान के बाद सभी के शव गोदावनदी से बरामद किये। इससे उनके परिवारजनों में मातम छा गया है। सभी मृतक 20 वर्ष से कम आयु के थ। मृतक युवकों के परिजन फूट-फूट कर रो रहे हैं।
शवों को पोस्टमार्टम के लिए सरकारी अस्पताल भेज दिया गया है। मृतक युवक कोव्वुर, ताल्लापुडी और राजमंड्री निवासी और इंटरमीडिएट और डिग्री पढ़ाई कर रहे थे। कोव्वुर आरडीओ रानी सुस्मिता और डीएसपी देवकुमार ने तलाशी अभियान का नेतृत्व किया।
यह भी पढ़ें-
ఇంటర్, డిగ్రీ చదువుతున్న ఆ ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు దక్కలేదు
హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో గోదావరిలో గల్లంతైన ఐదుగురి యువకుల మృతదేహాలు లభ్యం అయ్యాయి. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మొత్తం 11మంది గోదావరి ఇసుక ర్యాంపులో స్నానానికి దిగారు. లోతు ఎక్కువగా ఉండడంతో వారిలో ఐదుగురు గల్లంతయ్యారు. ఆరుగురు క్షేమంగా బయటపడ్డారు. గల్లంతైన వారిలో తిరుమలశెట్టి పవన్(19), పడాల దుర్గాప్రసాద్(17), అనిశెట్టి పవన్(19), గర్రె ఆకాష్(17), పడాల సాయి(19) ఉన్నారు.
వీరిని రక్షించేందుకు ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టంది. అయితే అవి ఫలించలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు 4 గంటల పాటు గాలించిన అనంతరం అందరి మృతదేహాలును నదిలో నుంచి వెలికితీశారు. గల్లంతైన ఐదుగుగురు మృతి చెందారు. పవన్, దుర్గాప్రసాద్, పవన్, ఆకాష్, సాయిల మృతదేహాలు లభ్యం అయ్యాయి. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది. మృతులంతా 20 ఏళ్ల లోపు వారే. చేతికి అందివచ్చిన వారు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతిచెందిన యువకులు కొవ్వూరు, తాళ్లపూడి, రాజమండ్రిలో ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులే. ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో విషాదఛాయలు అలముకున్నాయి. కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత, డీఎస్పీ దేవకుమార్ గాలింపు చర్యలను పర్యవేక్షించారు. (ఏజెన్సీలు)
