हैदराबाद : तेलंगाना की 17 लोकसभा और आंध्र प्रदेश की 25 लोकसभा और 175 विधानसभा सीटों पर मतदान जारी है। सोमवार सुबह 7 बजे मतदान शुरू हुआ और मतदाता अपने मताधिकार का प्रयोग करने के लिए मतदान केंद्रों पर कतारों में खड़े हैं।
संबंधित खबर-
इसी क्रम में चुनाव आयोग ने खुलासा किया कि दोपहर एक बजे तक तेलंगाना में 40.31 प्रतिशत मतदान दर्ज किया गया है। जबकि पड़ोसी राज्य आंध्र प्रदेश में 40 फीसदी मतदान हुआ है।
तेलंगाना की राजधानी हैदराबाद में सबसे कम मतदान दर्ज हुआ है। हैदराबाद में दोपहर 2 बजे तक 20 फीसदी, सिकंदराबाद में 25 फीसदी मलकाजगिरी में 27.7 फीसदी मतदान हुआ है।
संबंधित खबर-
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఓటింగ్
హైదరాబాద్ : దేశంలో సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్ కొనసాగుతోంది. నాలుగో దశలో ఏపీ, తెలంగాణ సహా.. పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 1717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నాలుగో విడత పోలింగ్‌లో భాగంగా ఏపీలోని 25 లోక్ సభ స్థానాలతోపాటు తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే తెల్లవారుజామునుంచే ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని క్యూ లైన్లలో నిలుచుంటున్నారు. ఎండ వస్తే తట్టుకోలేమని భావించిన ఓటర్లు.. ఉదయం 7 గంటల లోపే పోలింగ్ బూత్ లకు చేరుకుంటున్నారు. ఇక తెలంగాణలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.31 శాతం పోలింగ్ నమోదైంది.
ఏపీలో మండుటెండలోనూ పోలింగ్ కోసం జనం పోటెత్తుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సందడి నెలకొంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40 శాతం పోలింగ్ నమోదైందని ఈసీ వెల్లడించింది.