హైదరాబాద్ : టాలీవుడ్‌లో మరో నటుడు కన్నుమూశారు. సీనియర్ నటులు వల్లభనేని జనార్ధన్ తుదిశ్వాస విడిచారు. నటుడిగా, దర్శకుడిగా టాలీవుడ్‌లో పేరు సంపాదించిన ఆయన వయసు 63 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు కన్ను మూశారు.
విజయవాడకు చెందిన వల్లభనేని జనార్ధన్ కు చిన్నప్పటినుంచి నాటకాలు అంటే చాలా ఇష్టం ఉండేది. ఆ ఆసక్తితోనే కళాశాల విద్య అనంతరం కళామాధురి పేరుతో నాటక సంస్థను ప్రారంభించారు. ఈ క్రమంలో తెలిసినవారి పరిచయలతో ఇండస్ట్రీలోకి ఆడుగుపెట్టారు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన గజదోంగ ఆయనకు మొదటిచిత్రం. సినిమాల్లో నటిస్తున్న టైమ్ లోనే జనార్ధన్… దర్శకుడు విజయ బాపినీడు కుమార్తెను వివాహం చేసుకున్నారు.
చిరంజీవి హీరోగా విజయ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్ లీడర్ చిత్రం జనార్ధన్ కు మంచి పేరును తీసుకువచ్చింది. ఇందులో ఆయన హీరోయిన్ సుమలతకి తండ్రిగా నటించి మెప్పి్ంచారు. ఈ చిత్రం తరువాత ఆయనకు వరుసగా అవకాశాలు వచ్చాయి. కేవలం నటుడు గానే కాకుండా జనార్ధన్ దర్శకనిర్మాతగా కూడా రాణించారు. జనార్ధన్ కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
ఏలూరు దగ్గర పోతనూరులో 1959లో జన్మించిన జనార్ధన్ సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా కెరీర్‌ను ప్రారంభించినప్పటికీ ఆ సినిమా క్యాన్సిల్ కావడంతో తనే దర్శకుడిగా ‘మానస సరోవరం’ అనే కన్నడ చిత్రాన్ని తెలుగులో అమాయక చక్రవర్తిగా రీమేక్ చేశాడు. అది పెద్ద విజయం సాధించింది. ఆ తర్వాత ‘శ్రీమతి కావాలి’ చిత్రంతో నటుడిగా మారి తన మామ విజయ బాపినీడు దర్శకత్వంలో చాలా సినిమాల్లో నటించారు. ఈ క్రమంలోనే కెరీర్ మొత్తంలో 100కి పైగా చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ (1991) చిత్రంలో ఆయన పోషించిన విలన్ పాత్రకు మంచి పేరొచ్చింది. ఇక కెరీర్ చివరన ‘అన్వేషిత’ అనే సీరియల్‌లో కూడా నటించారు.
డైరెక్టర్ శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘నీకోసం’ చిత్రానికి నటులు జనార్ధన్ నిర్మాతగా వ్యవహరించారు. ఇది దర్శకుడిగా శ్రీను వైట్లకు మొదటి సినిమా కాగా.. రవితేజ హీరోగా నటించాడు. ఇక తన ఇద్దరు కూతుళ్లలో ఒకరు చిన్న వయసులోనే చనిపోగా మరో కూతురు అభినయ ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తోంది. కొడుకు అవినాష్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా జాబ్ చేస్తున్నాడు. దీంతో ఆయన కుమారుడు ఇండియాకు వచ్చిన తర్వాతే అంత్యక్రియలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. (Agencies)
वरिष्ठ अभिनेता वल्लभनेनी जनार्दन का निधन
हैदराबाद: टॉलीवुड में एक और अभिनेता का निधन हो गया है। वरिष्ठ अभिनेता वल्लभनेनी जनार्दन ने अंतिम सांस ली। वह 63 साल के थे। वल्लभनेनी एक अभिनेता और निर्देशक के रूप में टॉलीवुड में अपनी पहचान बनाई। वे कुछ समय से बीमार चल रहे थे और आज अपोलो अस्पताल में इलाज के दौरान उनका निधन हो गया।