హైదరాబాద్ : యన్ యస్ యన్ యూనిట్-I ఆధ్వర్యంలో కెవిఆర్ ప్రభుత్వ మహిళా కళాశాల (కర్నూల్) లో వివిధ రకాల మొక్కలు నాటడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం తలపెట్టిన మొక్కల పెంపకంలో భాగంగా ఈ రోజు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి వి సుబ్రహ్మణ్య కుమార్, డి.ఎస్.పి. ఎస్ మహబూబ్ భాషా, డివి ఈవో పరమేశ్వర రెడ్డి, కె వి ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ లాలప్ప, లయన్స్ క్లబ్ చైర్మన్ శివరాం గౌడ్, శ్వేతా రెడ్డి, ప్రభు చరణ్, రేష్మ, రాధా రమణి, తదితరులు వివిధ రకాల మొక్కలు కళాశాల ఆవరణంలో నాటడం జరిగింది.
Also Read-
శ్రీమతి ఏ జయలక్ష్మి యన్ యస్ యన్ కోఆర్డినేటర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ గురించి మొక్కలు నాటి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత గురించి విద్యార్థులకు ప్రిన్సిపల్ డాక్టర్ వివి సుబ్రహ్మణ్య కుమార్ వివరించారు. భావితరాల భద్రత కోసం వాతావరణాన్ని పచ్చదనంతో నింపాలని ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని మీ గ్రామాల్లో కూడా మొక్కలు నాటి పెంచాలని డి.ఎస్.పి.ఎస్ మహబూబ్ బాషా విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధ్యాపకులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.