हैदराबाद: तेलंगाना राज्य लोक सेवा आयोग पेपर लीक मामले में एक और अहम घटनाक्रम सामने आया है। इस मामले में एक और शख्स को एसआईटी पुलिस ने गिरफ्तार किया है। महबूबनगर जिले के नवाबपेट निवासी प्रशांत रेड्डी को पुलिस ने हिरासत में लिया। एसआईटी ने पुष्टि की कि उसने टीएसपीएससी पेपर लीक करने वालों से पेपर खरीदा और परीक्षा लिखी है। पुलिस इस मामले में मुख्य आरोपी राजशेखर और रेणुका के साथ प्रशांत रेड्डी के वित्तीय लेनदेन की जांच कर रही है।
इस मामले में अब तक 12 लोगों को गिरफ्तार किया जा चुका है और ताजा गिरफ्तारी के साथ यह संख्या 13 हो गई है। पेपर लीक करने वालों के साथ ही पुलिस पैसे देकर पेपर लेने वाले परीक्षार्थियों को भी गिरफ्तार कर रही है। एसआईटी ने पाया कि प्रश्नपत्र के लिए करीब 10 से 15 लाख रुपये का भुगतान किया गया। पुलिस ने पाया कि पैसे देने वालों को पेपर प्रिंट कॉपी दी गई। आरोपियों के घरों में एसआईटी की तलाशी ली जा चुकी है और पेन ड्राइव और लैपटॉप जब्त किए गए हैं। खबर है कि पेन ड्राइव में प्रश्न पत्र उपलब्ध हैं।
एसआईटी ने अपनी जांच में पाया कि टीएसपीएससी के कई प्रश्नपत्र लीक हुए है। एसआईटी ने अब तक इस मामले में 19 गवाहों से पूछताछ कर उनसे अहम जानकारियां हासिल की हैं। टीएसपीएससी में कार्यरत शंकर लक्ष्मी इस मामले में मुख्य गवाह है। शंकर लक्ष्मी के साथ टीएसपीएससी के कुछ अन्य कर्मचारियों को गवाह के रूप में शामिल किया गया है। एसआईटी ने पहले ही परीक्षा दे चुके कई लोगों को नोटिस जारी किया है।
संबंधित खबर :
इसके चलते सबूत मिलने के बाद कुछ और लोगों की गिरफ्तारी की संभावना जताई जा रही है। कुछ एनआरआई परीक्षा देकर विदेश चले गए। जिन लोगों को नोटिस मिले हैं उनमें कई एनआरआई भी हैं। इनकी गिरफ्तारी की भी संभावना है।
TSPSC Paper Leak Scam : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరొకరు అరెస్ట్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరొకరిని సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేటకు చెందిన ప్రశాంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ చేసినవారి నుంచి పేపర్ కొనుగోలు చేసి పరీక్ష రాసినట్లు సిట్ నిర్థారించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రాజశేఖర్, రేణుకతో ప్రశాంత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ కేసులో ఇప్పటివరకు 12 మంది అరెస్ట్ అవ్వగా.. తాజాగా అరెస్ట్‌తో ఆ సంఖ్య 13కు చేరుకుంది. లీక్ చేసినవారితో పాటు వారికి డబ్బులు చెల్లించి పేపర్ తీసుకున్న అభ్యర్థులను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తోన్నారు. ప్రశ్నాపత్రాల కోసం దాదాపు రూ.10 నుంచి రూ.15 లక్షల వరకు చెల్లించినట్లు సిట్ గుర్తించింది. డబ్బులు చెల్లించినవారికి పేపర్ ప్రింట్ కాపీ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే నిందితుల ఇళ్లల్లో సిట్ సోదాలు నిర్వహించి పెన్‌డ్రైవ్, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. పెన్‌డ్రైవ్‌లో ప్రశ్నాపత్రాలు లభ్యమైనట్లు తెలుస్తోంది.
అనేక ప్రశ్నాపత్రాలు లీక్ చేసినట్లు సిట్ గుర్తించింది. ఈ కేసులో ఇప్పటివరకు 19 మంది సాక్షులను సిట్ విచారించగా వారి నుంచి కీలక విషయాలు రాబట్టింది. టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగం చేస్తోన్న శంకర్ లక్ష్మి ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నారు. శంకర్ లక్ష్మితో పాటు మరికొంతమంది టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులను సాక్షులుగా చేర్చింది. ఇక ఇప్పటికే పరీక్షలు రాసిన పలువురికి సిట్ నోటీసులు జారీ చేసింది.
దీంతో ఆధారాలు దొరికిన తర్వాత మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశముందని తెలుస్తోంది. కొంతమంది ఎన్‌ఆర్‌ఐలు పరీక్షలు రాసి విదేశాలకు వెళ్లారు. దీంతో నోటీసులు అందుకున్న వారిలో పలువురు ఎన్‌ఆర్‌ఐలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వారిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పేపర్ లీక్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఇప్పటికే నిందితులను రిమాండ్‌లోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వారి నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. పేపర్ లీక్‌లో ఇంకా ఎవరి పాత్ర ఉంది? ఎవరెవరికి లీక్ చేశారు? ఎంత సొమ్ము తీసుకున్నారు? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అటు ఈ ఘటనపై విద్యార్థి సంఘాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు చేపడుతున్నాయి. ఇందులో కేటీఆర్ హస్తం ఉందనే ఆరోపణలు చేస్తోన్నాయి. కేటీఆర్‌ను బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేస్తోన్నాయి. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. (ఏజెన్సీలు)