हैदराबाद : एसआईटी अधिकारियों ने तेलंगाना राज्य लोक सेवा आयोग के पेपर लीक मामले में कार्यरत 30 कर्मचारियों को जांच के लिए आने का नोटिस जारी किया है। प्रवीण और राजशेखर के करीबियों से पूछताछ की जाएगी। क्या पेपर लीक होने में उनकी कोई भूमिका है? क्या उन्होंने इनकी मदद की? इस बात की अधिकारी जांच कर रहे हैं। मामले में एक महत्वपूर्ण घटनाक्रम यह कि नोटिस न केवल स्थायी कर्मचारियों को बल्कि आउटसोर्स आईटी कर्मचारियों को भी जारी किए गए।
TSPSC Paper Leak Scam : 30 మంది ఉద్యోగులకు నోటీసులు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేసులో ఆఫీసులో పని చేస్తున్న 30 మంది ఉద్యోగులు విచారణ రావాలంటూ నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. ప్రవీణ్, రాజశేఖర్ తో సన్నిహితంగా ఉన్న వాళ్లను ఎంక్వయిరీ చేయనున్నారు. పేపర్ లీకేజీలో వారి పాత్ర ఉందా? వాళ్లు ఏమైనా సాయం చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. పర్మినెంట్ ఉద్యోగులకే కాకుండా ఔట్ సోర్సింగ్ ఐటీ సిబ్బందికి కూడా నోటీసులు జారీ చేయటం కేసులో కీలక పరిణామం.
Ralated News:
ఇదే సమయంలో కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకర్ లక్ష్మి పాత్రపై మరింత దర్యాప్తు చేయాల్సి ఉందని 23వ తేదీ మరోసారి ఆమెను విచారణ చేయనున్నట్లు ప్రకటించారు అధికారులు. టీఎస్ పీఎస్సీ ఉద్యోగులతోపాటు లీకేజీలో కీలకంగా ఉన్న రేణుకతో సన్నిహితంగా ఉన్న కోచింగ్ సెంటర్ నిర్వాహకలు, అభ్యర్థులను సైతం విచారించాలని నిర్ణయించింది సిట్ అధికారులు. గ్రూప్ 1 ర్యాంక్ సాధించిన రాజశేఖర్ ఫ్రెండ్ రమేష్ పాత్రపైనా అనుమానాలు ఉండటంతో అతన్ని కూడా మరోసారి విచారించాలని నిర్ణయించారు సిట్ అధికారులు.
ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలకు సిట్ నోటీసులు జారీ చేసింది. పేపర్ లీకేజీలపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని ఇళ్లకు వెళ్లి నోటీసులు అంటించింది సిట్. వీటిపై తీవ్ర విమర్శలు రావటంతో నోటీసులపైనా స్పందించింది సిట్. నోటీసులు జారీ చేసినంత మాత్రాన విచారణకు పిలిచినంత మాత్రాన వాళ్లందరికీ పేపర్ లీకేజీలో సంబంధం ఉందని చెప్పలేం అని సమాచార సేకరణ కోసమే విచారణకు పిలిచినట్లు వివరణ ఇచ్చారు సిట్ అధికారులు.
పేపర్ లీకేజీ కేసులో విచారణ చేసేకొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తీగ లాగితే డొంక కదిలినట్లు బండారం మొత్తం బయటపడుతుంది. ఇదే సమయంలో హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు బీజేపీ డిమాండ్ చేస్తుండగా సీబీఐ విచారణకు కాంగ్రెస్ పార్టీతోపాటు ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్, వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తున్నారు. (ఏజెన్సీలు)