డా బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ వీసీని కలిసిన టీ శాట్ సీఇఓ, దీని పై చర్చ

హైదరాబద్ : అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య. కె. సీతారామారావు ను టీ శాట్ సీఇఓ బి. వేణుగోపాల్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. టీ శాట్ సీఇఓ గా వేణుగోపాల్ రెడ్డిని ప్రభుత్వం ఇటీవలే నియమించగా అంబేద్కర్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోనే టీ శాట్ కార్యాలయం ఉంది.

ఈ నేపధ్యంలో ఆయన వీసీని కలవగా విశ్వవిద్యాలయ అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యా వ్యాప్తి, తెలంగాణా నిరుద్యోగ యువతకు, విద్యార్ధులకు ఉపయోగపడేలా కార్యక్రమాలను రూపొందించి టీ శాట్ ద్వారా ప్రసారం చేయాలని చర్చలు జరిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొ. ఏ.వి.ఎన్. రెడ్డి, టీ శాట్ జనరల్ మేనేజర్ పి. లింగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

హైదరాబద్ : మహిళలకు విద్య, రాజకీయాల్లో జనాభా దామాషా పద్ధతిలో సరైన వాటా దక్కలేదని ప్రొ. కాత్యాయని విద్మహే అభిప్రాయపడ్డారు. డా.బి.ఆర్.అంబేద్కర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ మహిళా అభివృద్ధి, విస్తరణ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమానికి తెలంగాణ ప్రజాస్వామిక రేచయిత్రుల వేదిక కార్యదర్శి, కాకతీయ విశ్వవిద్యాలయ తెలుగు విశ్రాంత అధ్యాపకురాలు ఆచార్య కె. కాత్యాయని విద్మహే ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆచార్య కాత్యాయని “మహిళా శక్తి : మహిళల హక్కులు” అనే అంశం పై ప్రసంగించారు. అనేక సంవత్సరాలుగా అంతర్జాతీయ మహిళలకు హక్కుల ఉద్యమం చేసిన గొప్ప చరిత్ర ఉన్నప్పటికీ, ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా బ్రూణ హత్యలు, బాలికలను హరించడం, లైంగిక బానిసలుగా వాడుతుండడం దుర్మార్గమైన చర్యగా ఆమె అభివర్ణించారు. మహిళల మానవ హక్కులు, మహిళా సాధికారత, లింగ సమానత్వం-హక్కులను పరిరక్షించడం, రాజకీయ ప్రాతినిధ్యం మొదలుకొని అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలను కల్పించాల్సిన భాద్యత ప్రభుత్వాలదే అని న్యాయం జరగనప్పుడు ప్రభుత్వాలను ప్రశ్నించాల్సిన భాద్యత కూడా మహిళలు, మహిళా సంఘాలపైన ఉందని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య. కె. సీతారామారావు మాట్లాడుతూ ఈ ప్రపంచంలో స్త్రీని మించిన మహా శక్తి ఏదీ లేదని, స్త్రీ లేకపోతే ఈ సృష్టి లేదన్నారు. మహిళల సాధికారత, అభ్యున్నతి, వివక్ష నిర్మూలన పై తమ విశ్వవిద్యాలయం ద్వారా పాఠ్యాంశాలను అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో మహిళా సాధికారతకు సంబంధించి తమ విశ్వవిద్యాలయం పెద్ద పీట వేయనున్నట్లు ప్రొ. రావు వెల్లడించారు.

కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి విశిష్ట అతిధిగా పాల్గొని ముఖ్య అతిధిని సభకు పరిచయం చేశారు. విశ్వవిద్యాలయ మహిళా అభివృద్ధి, విస్తరణ కేంద్రం ఇంచార్జ్, డా. జి. మేరీ సునంద కార్యక్రమం నిర్వహణ ఆవశ్యకతను వివరించారు. పలు విభాగాల డైరెక్టర్స్, డీన్స్, అన్ని విభాగాల అధిపతులు, విశ్వవిద్యాలయ మహిళా ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X