హైదరాబాద్ :
రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు టీపీసీసీ పిలుపు
మండల కేంద్రాలలో ధర్నాలు, రాస్తారోకో లు, సీఎం దిష్టిబొమ్మల దగ్ధం తదితర నిరసన కార్యక్రమాలు చేపట్టాలని డీసీసీ అధ్యక్షులకు పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డి. సర్పంచుల నిధుల విడుదల, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం పై టీపీసీసీ రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఇందిరా పార్కు వద్ద జరగాల్సిన ధర్నాకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.
అంతే కాకుండా తెల్లవారు జాము నుంచి టీపీసీసీ అధ్యక్షులు టీపీసీసీ అధ్యక్షులతో సహా ముఖ్య నాయకులను అందరిని గృహ నిర్బంధం చేసి అప్రజాస్వామికంగా, నియంతలాగా పని చేస్తుంది. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాలలో ధర్నాలు, రాస్తారోకోలు, సీఎం దిష్టిబొమ్మల దగ్దం లాంటి కార్యక్రమలు చేయాలని పిలుపునిస్తున్నాము.. ఎత్తున నిరసన చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి.
ఇందకు ముందు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎంపీ ని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. ఈ రోజు ధర్నా చౌక్ వద్ద సర్పంచుల నిధుల సమస్యలపై రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో ధర్నా ఉన్న నేపత్యంలో ధర్నాలో పాల్గొనకుండా అడ్డుకుంటున్న ప్రభుత్వం. ప్రభుత్వం భయపడుతోంది.. తప్పును ఒప్పుకుంది.. అందుకే ఈ నిర్బంధం… టీపీసీసీ పంచాయతీ రాజ్ సంఘటన్ చైర్మన్ సిద్దేశ్వర్.
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంతరావు, కిసాన్ కాంగ్రెస్ జాతీయ నాయకులు కోదండరెడ్డి తదితరులు హౌస్ అరెస్ట్. టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ హౌస్ అరెస్ట్. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. తెలంగాణ లో ఇదో కొత్తరకం నిర్బంధం. హౌస్ అరెస్టుల పేరిట నేతలను అడ్డుకుంటున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. ప్రజా సమస్యలపై ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పోరాటాలు చేస్తుంటే సర్కార్ అడ్డుకోవడం దుర్మార్గం. ప్రభుత్వ పనితీరును క్షేత్ర స్థాయిలో ప్రజా మద్దతు తో నిలదీస్తాం.
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ మోహరించిన పోలీసులు. పోలీసు వాహనాలు, వ్యాన్లను సిద్ధం చేసుకొని భారీగా పోలీసులతో ఇంటి చుట్టూ పహారా కాస్తున్న పోలీసులు. ధర్నా చౌక్ వద్ద సర్పంచుల నిధుల సమస్యలపై టీపీసీసీ ధర్నా కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో అనుమతిని రద్దు చేసిన పోలీసులు. అనుమతి ఇవ్వకున్నా ధర్నా చేస్తామని టీపీసీసీ ప్రకటన..
ధర్నా చౌక్ వద్ద సర్పంచుల ధర్నా అనుమతి కోసం టీపీసీసీ దరఖాస్తు చేసుకుంటే అనుమతిని నిరాకరించిన పోలీసులు. అనుమతి నిరాకరించినా ధర్నా చేస్తామని లేజాపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించిన టీపీసీసీ.
డాక్టర్ మల్లు రవి మాట్లడుతూ… ఈ రోజు పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇందిరా పార్క్. పోలీస్ సర్పంచుల ధర్నా సందర్భంగా హౌస్ అరెస్ట్ చేసి. గృహ నిర్భంధంలో ఉంచారు. అయిన కూడా సర్పంచ్‌ల పోరాటానికి మేము మద్దతు ఇస్తున్నాము. సర్పంచ్‌లకు మద్దతుగా ఇందిరా పార్క్ వద్ద ధర్నాలో కాంగ్రెస్ నాయకులందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. గ్రామ పంచాయతీలకు మంజూరైన బడ్జెట్‌ను సర్పంచ్‌లు మాత్రమే వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న నిధులను గ్రామ పంచాయతీలకు విడుదల చేయాలి.