టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిగారిని కలిసిన తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘం (video)

హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిగారిని కలిసిన తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘం. దివ్యాంగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వినతి. బడ్జెట్ లో దివ్యాంగులకు నిధులు కేటాయించడంతోపాటు దివ్యాంగుల సంక్షేమశాఖ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయలని వినతి. షరతులు లేకుండా దివ్యాంగులకు ఆసరా పింఛన్ వర్తింపజేయాలని వినతి.

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎంపీ..

రేపటి నుంచి పినపాక నియోజకవర్గంలో పాదయాత్ర ఉంటుంది. ఇక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇక్కడ ఎమ్మెల్యే కమిషన్లకు, కాంట్రాక్టలకు అలవాటు పడి అధికార పార్టీకి అమ్ముడుపోయాడు. ఇక్కడ దాతలు ఇచ్చిన భూమిలో కార్యకర్తలు పైసా పైసా కూడకట్టి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే దాన్ని కబ్జా చేసాడు.

ఎమ్మెల్యే వెంటనే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పార్టీకి అప్పగించి విజ్ఞత చాటుకోవాలి. లేకపోతే వచ్చే కొత్త సంవత్సరం లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అప్పుడు తగిన మూల్యం చెల్లించాల్సివస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలను రాజకీయంగా బొంద పెట్టాలి. మళ్ళీ ఏ చట్ట సభ మెట్లు ఎక్కకుండా చెయ్యాలని కార్యకర్తలు నిర్ణయం తీసుకున్నారు. మొన్న మొయినాబాద్ లో 4 ఎమ్మెల్యే లపై ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నమోదు అయింది.

ఆ కేసుకు సంబంధించిన వివరాలు పంపాలని సిబిఐ చీఫ్ సెక్రటరీ ని అడిగింది.. ఆ కేసుతో పాటు కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేల వివరాలు కూడా జత చేసి పంపాలి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము మొయినాబాద్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసాము. డీజీపీ కి, సిఎస్ కు లేఖలు రాసి ఫిర్యాదు కాపీలు అందించాం.

అందువల్ల కేసులో 12 మందిని కూడా జత చెయ్యాలి. ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన వారే అందులో పినపాక.ఎమ్మెల్యే కూడా ఉన్నారు. వీరంతా ప్రలోభాలకు ఆశపడి ఫిరాయింపులు అలవాటు చేసుకున్నారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం 12 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన వారి పేరు జత చెయ్యకపోతే హైకోర్ట్ ను ఆశ్రఇస్తాం.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ఎమ్మెల్యేలు పొందిన లబ్ది పైన విచారణ జరిపి అన్ని.స్వాధీనం చేసుకుంటాం. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నేరుగా లబ్ది జరిగినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఒకరు మంత్రి, ఒకరు కార్పోరేషన్ చైర్మన్, ఇంకొకరు విప్, కాంట్రాక్తులు, రాజకీయ పదవులు, ఆర్థిక లబ్ది జరిగింది. ఇవన్నీ వివరాలు ఫిర్యాదులో పేర్కొన్నాం. ఈ ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి, హోమ్ మంత్రి లకు లేఖలు రాస్తాం.

బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లు టిఆర్ఎస్, సీఎం కుంటుంభం అవినీతి మీద పదే పదే ఆరోపణ లు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ చేయాలని బండి సంజయ్, కిషన్ రెడ్డి లు అధికారికంగా లేఖలు రాయాలి. లేకపోతే ఈ రాజకీయ కుంభకోణంలో బీజేపీ కి కూడా పాత్ర ఉందని తేటతెల్లం అవుతుంది. లేఖలు రాసి ప్రభుత్వంపై వత్తిడి తేవాలి.. మీ.చిత్తశుద్ధి ని నిరూపించుకోవాలి. లేకపోతే బిఆర్ఎస్, బీజేపీ వేరు కాదు ఒకే తాను ముక్కలు అని.ప్రజలు అర్థం చేసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X