हैदराबाद: आंध्र प्रदेश के एलुरु जिले के सोमावरप्पाडु के पास गुरुवार सुबह भीषण सड़क हादसा हुआ। इस हादसे में तीन लोगों की मौके पर ही मौत हो गई।
मिली जानकारी के अनुसार, वेंकटरमण ट्रैवल्स की बस यात्रियों को लेकर हैदराबाद से काकीनाडा के लिए रवाना हुई। जैसे ही बस एलुरु जिले के सोमवरप्पाडु पहुंची, तेज रफ्तार के कारण उसका नियंत्रण खो गया और वह विपरीत दिशा से आ रही एक लॉरी से टकरा गई। इस दुर्घटना में बस में सवार तीन यात्रियों की मौके पर ही मौत हो गई, जबकि कुछ अन्य घायल हो गए। बस चालक की हालत भी गंभीर बताई जा रही है।

स्थानीय लोगों से मिली सूचना के आधार पर पुलिस दुर्घटनास्थल पर पहुंची और निरीक्षण किया। प्रारंभिक जांच से पता चला है कि बस चालक की अत्यधिक गति ही दुर्घटना का कारण है। घायलों को निकटतम अस्पताल में भर्ती किया गया। पुलिस ने शवों को पोस्टमार्टम के लिए एलुरु जिला अस्पताल भेज दिया तथा मामला दर्ज कर जांच शुरू कर दी।
Also Read-
ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు దుర్మరణం
హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో స్పాట్‌లోనే ముగ్గురు దుర్మరణం పాలైన విషాద ఘటన ఏలూరు జిల్లా లోని సోమవరప్పాడు వద్ద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే వెంకటరమణ ట్రావెల్స్ బస్సు ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి కాకినాడకు బయలుదేరింది. అయితే, బస్సు ఏలూరు జిల్లా, సోమవరప్పాడు వద్దకు చేరుకోగానే అతివేగంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరికొందరికి గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. బస్సు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేల్చారు. ఈ మేరకు గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జిల్లా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. (ఏజెన్సీలు)
Three killed in a horrific road accident in Andhra Pradesh
Hyderabad: A horrific road accident occurred near Somavarappadu in Eluru district of Andhra Pradesh on Thursday morning, resulting in the deaths of three people on the spot.
According to reports, a Venkataramana Travels bus traveling from Hyderabad to Kakinada lost control due to excessive speed and collided with an oncoming lorry. In this accident, three passengers on the bus died instantly, while several others were injured. The condition of the bus driver is also reported to be critical.
The police reached the accident site based on information received from local residents and conducted an investigation. Preliminary investigation revealed that the bus driver’s excessive speed was the cause of the accident. The injured were admitted to the nearest hospital, and the police sent the bodies for post-mortem to the Eluru District Hospital and registered a case for further investigation.