హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా గురువారం పోలింగ్ సిబ్బంది అధికారుల రెండవ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. గురువారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి నేతృత్వంలో జనరల్, పోలీస్ అబ్జర్వర్ల సమక్షంలో ఎన్నికల సంఘం నిబంధనలు అనుసరిస్తూ పూర్తి పారదర్శకంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండవ ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.
జిల్లాలోని సికింద్రాబాద్, హైదరాబాద్ రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు మేడ్చల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు కేటాయించాల్సిన సిబ్బంది, అధికారుల రెండవ ర్యాండమైజేషన్ ప్రక్రియ గురించి జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ అబ్జర్వర్లకు వివరిస్తూ, ప్రక్రియ మొత్తాన్ని ఎన్నికల ఏర్పాట్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ర్యాండమైజేషన్ ప్రక్రియలో సిపి శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ పోలీస్ కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్, జిల్లా కలెక్టర్, హైదరాబాద్ రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురిశెట్టి, హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్, సికింద్రాబాద్ రిటర్నింగ్ అధికారి, హేమంత్ కేశవ్ పాటిల్, ఈ వి డి ఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ జనరల్ అబ్జర్వర్ శ్రీవిద్యా, 2010 ఐఏఎస్ బ్యాచ్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ జనరల్ అబ్జర్వర్ డాక్టర్ సరోజ్ కుమార్, 2008 ఐఏఎస్ బ్యాచ్, హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల పోలీస్ అబ్జర్వర్ శశంక్ ఆనంద్ 2006 ఐ.పి.ఎస్ బ్యాచ్, నోడల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ 179 మద్యం షాపులు వద్ద ఏర్పాటు చేసిన సిసి కెనరా ద్వారా పరిశీలన సి-విజిల్, ఎఫ్ ఎస్ టి, యస్ యస్ టి, కమాండ్ కంట్రోల్ ద్వారా పరిశీలన చేస్తున్న విషయాన్ని అబ్జర్వర్ లకు వివరించారు.