థాంక్యూ సార్ థాంక్యూ సార్ CM రేవంత్ సార్ థాంక్యూ సార్ నినాదాలతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం

క్రీడారంగా చరిత్రలో సువర్ణ అధ్యాయం

చారిత్రాత్మక క్రీడా బడ్జెట్ఇది

స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేనారెడ్డి

సీఎం రేవంత్ చిత్రపటానికి క్రీడాకారుల పాలాభిషేకాలు

థాంక్యూ సార్ థాంక్యూ సార్ సీఎం రేవంత్ సార్ థాంక్యూ సార్ నినాదాలతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం

హైదరాబాద్ : క్రీడలకు గతంలో ఎన్నడూ లేనివిధంగా చారిత్రాత్మక బడ్జెట్ కేటాయించినందుకు యావత్తు తెలంగాణ క్రీడా సమాజం పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తుందని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేనారెడ్డి అన్నారు. బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతగా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేనారెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఎల్బీ స్టేడియంలో క్రీడాకారులు క్రీడాభిమానుల చే సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. థాంక్యూ సార్ థాంక్యూ సార్ సీఎం రేవంత్ సార్ థాంక్యూ సార్ అన్న క్రీడాకారుల నినాదాలతో స్టేడియం మారుమోగిపోయింది.

క్రీడాకారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ బడ్జెట్లో క్రీడలకు పెద్దపీట వేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేనారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు కేటాయించిన బడ్జెట్ గత ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో పదేళ్ల ప్రభుత్వం కానీ కేటాయించలేదని క్రీడల అభివృద్ధి సంక్షేమానికి నూతన బాటలు వేస్తూ326 కోట్ల బడ్జెట్ కేటాయించడం హర్షణీయమని అన్నారు. ఇది క్రీడా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయమని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్రీడారంగ నిష్ణాతులు,క్రీడాకారులు క్రీడాభిమానులు క్రీడా సంఘాల ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తోందని, క్రీడారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం పట్ల యావత్ తెలంగాణ సమాజం సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ న్నారని ఆయన తెలిపారు.

Also Read-

రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ తో అంచలంచలుగా అన్ని క్రీడా విభాగాల్లో అభివృద్ధి సాధించే విధంగా ముందుకు వెళ్తామని తెలంగాణలో గ్రామీణ క్రీడా రంగా అభివృద్ధికి క్రీడాకారుల సంక్షేమానికిప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపారు. అందరితో సమగ్రంగా చర్చించి పటిష్టమైన ప్రణాళికతో, పకడ్బందీ విధానాలతో ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఉపసంచాలకులు శ్రీమతి అనురాధ, చంద్రారెడ్డి రవీందర్, సుజాత, సూర్యలత ఇంజనీర్ అశోక్ కుమార్ స్టేడియాల అడ్మినిస్ట్రేటర్లు, కోచులు స్పోర్ట్స్ అథారిటీ సిబ్బంది, క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X