హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా చేసే జనాభా లెక్కల్లో కుల గణన చేస్తామనడం తెలంగాణ ప్రభుత్వ విజయం అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా సామాజిక అసమానతలు తొలగించడానికి దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలని డిమాండ్ చేశారు.
ఇందుకోసం ముందుగా తెలంగాణ ప్రభుత్వం కుల గణన చేసి దేశానికి దిక్సూచిగా మారిందని పేర్కొన్నారు. కుల గణన ఆధారంగా బీసీ లకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేసిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణన ఆధారంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం చేసే జనాభా లెక్కల్లో కుల గణన చేస్తామని పేర్కొనడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు.
Also Read-
ఇది ఒక్క గొప్ప మార్పుగా భావిస్తున్నాం. దీని ద్వారా సామాజిక రుగ్మతలు తొలగి అందరికీ సామాజిక న్యాయం జరుగుతుందని ఆకాంక్షిస్తున్న అని తెలిపారు. తెలంగాణ లో కుల గణన చేయడానికి బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచడానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సహచర మంత్రులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.
