हैदराबाद: देश में तेलंगाना एक मजबूत आर्थिक शक्ति के रूप में उभर रहा है। पृथक तेलंगाना गठन के समय से ही कई क्षेत्रों में अग्रणी रहा है। अब इसने एक और विषय में भी अपनी काबिलियत दिखाई है। वह है माल और सेवा कर (जीएसटी)। केंद्र सरकार द्वारा जीएसटी की शुरुआत के चार वर्षों में तेलंगाना ने जीएसटी संग्रह में 69 फीसदी की वृद्धि दर दर्ज की है। नियंत्रक एवं महालेखा परीक्षक को सौंपी गई रिपोर्ट के अनुसार, 2018-19 में तेलंगाना का जीएसटी राजस्व 28,786 करोड़ रुपये था। अब वित्त वर्ष 2022-23 में यह 41,889 करोड़ रुपए पर पहुंच गया है।
कोरोना महामारी ने पूरी दुनिया की अर्थव्यवस्था को चरमरा कर रख दिया। पूरी दुनिया थम गई थी। हालांकि, तेलंगाना जीएसटी संग्रह में एक आशाजनक प्रवृत्ति बनाए रखा है। वित्त वर्ष 2018-19 में केंद्रीय जीएसटी लागू होने के बाद तेलंगाना का जीएसटी संग्रह 28 हजार 786 करोड़ रुपए था। तेलंगाना अनुमानित बजट 34,232 करोड़ रुपये, इनमें 84 प्रतिशत हासिल कर लिया है। कहना होगा कि लॉकडाउन के दौरान भी तेलंगाना विकास के पथ पर लगातार अग्रसर रहा। 2019-20 में अनुमानित राजस्व 31 हजार 186 करोड़ रुपये है और इसने 97 प्रतिशत उम्मीदों को पूरा करते हुए 31 हजार 186 करोड़ रुपये एकत्र किए हैं।
उसके बाद वित्तीय वर्ष 2020-21 में 32 हजार 671 करोड़ रुपये का अनुमान लगाया गया और 80 फीसदी उम्मीदों पर खरा उतरते हुए 32 हजार 671 करोड़ रुपये की कमाई की। वित्तीय वर्ष 2021-22 पर नजर डालें तो 35 हजार 520 करोड़ रुपये का अनुमान और 34 हजार 489 करोड़ रुपये की वसूली हुई। 2022-23 में अनुमानित राजस्व 42 हजार 189 करोड़ रुपये था और यह 90 प्रतिशत हासिल करते हुए 41 हजार 889 करोड़ रुपये पर पहुंच गया।
केसीआर सरकार तेलंगाना राज्य के गठन की 10वीं वर्षगांठ मना रहे हैं। यह कहा जाना चाहिए कि इन दस वर्षों के दौरान तेलंगाना में महत्वपूर्ण परिवर्तन हुए हैं। आर्थिक स्थिति में सुधार के कारण नागरिकों की क्रय शक्ति में वृद्धि हुई है। इससे व्यापार क्षेत्र को बढ़ने में मदद मिली है और जीएसटी राजस्व में वृद्धि हुई है। देश के अधिकांश राज्य वित्तीय कठिनाइयों का सामना कर रहे हैं, लेकिन तेलंगाना लगातार विकास दर्ज कर आगे बढ़ रहा है।
జీఎస్‌టీ వసూళ్లలో తెలంగాణ రికార్డ్
హైదరాబాద్: దేశంలోనే తెలంగాణ రాష్ట్రం బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు అనేక రంగాల్లో ముందంజలో నడుస్తోంది. ఇప్పుడు మరో విషయంలోనూ తన సత్తా చాటుకుంది. అదే వస్తు సేవల పన్ను జీఎస్‌టీ వసూళ్లు. కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీని తీసుకొచ్చిన తర్వాత గడిచిన నాలుగేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం జీఎస్‌టీ వసూళ్లలో 69 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌కు సమర్పించిన నివేదిక ప్రకారం చూస్తే తెలంగాణ జీఎస్‌టీ ఆదాయం 2018-19లో రూ 28,786 కోట్లుగాఉంది. ఇప్పుడు 2022-23 ఆర్థిక ఏడాదిలో అది రూ 41,889 కోట్లకు చేరింది.
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా స్తంభించిపోయింది. అయినప్పటికీ తెలంగాణ మాత్రం జీఎస్‌టీ వసూళ్లలో ఆశాజనక ధోరణిని కొనసాగిస్తూ వచ్చింది. 2018-19 ఆర్థిక ఏడాదిలో కేంద్ర జీఎస్‌టీ తీసుకొచ్చాక తెలంగాణ జీఎస్‌టీ వసూళ్లు రూ28 వేల 786 కోట్లు. తెలంగాణ బడ్జెట్ అంచనా రూ 34 వేల 232 కోట్లుగా ఉండగా అందులో 84 శాతం సాధించింది. లాక్‌డౌన్ సమయంలోనూ తెలంగాణ వృద్ధి పథంలోనే కొనసాగిందని చెప్పాలి. 2019- 20లో అంచనా వసూళ్లు రూ31 వేల 186 కోట్లు కాగా 97 శాతం అంచనాలను అందుకుంటూ రూ 31 వేల 186 కోట్లు వసూలు చేసింది.
ఆ తర్వాత 2020- 21 ఆర్థిక ఏడాదిలో రూ 32 వేల 671 కోట్ల అంచనా వేయగా 80 శాతం అంచనాలను అందుకుంటూ రూ 32 వేల 671 కోట్లు రాబట్టింది. 2021- 22 ఆర్థిక ఏడాదిలో చూసుకున్నట్లయితే రూ 35 వేల 520 కోట్లు అంచనా వేయగా రూ 34 వేల 489 కోట్లు వసూలు చేసింది. 2022-23 లో అంచనా వసూళ్లు రూ 42 వేల 189 కోట్లు కాగా అది 90 శాతం సాధిస్తూ రూ 41 వేల 889 కోట్లకు చేరింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ పదేళ్ల కాలంలో తెలంగాణలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయనే చెప్పాలి. మెరుగైన ఆర్థిక పరిస్థితుల కారణంగా పౌరుల కొనుగోలు శక్తి పెరిగింది. తద్వారా వ్యాపార రంగం వృద్ధి చెందుతూ జీఎస్‌టీ రాబడులు పెరగడానికి దోహదపడింది. దేశంలోని చాలా రాష్ట్రాలు ఆర్థింగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా తెలంగాణ మాత్రం స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తూ ముందుకు వెళ్తోంది. (ఏజెన్సీలు)