హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన “సురక్షా దినోత్సవ వేడుకలలో” భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో ఉదయం పెట్రోలింగ్ కార్లు, బ్లూ కోర్స్ వాహనాలు మరియు అగ్నిమాపక వాహనాలతో భారీ ర్యాలీని రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్, ఐటి కోర్ అండ్ సైబర్ సెల్ ను మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ… పోలీసులకు సురక్షా దినోత్సవ శుభాకాంక్షలు. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్ర పోలీసు వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. సీఎం కేసీఆర్ పారదర్శక పాలనలో పోలీసులు ప్రజలతో మెరుగైన సంబంధాలు ఏర్పర్చుకొని వారి సమస్యలు పరిష్కరించడంలో విజయం సాధిస్తున్నారు.
గడిచిన 9 ఏండ్ల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసుతో పాటు పోలీసు శాఖలలో అనేక సంస్కరణలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేసి ప్రజలకు భద్రత కల్పిస్తుంది. మహిళలకు షీటీమ్స్‌తో భద్రత కల్పిస్తున్నారు.
గౌరవ సీఎం కేసీఆర్ గారు పోలీసు శాఖకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్నారని, పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని త్వరగా కేసులు ఛేదిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కోసం ప్రవేశపెడుతున్న ప్రతి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి.
పోలీస్ శాఖకు 2013-14లో 6వేల మంది సిబ్బంది ఉండగా, ప్రస్తుతం 9,600 సిబ్బందిని నియమించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం వందేండ్ల భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎన్నో ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలు చేయడం జరుగుతుంది.
హోంగార్డులకు గౌరవ వేతనం 30 శాతం పెంచిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుంది. నేడు సురక్షా వేడుకల్లో భాగంగా శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విదానాలను ప్రజలకు వివరించేందుకు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి గారితో పాటు జడ్పీ చైర్పర్సన్ కుమారి అంగోత్ బిందు, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు, శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్, ఎంపీ మాలోత్ కవిత, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక,ఎస్పీ శరత్ చంద్ర పవార్ పోలీస్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కుల వృత్తులకు జీవం పోసింది కెసిఆర్ సర్కార్.
తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి
ముదిరాజ్ కమ్యూనిటీ భవన నిర్మాణానికి 30లక్షల నిధులు..
నిధులు మంజూరు పట్ల హర్షం వ్యక్తం చేసిన ముదిరాజ్ కులస్తులు
9యేండ్లలో కరీంనగర్ అన్నిరంగాల్లో అభివృద్ధి
ముదిరాజ్ ఆత్మగౌరవ భవనానికి నిధులు మంజూరు చేసిన మంత్రి గంగుల కమలాకర్ ను సన్మానించిన ముదిరాజ్ కులస్తులు
తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలప్రజలు సంతోషంగా ఉండాలని… కుల వృత్తులకు జీవం పోసింది కేసీఆర్ సర్కారే నాని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ అన్నారు.
నేడు ఆదివారం రాంనగర్ లోని పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని మంత్రి గంగుల కమలాకర్ దర్శించుకున్నారు.. అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి ముదిరాజ్ కులస్తుల విజ్ఞప్తి మేరకు 30 లక్షల రూపాయలునిధులు మంజూరు చేశారు.. తమ విజ్ఞప్తి మేరకు నిదుర మందులు చేసిన గంగుల కమలాకర్ గారిని ముదిరాజ్ కులస్తులు శాలువా కప్పి భారీ గజమాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని అన్ని కులాల ఆత్మగౌరవ భవనాలకు ప్రభుత్వ నిధులతో పాటు హైదరాబాద్ నడి బొడ్డులో ఖరీదైన స్థలాలు మంజూరు చేసిందని గుర్తు చేశారు. కరీంనగర్ రామ్ నగర్ లోని ముదిరాజ్ కులస్తుల ఆత్మగౌరవ భవనానికి 30 లక్షల నిధులు మంజూరు చేసినట్టు వెల్లడించారు.
అన్ని వర్గాల ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో కరీంనగర్ అభివృద్ధిలో వెనుకబడిందని అన్నారు. ఎక్కడ చూసినా గుంతల రోడ్లు అస్తవ్యస్తంగా మురికి కాలువలు దర్శనమిచ్చేయని అన్నారు.
9 ఏండ్ల తెలంగాణ పాలనలో కరీంనగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు.
కరీంనగర్ లో ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని నగర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని గుర్తు చేశారు. కరీంనగర్ లో తీగల వంతెన ,మానేర్ రివర్ ఫ్రంట్ వంటి ప్రాజెక్టులతో పూర్తయితే .. కరీంనగర్ కు పర్యాటక శోభ సంతరించుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డ వేణి మధు గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్ బారాస నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ మాజీ కార్పొరేటర్లు పెంట సత్యం వరాల నారాయణ, నాయకులు కొట్టే మల్లేశం పలువురు ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్దిఉత్సవాలు
ఉత్సవాలలో భాగంగా జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవం. ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి,పాల్గొన్న రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్ యాదవ్, బొల్లం మల్లయ్య యాదవ్,జిల్లా కలెక్టర్ వెంకట్రావు, యస్ పి రాజేంద్రప్రసాద్ తదితరులు. సురక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సురక్ష ర్యాలీనీ పచ్చ జెండా ఊపి ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి