EC అనుమతి రానందున తెలంగాణ మంత్రివర్గ సమావేశం వాయిదా, ఎప్పుడు వస్తే అప్పుడే భేటీ

कैबिनेट बैठक स्थगित

हैदराबाद : मुख्यमंत्री ए वंत रेड्डी ने शनिवार दोपहर को कैबिनेट बैठक करने का फैसला लिया। सरकार ने चुनाव आचार संहिता लागू होने के कारण कैबिनेट बैठक के लिए चुनाव आयोग से अनुमति मांगी है। लेकिन शनिवार रात तक EC से इजाजत नहीं मिली थी। EC की ओर से कोई जवाब न मिलने के कारण कैबिनेट बैठक स्थगित कर दी गई। सभी मंत्री शनिवार दोपहर से रात तक सचिवालय में इंतजार करते रहे। लेकिन चुनाव आयोग से कोई अनुमति नहीं मिली।

హైదరాబాద్ : శనివారం మధ్యాహ్నం కేబినేట్ సమావేశం నిర్వహించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కేబినేట్ సమావేశానికి ప్రభుత్వం ఈసీ అనుమతి కోరింది. కానీ శనివారం రాత్రి వరకు ఈసీ నుంచి అనుమతి రాలేదు.

ఈసీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో ఈ రోజు జరగాల్సిన కేబినేట్ భేటీ నిలిచిపోయింది. ఈసీ నుంచి ఏ క్షణమైన అనుమతి వస్తుందని మంత్రులు అందరూ శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సచివాలయంలో వేచి ఉన్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అన్ని విభాగాల అధికారులు కేబినేట్ భేటీకి హాజరయ్యేందుకు ఆఫీసులకు చేరుకున్నారు. కానీ రాత్రి 7 గంటల వరకు ఈసీ నుంచి స్పందన లేకపోవటంతో కేబినేట్ భేటీ జరగలేదు. సీఎంతో పాటు మంత్రులు వెనుదిరిగి వెళ్లారు.

संबंधित खबर-

రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన పలు కీలకమైన విషయాలపై ఈ భేటీలో చర్చించాలని ఎజెండా సిద్ధం చేసుకున్నారు. కానీ ఈసీ నుంచి స్పందన లేకపోవటంతో రైతుల సంక్షేమం, అత్యవసరమైన అంశాలపై చర్చించలేకపోయామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం. అందుకు సంబంధించిన వేడుకల నిర్వహణతో పాటు పునర్విభజనకు పదేండ్లు పూర్తి కావటంతో ఇప్పటివరకు రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న అంశాలు, పునర్విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న కీలకమైన అంశాలను కేబినేట్ భేటీలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కేబినేట్ భేటీ వాయిదా పడటంతో ఇవేవీ చర్చ జరగలేదు.

ఈసీ నుంచి అనుమతి ఎప్పుడు వస్తే అప్పుడే కేబినేట్ భేటీ జరపాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. సోమవారం లోపు ఈసీ నుంచి అనుమతి రాకపోతే, అవసరమైతే మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అనుమతి కోరుతామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X