T20 World Cup 2024 : भारत ने आयरलैंड को 8 विकेट से हराया, रिटायर्ड हर्ट रोहित शर्मा ने स्थापित किये अनेक कीर्तिमान

हैदराबाद : भारत ने आयरलैंड को टी-20 वर्ल्ड कप हराया है। पहले तेज गेंदबाजों की चौकड़ी ने उछाल लेती पिच पर आयरलैंड को बुधवार रात सिर्फ 96 रन पर समेट दिया। इसके बाद में कप्तान रोहित शर्मा की रिकॉर्ड फिफ्टी के दम पर दो विकेट खोकर 46 गेंद पहले हासिल कर लिया। कप्तान रोहित शर्मा 52 रन बनाकर रिटायर्ड हर्ट हुए। तीसरे नंबर पर उतरे ऋषभ पंत ने 36 रन की नाबाद पारी खेली। अब भारत का अगला मैच चिर प्रतिद्वंद्वी पाकिस्तान के खिलाफ 9 जून को न्यूयॉर्क के इसी नसाउ काउंटी इंटरनेशनल स्टेडियम में होगा।

कप्तान रोहित शर्मा ने 37 गेंद में 52 रन बनाए। चार चौके और तीन छक्के की पारी में उन्होंने कई कीर्तिमान अपने नाम किए। इस फिफ्टी के दौरान उन्होंने टी-20 इंटरनेशनल में चार हजार तो टी-20 वर्ल्ड कप में हजार रन का आंकड़ा पूरा किया। गेंद अजीबोगरीब तरीके से उछाल ले रही थी। ऐसे में एक गेंद उनके कंधे में जा लगी, जिसके बाद रोहित ने बिना कोई रिस्क लेते हुए मैदान से बाहर जाना ही जरूरी समझा।

वर्ल्ड कप के ओपनिंग मैच में भारत ने मास्टर स्ट्रोक लगाते हुए रोहित शर्मा और विराट कोहली को ओपनिंग करने भेजा था, लेकिन यशस्वी जायसवाल को बाहर बिठाने का दांव उल्टा पड़ गया। विराट कोहली सिर्फ पांच गेंद में एक रन बनाकर आउट हो गये। इसके बाद तीसरे नंबर पर ऋषभ पंत आए और कप्तान रोहित शर्मा के साथ मिलकर पारी को आगे बढ़ाया। रोहित ने इस दौरान अपना अर्धशतक पूरा किया, लेकिन इसके फौरन बाद कंधे पर गेंद लगते ही वह रिटायर्ट हर्ट हो गए। अगले बल्लेबाज सूर्यकुमार यादव थे, जो चार गेंद में दो रन बनाकर आउट हो गए।

यह भी पढ़ें-

इससे पहले अर्शदीप सिंह ने चार ओवर में 35 रन देकर दो विकेट लिए जबकि हार्दिक पंड्या ने 27 रन देकर तीन विकेट चटकाए। जसप्रीत बुमराह ने तीन ओवर में छह रन देकर दो विकेट लिए और मोहम्मद सिराज ने तीन ओवर में 13 रन देकर एक विकेट लिया। भारत के चौतरफा तेज आक्रमण को मिल रही स्विंग, सीम और अतिरिक्त उछाल के सामने आयरलैंड के बल्लेबाज टिककर खेल नहीं सके। भारत के लिए 16 में से 14 ओवर तेज गेंदबाजों ने फेंके। आयरलैंड के लिए जेरेथ डेलानी (14 गेंद में 20 रन) के अलावा कोई बल्लेबाज 20 रन के पार नहीं जा सका। डेलानी की पारी की बदौलत आयरलैंड टीम 100 रन के आसपास पहुंची।

T20 World Cup : ఐర్లాండ్‌పై భారత్ 8 వికెట్లతో విజయం

హైదరాబాద్ : భారత్ టీమ్ టీ20 ప్రపంచకప్ వేటను మొదలు పెట్టింది. తొలి మ్యాచ్‌లో పసికూన ఐర్లాండ్‌ను చిత్తు చేసి బోణీ కొట్టింది. న్యూయార్క్ వేదికగా బుధవారం జరిగిన గ్రూపు ఏ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై భారత్ 8 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్‌.. భారత పేసర్ల ధాటికి 16 ఓవర్లలోనే కుప్పకూలింది. 96 పరుగులకే ఆలౌటైంది. డెలానీ(26) టాప్ స్కోరర్. ఐదుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. హార్దిక్ పాండ్యా(3/27), బుమ్రా(2/6), అర్ష్‌దీప్ సింగ్(2/35) నిప్పులు చెరిగే బంతులతో ఐర్లాండ్ పతనాన్ని శాసించారు. అనంతరం 97 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని భారత్ 2 వికెట్లే కోల్పోయి 12.2 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(52) హాఫ్ సెంచరీ సత్తాచాటగా.. రిషబ్ పంత్(36 నాటౌట్) రాణించాడు.

ఐర్లాండ్‌ తక్కువ స్కోరుకే పరిమితమవడంతో తొలి ఇన్నింగ్స్‌లోనే భారత్ విజయం లాంఛనమైపోయింది. 97 పరుగులను ఛేదించడానికి టీమ్ ఇండియా ఎన్ని ఓవర్లు తీసుకుంటుందోనని మాత్రమే అభిమానులు ఎదురుచూశారు. అయితే, ఛేదనలో టీమ్ ఇండియాకు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లీ(1) నిరాశపరిచాడు. అయితే, మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం చెలరేగి ఆడాడు. పిచ్ బౌలింగ్‌కు అనుకూలిస్తుండటంతో వికెట్ల మధ్య పరుగులు రాబడుతూనే.. ధాటిగా ఆడాడు.

తొలి ఓవర్‌లోనే ఫోర్ కొట్టిన అతను.. జాషువా లిటిల్ వేసిన ఓవర్‌లో వరుసగా 4, 6 దంచాడు. అతనికి రిషబ్ పంత్ చక్కటి సహకారం అందించాడు. పవర్ ప్లే తర్వాత రెచ్చిపోయిన రోహిత్ జాషువా లిటిల్ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు కొట్టాడు. ఆ తర్వాతి ఓవర్‌లో ఫోర్ కొట్టిన అతను హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే, కాసేపటికే బంతి చేతికి తాకడంతో అతను రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. రోహిత్ మైదానం వీడే సమయానికి భారత్ విజయానికి ఇంకా 21 పరుగులు కావాలి. క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్(2) నిరాశపర్చగా.. రిషబ్ పంత్(36 నాటౌట్) మిగతా పని పూర్తి చేశాడు.

అంతకుముందు భారత పేసర్లు విజృంభించారు. నిప్పులు చెరిగే బంతులతో చెలరేగగా.. ఐర్లాండ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూకట్టారు. డెలానీ చేసిన 26 పరుగులే టాప్ స్కోర్ అంటే ఐర్లాండ్‌ను భారత బౌలర్లు ఏ విధంగా బెంబేలెత్తించారో అర్థం చేసుకోవచ్చు. మొదట అర్ష్‌దీప్ సింగ్ ఒకే ఓవర్‌లో ఓపెనర్లు స్టిర్లింగ్(2), బల్బర్నీ(5)లను అవుట్ చేసి ప్రత్యర్థి పతనాన్ని మొదలుపెట్టాడు. బంగ్లాతో వార్మప్ మ్యాచ్‌లో మెరిసిన హార్దిక్ పాండ్యా మరోసారి బంతితో చెలరేగాడు. లోర్కాన్ టకర్(10), కర్టిస్ కాంఫర్(12)లను పెవిలియన్ పంపాడు. దీంతో 44 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఆ తర్వాత కూడా ఆ జట్టును ఆదుకునే వారు కరువయ్యారు. బుమ్రా, సిరాజ్, అక్షర్ కూడా మెరవడంతో ఐదు పరుగుల వ్యవధిలోనే ఐర్లాండ్ మరో మూడు వికెట్లు కోల్పోయి 50/8తో ఆలౌట్ అంచున నిలిచింది. జాషువా లిటిల్(14)తో కలిసి డెలానీ కాసేపు పోరాడటంతో ఐర్లాండ్ 100 పరుగుల దిశగా వెళ్లింది. అయితే, బుమ్రా బౌలింగ్‌లో జాషువా లిటిల్ బౌల్డ్ అవ్వగా.. కాసేపటికే చివరి వికెట్‌గా డెలానీ రనౌటవడంతో ఐర్లాండ్ ఆట 16 ఓవర్లలోనే ముగిసింది. భారత బౌలర్లలో పాండ్యా 3 వికెట్లు, అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా రెండేసి వికెట్లతో సత్తాచాటారు. సిరాజ్, అక్షర్ పటేలకు చెరో వికెట్ దక్కింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X