T20 World Cup 2024 : ये टीमें हैं खिताब प्रबल दावेदार, दिग्गज विश्लेषकों का हैं यह अनुमान

हैदराबाद : क्रिकेट फैंस को जिस टी20 वर्ल्ड कप 2024 का इंतजार है, वह तीन दिन में शुरू हो जाएगा। करीब एक महीने तक चलने वाले इस टूर्नामेंट में 20 टीमें प्रतिस्पर्धा करेंगी। लगभग सभी टीमें पहले ही टूर्नामेंट के आयोजन स्थल अमेरिका और वेस्टइंडीज पहुंच चुकी हैं। अभ्यास सत्र, जर्सी के साथ फोटो खिंचवाने वाले खिलाड़ी नियमित रूप से सोशल मीडिया के माध्यम से सामने आ रहे हैं। वैसे तो टूर्नामेंट में 20 टीमें भाग ले रही हैं, हालांकि, विश्लेषकों का मानना ​​है कि मुख्य रूप से 4-6 टीमें खिताब की प्रबल दावेदार हैं।

इस लिस्ट में पिछले कुछ सालों से लगातार अच्छा प्रदर्शन कर रही भारतीय क्रिकेट टीम का नाम प्रमुख है। लगभग दस खेल विश्लेषकों और पूर्व क्रिकेटरों ने सेमीफाइनल में पहुंचने वाली टीमों की भविष्यवाणी की है। गौरतलब है कि इन सभी में टीम इंडिया को जगह मिल गई हैत। पाकिस्तान, जो पिछले साल सेमीफाइनलिस्टों में से एक था, के बारे में कई विश्लेषकों ने विचार नहीं किया। वेस्टइंडीज के दिग्गज ब्रायन लारा ने भविष्यवाणी की है कि अफगानिस्तान की टीम टॉप-4 में रहेगी।

यह भी पढ़ें-

भारतीय क्रिकेट के दिग्गज खिलाड़ी सुनील गावस्कर ने भी अपनी राय रखी है। उन्होंने इस सूची में भारतीय टीम को अग्रिम पंक्ति में रखा है टी20 विश्व कप 2024 के लिए सेमीफ़ाइनल टीमों की भविष्यवाणी किसने की? इसमें किन टीमों को जगह दी गई है? आइए अब इन पर नजर डालते हैं…

सुनील गावस्कर: भारत, ऑस्ट्रेलिया, इंग्लैंड, वेस्ट इंडीज

अंबाती रायडू: भारत, इंग्लैंड, न्यूजीलैंड, दक्षिण अफ्रीका

ब्रायन लारा: भारत, इंग्लैंड, वेस्टइंडीज, अफगानिस्तान

पॉल कॉलिंगवुड: इंग्लैंड, वेस्टइंडीज, ऑस्ट्रेलिया, भारत

क्रिस मॉरिस: भारत, दक्षिण अफ्रीका, ऑस्ट्रेलिया, पाकिस्तान

मैथ्यू हेडन: भारत, इंग्लैंड, ऑस्ट्रेलिया, दक्षिण अफ्रीका

एरोन फिंच: भारत, ऑस्ट्रेलिया, इंग्लैंड, वेस्टइंडीज

मोहम्मद कैफ: भारत, इंग्लैंड, ऑस्ट्रेलिया, पाकिस्तान

टॉम मूडी: भारत, इंग्लैंड, ऑस्ट्रेलिया, दक्षिण अफ्रीका

श्रीशांत: भारत, इंग्लैंड, ऑस्ट्रेलिया, पाकिस्तान

देखा जा सकता है कि इन सभी भविष्यवाणियों में भारत 4 टीमों में से एक है। विश्लेषकों का कहना है कि भारत इस बार विश्व स्तरीय बल्लेबाजों, तेज गेंदबाजों, स्पिनरों और ऑलराउंडरों के साथ एक मजबूत टीम दिख रही है।

अब किसकी भविष्यवाणी सच होगी? कौन सी टीमें सेमीफाइनल में पहुंचेंगी यह कुछ दिनों में पता चल जाएगा। टूर्नामेंट के तहत कुल 55 मैच खेले जाएंगे। जिसमें से 16 मैच अमेरिका में और बाकी वेस्टइंडीज में खेले जाएंगे। ग्रुप-ए में शामिल भारत अपने पहले मैच में 5 जून को आयरलैंड से भिड़ेगा। 9 जून को पड़ोसी देश पाकिस्तान के खिलाफ खेला जाएगा। लीग स्टेज में भारत द्वारा खेले जाने वाले सभी मैच रात 8 बजे शुरू होंगे।

T20 World Cup 2024 : సెమీస్‌కు చేరే జట్లు ఇవే, విశ్లేషకుల అంచనా ఇదే

హైదరాబాద్ : క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ 2024 మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. సుమారు నెలరోజుల పాటూ సాగే ఈ టోర్నీలో 20 జట్లు పోటీపడనున్నాయి. ఇప్పటికే దాదాపుగా అన్ని జట్లూ కూడా టోర్నీ వేదికలు అయిన అమెరికా, వెస్టిండీస్ చేరుకున్నాయి. ప్రాక్టీస్ సెషన్స్, జెర్సీలతో ప్లేయర్లు ఫొటోలకు ఫోజులివ్వడం వంటి విషయాలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు వెల్లడిస్తున్నాయి. టోర్నీలో పాల్గొనేవి 20 జట్లు అయినా.. ప్రధానంగా 4-6 జట్ల పేర్లు టైటిల్ ఫేవరెట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

గత కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్న భారత క్రికెట్ జట్టు పేరు ఈ జాబితాలో ప్రధానంగా ఉంది. సుమారు పది మంది వరకు క్రీడా విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు సెమీస్ చేరే జట్లేవో అంచనా వేశారు. ఇందులో అన్నింట్లోనూ టీమిండియా చోటు దక్కించుకోవడం గమనార్హం. గతేడాది సెమీఫైనల్ చేరిన జట్లలో ఒకటిగా ఉన్న పాకిస్థాన్ జట్టును చాలా మంది పరిగణలోకి తీసుకోలేదు. విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా అయితే ఏకంగా అప్ఘానిస్థాన్ జట్టు టాప్-4లో నిలుస్తుందని జోస్యం చెప్పాడు.

భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ సైతం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ జాబితాలో భారత జట్టును ముందు వరుసలో ఉంచాడు. టీ20 ప్రపంచకప్ 2024 కోసం సెమీఫైనల్ జట్లను ఎవరెవరు అంచనా వేశారు? ఏయే జట్లకు అందులో చోటు కల్పించారు? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం…

సునీల్ గావస్కర్: భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్

అంబటి రాయుడు: భారత్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా

బ్రియాన్ లారా: భారత్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, అఫ్ఘానిస్థాన్

పాల్ కాలింగ్ వుడ్: ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, భారత్

క్రిస్ మోరిస్: భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్

మాథ్యూ హేడెన్: భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా

ఆరోన్ ఫించ్: భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్

మహమ్మద్ కైఫ్: భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్

టామ్ మూడీ: భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా

శ్రీశాంత్: భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్

ఈ అన్ని అంచనాల్లోనూ 4 జట్లలో భారత్ ఉండటాన్ని గమనించవచ్చు. ప్రపంచ మేటి బ్యాట్స్‌మన్లు, పేసర్లు, స్పిన్నర్లు, ఆల్‌రౌండర్లతో భారత్ ఈసారి బలమైన జట్టుగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

మరి ఇందులో ఎవరి అంచనా నిజం అవుతుంది? ఏయే జట్లు సెమీఫైనల్ చేరతాయనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. టోర్నీలో భాగంగా మొత్తం 55 మ్యాచులు జరగనున్నాయి. అందులో 16 మ్యాచులు అమెరికాలో.. మిగతావి వెస్టిండీస్‌లో జరుగుతాయి. గ్రూప్-ఏలో ఉన్న భారత్.. జూన్ 5న తన తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది. జూన్ 9న దాయాది పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ దశలో భారత్ ఆడే అన్ని మ్యాచులూ రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతాయి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X