हैदराबाद : तेलंगाना के संगारेड्डी जिले में भीषण अग्नि दुर्घटना हुई। तेज रफ्तार लॉरी में आग लग गई। हादसे में लॉरी पूरी तरह से जल गई। अग्नि दुर्घटना नांदेड़-अखोला राष्ट्रीय राजमार्ग 161 पर हुई। स्थानीय लोगों की सूचना पर दमकलकर्मी मौके पर पहुंचे और अग्निशामक यंत्रों की मदद से आग पर काबू पाया।
लॉरी में अचानक लगी आग के चलते चालक व क्लीनर भयभीत हो गये। आग देखकर चालक व क्लीनर नीचे कूद गए और अपनी जान बचा ली। लेकिन ट्रक के अंदर रखा चावल पूरी तरह जल गया। अधिकारियों का कहना है कि वाहन की गति तेज होने के कारण टायर फट गया और उसमें आग लग गई।
अधिकारियों ने पाया है कि लॉरी महाराष्ट्र की है। यह दुर्घटना मंचेरियाल से नांदेड़ जाते समय चौटकुर मंडल के शिवमपेट के पास हुई। दमकल कर्मियों ने तुरंत पहुंचकर आग बुझाई। इसके चलते एक बड़ा हादसा टल गया। अभी इस घटना के बारे में पूरी जानकारी नहीं मिल पाई है। गौरतलब है कि हाल ही में ऐसे हादसे बार-बार हो रहे हैं। चलती गाड़ियों में आग लग रही है। कारों और लॉरियों में आग लगने से यात्री परेशान हैं।
వేగంగా వెళుతున్న లారీలో చెలరేగిన మంటలు, డ్రైవర్ మరియు క్లీనర్ ఇలా వారి ప్రాణాలను కాపాడారు, కానీ…
హైదరాబాద్ : సంగారెడ్డి (తెలంగాణ) జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వెళుతున్న లారీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో లారీ అగ్నికి ఆహుతైంది. నాందేడ్-అఖోల 161వ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైరింజన్ల సహాయంతో మంటలను ఆర్పివేశారు.
లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో డ్రైవర్, క్లీనర్ భయాందోళనకు గురయ్యారు. అయితే మంటలను గమనించి డ్రైవర్, క్లీనర్ క్రిందకు దూకి తప్పించుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. కానీ లారీతో పాటు లోపల ఉన్న బియ్యం పూర్తిగా దగ్ధం అయ్యాయి. అతివేగంతో వాహనాన్ని నడపడంతో టైర్ బ్లాస్ట్ అయి మంటలు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
లారీ మహారాష్ట్రకు చెందనదిగా అధికారులు గుర్తించారు. మంచిర్యాల నుంచి నాందేడ్ వెళ్తుండగా చౌటకూర్ మండలం శివ్వంపేట వద్ద ఈ ఘటన జరిగింది. ఫైర్ సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను ఆర్పేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఇటీవల తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కదులుతున్న వాహనాల్లో మంటలు చెలరేగుతున్నాయి. కారు, లారీలలో మంటలు రావడంతో ప్రయాణికులు ఆందోళనలకు గురవుతున్నారు. (ఏజెన్సీలు)