లక్ష మందితో లక్ష హారతి, వినూత్నంగా సాగునీటి దినోత్సవం
నాగరం మండలం ఈటూరు నుండి పెన్పహడ్ మండలం రావి చెరువు వరకు 68 కిలో మీటర్ల దారి పొడవునా కాలువల వెంట కాళేశ్వరం జలాలకు ప్రత్యేక పూజలు
ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞత చెప్పెందుకు మూకుమ్మడిగా సమాయత్తం అయినా ప్రజాప్రతినిధులు
ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ వెంకట్రావు అధ్యక్షతన ప్రత్యేక సమీక్షా సమావేశం
ముఖ్య అతిధిగా హాజరై ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి జగదీష్ రెడ్డి
జిల్లా వ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్
సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు కాలువల వెంట పారుతున్న కాళేశ్వరం జలాలకు ప్రత్యేక పూజలు
కాళేశ్వరం జలాలతో లబ్ది పొందిన లబ్దిదారులభాగస్వామ్యంతో బతుకమ్మ, బోనాలు, మంగళ వాయిద్యాలతో ఊరు వాడ కదిలేలా
బొడ్డు రాయి పండగను మై మరిపించేలా
7 మండలాలకు చెందిన 126 గ్రామాల భాగస్వామ్యంతో
ప్రతి పావు కిలోమీటరుకు ఒక ప్రత్యేక అధికారి
మొత్తం280 మంది ప్రత్యేక అధికారుల బృందం పర్యవేక్షణలో
ఎక్కడికక్కడ భోజనాల ఏర్పాట్లు
అడుగడుగునా అందుబాటులో వైద్య బృందాలు
భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు
బుధవారం ఉదయం నుండే భోజనశాలల ఏర్పాట్లు
సూర్యాపేట నియోజకవర్గం లో మంత్రి జగదీష్ రెడ్డి, తుంగతుర్తి నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్, కోదాడ నియోజకవర్గం లో స్థానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ లు పాల్గొంటారు.
హైదరాబాద్: కాళేశ్వరం జలాలతో తొలి సారిగా లబ్ది పొందిన సూర్యాపేట జిల్లా రైతాంగం ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుకునేందుకు గాను రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా రైతాంగం వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సావాలలో బాగంగా ఈ నెల 7 న నిర్వహించ తలపెట్టిన సాగునీటి దినోత్సవాన్ని కాళేశ్వరం జలాలతో లక్షహారతి పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు.కాళేశ్వరం జలాలు పారే ఏడూ మండలాల్లోని 126 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
నాగరం మండలం ఈటూరు నుండి పెన్పహాడ్ మండలం రావి చేరువు వరకు 68 కిలో మీటర్ల బారునా లక్ష మందితో కాళేశ్వరం జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లకు గాను మంగళవారం సాయంత్రం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశానికి రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్,నీటి పారుదల అధికారి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ యంత్రాంగం తో పాటు ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.68 కిలోమీటర్ల దారి పొడవునా లక్ష మందితో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించ తలపెట్టిన కాళేశ్వరం జలాలకు లక్ష హారతి కార్యక్రమం బొడ్డు రాయి పండగను మరిపించేలా ఏర్పాట్లు చేసేలా అధికారులను మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశించారు.
ప్రతి పావు కిలో మీటరు కు ఒకరు చొప్పున 280 మంది ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం అడుగడుగునా వైద్య బృందాలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది.ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ యంత్రాంగాన్ని రంగంలోకి దింపగా ఎక్కడి కక్కడే పూర్తి స్థాయిలో భోజనాలు ఏర్పాటు చేశారు.మంచినీటి ఏర్పాట్లలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.
ఇప్పటికే బతుకమ్మ ,బోనాలతో మంగళవాయిద్యాలతో ఊరు వాడ కదిలేలా కాళేశ్వరం జలాలతో లబ్ది పొందిన రైతాంగం ఏర్పాట్లు చేసుకుంటున్నారు.కాళేశ్వరం జలాలతో మొట్ట మొదట లబ్ది పొందిన సూర్యాపేట జిల్లా యావత్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు చెప్పుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ఎక్కడి వారు అక్కడే పాల్గొననుండగా సూర్యాపేట నియోజకవర్గం లో మంత్రి జగదీష్ రెడ్డి,తుంగతుర్తి నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్, కోదాడ నియోజకవర్గం లో స్థానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ లు పాల్గొనెలా ఏర్పాట్లు చేస్తున్నారు.