दिवाली छोटा-बड़ा परवाह किए बिना हिंदुओं द्वारा उत्साह के साथ मनाया जाने वाला त्योहार है। इस शुभ दिन पर देवी लक्ष्मी की पूजा की जाती है। केदारीश्वर व्रत अत्यंत श्रद्धा के साथ मनाया जाता है। वर्तमान पीढ़ी में यह त्यौहार एक ही दिन मनाया जा रहा है। पहले यह त्योहार दो दिन (नरकचतुर्दशी दिवाली) मनाया जाता था। यह वास्तव में पांच दिनों का त्योहार है। विद्वानों के अनुसार, इस त्योहार को मुख्य रूप से पांच दिन तक क्यों मनाया जाना चाहिए। आइए दिवाली के पांच दिवसीय त्योहार के विशेष महत्व के बारे में जानते हैं ।
दिवाली त्योहार को पांच दिनों तक मनाया जाता है। अश्वयुज माह में धन त्रयोदशी से भाई दूजा तक दिवाली उत्सव मनाया जाता है। पांच दिवसीय त्योहार इस साल 29 अक्टूबर को धन त्रयोदशी (धनतेरस) के साथ शुरू होता है और 2 नवंबर को भाई दूज के साथ समाप्त होता है।
29 अक्टूबर, पहला दिन धन त्रयोदशी (धनतेरस):
इस दिन श्री महालक्ष्मी का जन्म तब हुआ था। देव दानव अमृत के लिए दूध समुद्र का मंथन करते समय श्री महालक्ष्मी का जन्म हुआ था। उसे अपनी पत्नी के रूप में स्वीकारते हुए भगवान विष्णु ने सभी प्रकार की संपदा की अधिष्ठात्री देवी के रूप में घोषित करते हैं। इसीलिए इस दिन लोग (29 अक्टूबर) को सोना खरीदते हैं। पंडितों का मानना है कि विष्णुमूर्ति में लक्ष्मी के स्थान को भृगु महर्षि द्वारा लात से मारने से रूठकर भूलोक के कोल्हापुर चली जाती है। इसीलिए इस दिन श्री लक्ष्मी देवी पूजा की जाती है और करनी चाहिए।
यह भी पढ़ें-
30 अक्टूबर, दूसरा दिन नरक चतुर्दशी छोटी दिवाली:
धन त्रयोदशी के बाद छोटी दिवाली मनाई जाती है। इसे नरक चतुर्दशी के नाम से जाना जाता है। यह नरकासुरी के वध के उपलक्ष्य में मनाया जाता है। इस दिन हनुमान की पूजा करने की परंपरा है। इस साल छोटी दिवाली 30 अक्टूबर को है। इस दिन सभी स्नान करके नए कपड़े पहनने चाहिए और माता लक्ष्मी की पूजा करनी चाहिए। जल में देवी गंगा और तिल के तेल में देवी लक्ष्मी बैठी होती है। इसलिए आपको तिल के तेल से नहाना चाहिए। पुराणों में कहा गया है कि जिस दिन नरकासुर का वध हुआ था उस दिन घरों और बरामदों को सजाना और पूजा करना चाहिए। यह भी कहा जाता है कि यही वह दिन है जब भगवान विष्णु ने बालक के रूप में तीन पग धरती मांगी थी और राजा बलि को दफनाया था।
31 अक्टूबर, तीसरा दिन दिवाली अमावस्या: त्रेता युग में भगवान श्रीराम ने सीता के साथ अयोध्या आने वाला दिन ही दिवाली है। हमारे पुराणों में कहा गया है कि द्वापरयुग में पांडव अपना अज्ञातवास पूरा करके आने वाला दिन दिवाली है। 31 अक्टूबर को केदारेश्वर स्वामी व्रत करना अच्छी बात है। लक्ष्मी पूजा के बाद नए रजिस्टर और खाता बही खोलने की प्रथा है। भक्तों का मानना है कि शाम के समय मकानों के सामने रंगोली डालकर और दीये से सजाए गए घर में संपदा देने वाली श्री महालक्ष्मी कदम रखती है। शास्त्र कहते हैं कि जो लोग दिवाली की अमावस्या के दिन देवी लक्ष्मी की पूजा करते हैं उन्हें धन संपदा प्राप्त होती है।
1 नवंबर, चौथा दिन गोवर्धन पूजा :
ऐसा कहा जाता है कि दिवाली के अगले दिन है ‘बलिपाड्यमी’ (तेलुगु शब्द) चतुर्दशी के दिन भगवान विष्णुमूर्ति पाताल को कुचलने वाले बलिचक्रवर्ती फिर से पृथ्वी पर लौट आया दिन यही है। बलि की पूजा की जाती है। महाराष्ट्रीयन इस दिन को नव दिवस के रूप में मानते हैं। गुजरातियों के लिए यह उगादी है। यह वह दिन है जब नंदगोपाल गोवर्धन पर्वत को रेपल्ले के लोगों को बचाया था। इस साल गोवर्धन पूजा 1 नवंबर शुक्रवार को है। देश के कुछ हिस्सों में इसे अन्नकूट के नाम से भी जाना जाता है। कहा जाता है कि गोवर्धन पूजा के दिन भगवान श्रीकृष्ण ने गोवर्धन पर्वत को एक उंगली से उठाया था।
2 नवंबर, पांचवां दिन भाई दूज:
गोवर्धन पूजा के अगले दिन भाई दूज मनाया जाता है। इस दिन बहनें अपने भाइयों को तिलक लगाती हैं और राखी बांधती हैं। बदले में भाई अपनी बहनों को उपहार देते हैं। यदि मनुष्य अपनी बहनों के हाथ से भोजन करें तो सभी संकट और भय दूर हो जाते हैं। इसके बारे में एक अद्भुत कथा प्रचलित है।
पुत्र यमराज और उसकी बहन यमी (यमुना)। वह अपने भाई की बहुत प्रशंसा करती हैं। हर दिन वह अपने भाई को दोस्तों के साथ उसके घर आकर खाना खाने के लिए कहती, लेकिन वह किसी काम में व्यस्त होने के कारण नहीं जा सका। इस स्थिति में यमुना कार्तिका शुक्ल के दिन जरूर आने का आश्वासन लेकर आमंत्रित करती है। बदले में यमराज कहता है कि मुझे कोई भी घर नहीं बुलाता है। हालाँकि, मेरी बहन ने स्वयं मुझे गर्मजोशी से आमंत्रित किया है। इसलिए जाने का फैसला किया और बहन के घर गया। भाई को देखकर बहन प्रसन्न हुई। उसे नहलाया, तिलक किया और प्रेम से अपनी बनाई व्यंजन परोसी। प्रसन्न होकर यम ने उससे वरदान देने का निर्णय लिया और बहन से कहा कि मांगो तुझे क्या चाहिए। यमुना ने भाई यम से हर साल इसी तरह उसके घर आकर भोजन करके जाये (अर्थात अमरत्व)। यह दिन भाई-बहन के प्रेम की मिसाल के तौर पर मनाया जाता है।
Diwali 2024: దీపావళి ఐదు రోజుల పండుగ, ప్రాముఖ్యత, ఆచారాలు
దీపావళి చిన్న పెద్దా తేడా లేకుండా హిందువులు ఉత్సాహంగా జరుపుకునే పండుగ. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని పూజించి.. కేదారీశ్వర వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. ఈ తరంలో ఈ పండుగను ఒక్కరోజే జరుపుకుంటారు. గతంలో రెండు రోజులు జరుపుకునేవారు ( నరకచతుర్దశి దీపావళి). వాస్తవానికి ఇది రోజుల పండుగ. అసలు ఐదు రోజులు ఈ పండుగను ఎందుకను జరుపుకోవాలి పండితులు తెలిపిన ప్రకారం దీపావళి ఐదు రోజుల పండుగ ప్రాముఖ్యత విశిష్టత గురించి తెలుసుకుందాం.
దీపావళి పండుగను ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. ఆశ్వయుజ మాసంలో ధన త్రయోదశి నుంచి భాయ్ పూజ వరకు దీపావళి వేడుకలు చేసుకుంటారు. ఐదు రోజుల పాటు సాగే ఈ పండుగ ఈ ఏడాది అక్టోబర్ 29 న ధన త్రయోదశి ( ధన్తేరాస్)తో ప్రారంభమై నవంబర్2న భాయ్ పూజతో ముగుస్తుంది.
అక్టోబర్ 29, 1 వరోజు ధన త్రయోదశి ( ధన్తేరాస్):
ఈ రోజున లక్ష్మీదేవి పుట్టిన రోజు దేవ దానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మథించే సమయంలో శ్రీ మహాలక్ష్మి జన్మించింది. ఆమెను భార్యగా స్వీకరించిన విష్ణుమూర్తి సకల సంపదలకు ఐశ్వర్యానికి అధిదేవతగా ప్రకటిస్తాడు. అందుకే ఈ రోజున ( అక్టోబర్29) బంగారం కొంటారు. మరో కథ ప్రకారం విష్ణువు గుండెలపై ఎప్పుడూ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటుంది. విష్ణుమూర్తిలో లక్ష్మీదేవి స్థానాన్ని భృగు మహర్షి తన్నడంతో ఆమె అలిగి భూలోకంలో కొల్హాపూర్‌కు వచ్చిన రోజు ఆమె భూలోకానికి వచ్చినరోజు కాబట్టి లక్ష్మీదేవిని పూజించాలని పండితులు చెబుతున్నారు.
అక్టోబర్ 30 2 వ రోజు నరక చతుర్దశి ఛోటీ దీపావళి:
ధన త్రయోదశి తర్వాత, ఛోటీ దీపావళిని జరుపుకుంటారు. దీన్నే నరక చతుర్ధశిగా పిలుస్తారు. నరకాసురిడిని సంహరించిన సందర్భంగా ఇది జరుపుకుంటారు. ఈ రోజున హనుమంతుడిని పూజించే సంప్రదాయం ఉంది. ఈ ఏడాది ఛోటీ దీపావళి అక్టోబర్ 30న వచ్చింది. ఈరోజు ప్రతి ఒక్కరూ తలస్నానం ఆచరించి కొత్త బట్టలు ధరించి లక్ష్మీదేవిని పూజించాలి. నీటిలో గంగాదేవీ, నువ్వుల నూనెలో లక్ష్మీదేవి కొలువై ఉంటారు. అందుకే నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయాలి. లోక కంటకుడైన నరకాసుర సంహారం జరిగిన రోజు కాబట్టి ఇళ్లనూ, వాకిళ్లనూ అలంకరించి పూజలు చేయాలని పురాణాలు చెబుతున్నాయి. విష్ణుమూర్తి బాలవటువు రూపంలో మూడు అడుగుల నేల అడిగి బలి చక్రవర్తిని పాతాళానికి అణిచేసిన రోజు కూడా ఇదేనని చెబుతారు.
అక్టోబర్ 31 3 వ రోజు దీపావళి అమావాస్య :
త్రేతాయుగంలో శ్రీరాముడు సీతతో కలిసి అయోధ్యకు ప్రయాణం చేసిన రోజు దీపావళి. ద్వాపరయుగ ప్రకారం పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని వచ్చిన రోజు దీపావళిగా మన పురాణాలు పేర్కొంటున్నాయి. అక్టోబర్ 31 న కేదారేశ్వర స్వామి వ్రతం ఆచరిస్తే మంచిది. లక్ష్మీపూజ తర్వాత కొత్త దస్త్రాలూ, ఖాతా పుస్తకాలూ తెరవడం ఆచారం. సాయంత్రం ఏ ఇల్లు ముగ్గులు పెట్టి దీపాలతో అలంకరించి ఉంటుందో ఆ ఇంటసిరులనిచ్చే శ్రీ మహాలక్ష్మీ దేవి అడుగు పెడుతుందని భక్తుల నమ్ముతుంటారు. దీపావళి అమావాస్య రోజున లక్ష్మీదేవి ఆరాధన చేసేవారికి సకల సంపదలు సిద్ధిస్తాయని శాస్త్ర వచనం.
నవంబర్ 1 4వ రోజు బలి పాడ్యమి గోవర్దన పూజ:
దీపావళి మర్నాడు బలిపాడ్యమి చతుర్దశి నాడు విష్ణుమూర్తి పాతాళానికి అణిచేసిన బలిచక్రవర్తి మళ్లీ భూమ్మీదకి తిరిగివచ్చిన రోజు ఇదేనని చెబుతారు. బలికి పూజలు చేస్తారు. మహారాష్ట్ర వాసులు ఈ రోజును నవ దివస్ గా భావిస్తారు. గుజరాతీయులకు ఇది ఉగాది. నందగోపాలుడు గోవర్ధన గిరినెత్తి రేపల్లె వాసులను కాపాడిన రోజూ ఇదే. ఈ సంవత్సరం గోవర్ధన్ పూజ నవంబర్ 1శుక్రవారం వచ్చింది. దీన్ని దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అన్నకూట్ అని కూడా అంటారు. గోవర్ధన పూజ రోజున శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఒక వేలితో ఎత్తాడని చెబుతారు.
నవంబర్ 2 5వ రోజు భాయ్ పూజ :
గోవర్థన పూజ జరిగిన మరుసటి రోజు భాయ్ దూజ్ జరుపుకుంటారు. ఈ రోజున సోదరీమణులు తమ సోదరులకు తిలకం వేసి రాఖీ కడతారు. ప్రతిగా సోదరులు తమ సోదరీమణులకు బహుమతులు ఇస్తారు. మగవారు అక్కాచెల్లెళ్ల చేతి భోజనం తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయి. దీనికి సంబంధించి అద్భుతమైన కథ ప్రాచుర్యంలో ఉంది.
కుమారుడు యముడు, అతడి సోదరి యమి(యమున). ఈమె తన సోదరుణ్ని ఎంతో అభిమానించేది. నిత్యమూ అతని మిత్రులతో సహా వచ్చి తన ఇంట్లో విందు చేసి పొమ్మని ఎన్నిసార్లు కోరినా ఏదో ఒక పనితో క్షణం తీరికలేక వెళ్లలేకపోయాడు. ఈ పరిస్థితిలో యమున కార్తీక శుక్ల విదియనాడు తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తూ వాగ్దానం తీసుకుంటుంది. దానికి యముడు నన్నెవరూ ఇంటికి పిలవరు. అయినా నా తోబుట్టువైన ఆడపడుచు స్వయంగా, సాదరంగా ఆహ్వానించింది. కనుక వెళ్లితీరాలి అని నిర్ణయించుకుని వెళ్లాడు. అలా వచ్చిన సోదరుణ్ని చూసి సంతోషించి, అతనికి స్నానం చేయించి, తిలకం దిద్ది, స్వయంగా చేసిన పదార్థాలను ప్రేమతో కొసరి కొసరి వడ్డించింది. సంతోషాంతరంగుడైన యముడు ఆమెకు వరం ఇవ్వదలిచి కోరుకోమన్నాడు. ఏటా ఆ విధంగానే వచ్చి తన ఇంట విందు స్వీకరించమని కోరింది యమున. సోదరీ, సోదరుల మధ్య అప్యాయతకు ఈ పర్వదినం ఆదర్శంగా నిలుస్తోంది. (From Social Media)