తిరుపతి: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఫిబ్రవరి 19 నుండి 28వ తేదీ వరకు ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.
అంకురార్పణం సందర్భంగా సాయంత్రం మూషిక వాహనంపై శ్రీ వినాయకస్వామివారు పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఆ తరువాత శాస్త్రోక్తంగా అంకురార్పణం జరిగింది.

ఫిబ్రవరి 19న ధ్వజారోహణం :
ఫిబ్రవరి 19న ఉదయం 5.20 గంటలకు మకర లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు పల్లకీ ఉత్సవం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహన సేవ జరుగనున్నాయి.
Also Read-
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలలో ప్రతి రోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ
19-02-2025
ఉదయం – ధ్వజారోహణం
రాత్రి – హంస వాహనం
20-02-2025
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
21-02-2025
ఉదయం – భూత వాహనం
రాత్రి – సింహ వాహనం
22-02-2025
ఉదయం – మకర వాహనం
రాత్రి – శేష వాహనం
23-02-2025
ఉదయం – తిరుచ్చి ఉత్సవం
రాత్రి – అధికారనంది వాహనం
24-02-2025
ఉదయం – వ్యాఘ్ర వాహనం
రాత్రి – గజ వాహనం
25-02-2025
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – అశ్వ వాహనం
26-02-2025
ఉదయం – రథోత్సవం (భోగితేరు)
రాత్రి – నందివాహనం
27-02-2025
ఉదయం – పురుషామృగవాహనం
సాయంత్రం – కల్యాణోత్సవం,
రాత్రి – తిరుచ్చి ఉత్సవం
28-02-2025
ఉదయం – త్రిశూలస్నానం
సాయంత్రం – ధ్వజావరోహణం,
రాత్రి – రావణాసుర వాహనం
ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు