हैदराबाद: अमेरिका में हुई गोलीबारी में आंध्र प्रदेश के एक प्रवासी डॉक्टर की मौत हो गई। करीबी रिश्तेदारों ने बताया कि तिरूपति जिले के नायडूपेट मंडल के मेनकुरु गांव के डॉ. पेरमशेट्टी रमेशबाबू (64) की शुक्रवार शाम को बदमाशों द्वारा की गई गोलीबारी में मौत हो गई। अमेरिका में अनेक स्थानों पर अस्पताल बनवाकर अनेक लोगों को रोजगार उपलब्ध कराने वाले रमेश बाबू ने अलबामा राज्य के टस्कलोसा क्षेत्र में एक चिकित्सक के रूप में अच्छी ख्याति प्राप्त की है। उनकी चिकित्सा सेवाओं के सम्मान में वहां एक सड़क का नाम उनके नाम पर रखा गया। वह भारत से अमेरिका आने वाले नेताओं को अपने ही घर में रहने की व्यवस्था करते थे।
डॉ. रमेश बाबू के पिता चिन्ना गुरुनाथम एक साधारण किसान थे। अपने तीन भाई-बहनों में सबसे बड़े रमेश बाबू ने 10वीं तक की पढ़ाई गांव में ही की थी। इंटर की पढ़ाई तिरूपति एसवी मेडिकल कॉलेज, नायडूपेट से एमबीबीएस की पढ़ाई की। जमैका में एमएम पूरा करने के बाद, वह अमेरिका चले गए और एक डॉक्टर के रूप में बस गए। उनकी पत्नी भी एक डॉक्टर हैं और उनके चार संतान हैं। उनकी दो बेटियां और दो बेटे हैं और वे सभी अमेरिका में रहते हैं।
कोरोना वायरस के दौरान रमेश बाबू को उनकी विशेष सेवाओं के लिए कई पुरस्कार मिले। इसके अलावा, उन्होंने अपने गृहनगर में जिस स्कूल में पढ़ाई की, उसके लिए 14 लाख रुपये का दान दिया। साथ ही, उन्होंने गांव में साईं बाबा मंदिर के निर्माण के लिए 20 लाख रुपये देकर अपने अच्छे दिल का परिचय दिया। 15 अगस्त को वह नायडूपेट में अपने रिश्तेदार के घर शादी में शामिल हुए थे। दुःख की बात है कि यहां से जाने के कुछ दिन बाद ही उनकी मौत हो गई।
यह भी पढ़ें-
डॉक्टर रमेश बाबू की मौत की खबर से परिवार के लोग सदमे में हैं। परिवार पर दुखों का पहाड़ टूट पड़ा है। खबर है कि रमेश बाबू की मां जो इस समय तिरूपति में हैं और छोटी बहन जो नायडूपेट में हैं, अमेरिका जाने की तैयारी कर रही हैं। हाल ही में कुछ बदमाश अमेरिका में भारतीयों और भारतीय मूल के लोगों को निशाना बना रहे हैं।
అమెరికాలో జరిగిన కాల్పుల్లో ఆంధప్రదేశ్‌కు చెందిన ప్రవాసీ వైద్యుడు మృతి
హైదరాబాద్ : అమెరికాలో జరిగిన కాల్పుల్లో ఆంధప్రదేశ్‌కు చెందిన ప్రవాసీ వైద్యుడు ప్రాణాలు కోల్పోయాడు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు గ్రామానికి చెందిన డాక్టర్ పేరంశెట్టి రమేశ్‌బాబు (64) శుక్రవారం సాయంత్రం దుండగుడు జరిపిన కాల్పుల్లో చనిపోయినట్టు సన్నిహితులు వెల్లడించారు. అమెరికాలో పలుచోట్ల ఆసుపత్రులు నిర్మించి ఎందరికో ఉపాధి కల్పించిన రమేశ్ బాబు అలబామా రాష్ట్రంలోని టస్కలూసా ప్రాంతంలో వైద్యుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన వైద్య సేవలకు గుర్తింపుగా అక్కడి ఓ వీధికి ఆయన పేరు పెట్టారు. భారత్ నుంచి అమెరికా వెళ్లే రాజకీయ ప్రముఖులకు ఆయన తన ఇంట్లోనే ఆతిథ్యమిచ్చేవారు.
డాక్టర్ రమేశ్ బాబు తండ్రి చినగురునాథం సాధారణ రైతు. వారి ముగ్గురు తోబుట్టువుల్లో పెద్దవాడైన రమేశ్‌బాబు పదో తరగతి వరకూ సొంతూరులోనే చదువుకున్నారు. నాయుడుపేటలో ఇంటర్ తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ అభ్యసించారు. అనంతరం జమైకాలో ఎమ్మెస్ పూర్తిచేసి, అమెరికాకు వెళ్లి వైద్యుడిగా స్థిరపడ్డారు. ఆయన భార్య కూడా వైద్యురాలే కాగా.. వీరిని నలుగురు సంతానం. వీరిలో ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు కాగా వారంతా అమెరికాలోనే ఉంటున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో రమేశ్‌బాబు చేసిన విశేష సేవలకు అనేక పురస్కారాలు వరించాయి. ఇక, స్వగ్రామంలో తాను చదువుకున్న పాఠశాల కోసం రూ.14 లక్షల విరాళంగా ఇచ్చారు. అలాగే, గ్రామంలో సాయిబాబా మందిర నిర్మాణానికి రూ.20 లక్షలు అందజేసి మంచి మనసు చాటుకున్నారు. ఆగస్టు 15న నాయుడుపేటలో తమ బంధువుల ఇంట జరిగిన వివాహానికి ఆయన హాజరయ్యారు. ఇక్కడ నుంచి వెళ్లిన కొద్ది రోజులకే ఆయన మృతి చెందడం బాధాకరం.
ఆయన మరణ వార్త కుటుంబసభ్యులను దిగ్భ్రాంతికి గురిచేసింది. కుటుంబం శోకసంద్రంలో మునిపిగిపోయింది. ప్రస్తుతం తిరుపతిలో ఉన్న రమేశ్ బాబు తల్లి, తమ్ముడు నాయుడుపేటలో ఉన్న సోదరి అమెరికా వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల అమెరికాలోని భారతీయులు, భారత సంతతికి చెందిన వ్యక్తులే లక్ష్యంగా దుండగులు దాడులకు పాల్పడుతున్నారు. (ఏజెన్సీలు)