हैदराबाद: बीआरएस पार्टी के लिए यह बड़ी अप्रिय घटना है। उस पार्टी की सिकंदराबाद छावनी विधायक लास्या नंदिता की सड़क हादसे में मौत हो गई। जिस कार से वह जा रही थी वह नियंत्रण खो बैठी और ओआरआर पर दुर्घटनाग्रस्त हो गई। इस हादसे में विधायक लास्या नंदिता की मौके पर ही मौत हो गई। जबकि उनका कार का ड्राइवर गंभीर रूप से घायल हो गया।
हालांकि, अभी तक इस हादसे के पूरे कारणों का पता नहीं चल पाया है। लास्या नंदिता दिवंगत कैंट विधायक सायन्ना की बेटी हैं। पिछले साल सायन्ना का बीमारी के कारण निधन हो गया था। लास्या नंदिता ने हाल ही में विधानसभा चुनाव लड़ा और लोक गायक गद्दर की बेटी वेन्नेला के खिलाफ विधायक के रूप में जीत हासिल की थी। पुलिस मामले की छानबीन कर रही है।
आपको बता दें कि इससे पहले भी दो बार लास्या नंदिता बाल-बाल बच गई थी। एक बार लिफ्ट के दुर्घटना में बाल-बाल बच गई थी। हाल ही बीआरएस की नलगोंडा सभा से लौटते समय में भी उनकी कार दुर्घटनाग्रस्त हो गई थी। इस हादसे में भी वह बाल-बाल बच गई थी। लेकिन एक होमगार्ड की उस हादसे में मौत हो गई थी। शुक्रवार को सुबह 5 बजे हुए हादसे में उसकी मौत हो गई।
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ పార్టీకి చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. ఓఆర్ఆర్‌పై ఆమె ప్రయాణిస్తోన్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడిక్కకడే మృతి చెందారు. ఆమె కారు డ్రైవర్ తీవ్ర గాయాలపాలయ్యారు.
కాగా, ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురే లాస్య నందిత. గతేడాది సాయన్న అనారోగ్యంతో కన్నుమూయగా.. లాస్య నందిత ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గద్దర్ కూతురు వెన్నెలపై కంటోన్మెంట్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
ఇటీవల కేసీఆర్ నిర్వహించిన ఛలో నల్గొండ సభలో పాల్గొని తిరిగి వస్తుండగా ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆమె ప్రయాణిస్తున్న కారు హోంగార్డు మీద నుంచి వెళ్లడంతో.. అతను మృతి చెందాడు. ఈ ఘటన నుంచి ఆమె సురక్షితంగా బయటపడినా.. ఈరోజు జరిగిన కారు ప్రమాదంలో ఆమె మరణించారు. దీంతో బీఆర్ఎస్ లో తీవ్ర విషాదం నెలకొంది. గతేడాది ఫిబ్రవరి నెలలోనే ఆమె తండ్రి, ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. కాగా, గత నవంబర్ లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, గద్దర్ కూతురు వెన్నెలపై లాస్య నందిత కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. (ఏజెన్సీలు)