हैदराबाद: रिलायंस इंडस्ट्रीज देश में सबसे ज्यादा मार्केट वैल्यू वाली कंपनी है। मुकेश अंबानी (66) इस कंपनी के चेयरमैन, एमडी (सीएमडी) बने हुए हैं। कंपनी अब उनका कार्यकाल अगले पांच साल के लिए बढ़ाने के लिए शेयरधारकों की मंजूरी मांग रही है। फिलहाल अंबानी का कार्यकाल 19 अप्रैल 2024 तक ही है। अब बोर्ड द्वारा इसे 18 अप्रैल 2029 तक बढ़ाने का प्रस्ताव दिया है। अगर अंबानी को तब तक सीएमडी बने रहना है, तो शेयरधारकों को एक विशेष प्रस्ताव पारित करना होगा। क्योंकि 19 अप्रैल 2027 को अंबानी 70 साल के हो जाएंगे। कंपनी अधिनियम के प्रावधानों के अनुसार, रिलायंस इंडस्ट्रीज के मुख्य कार्यकारी अधिकारी की आयु 70 वर्ष से अधिक नहीं होनी चाहिए। मुकेश अंबानी 1977 से रिलायंस इंडस्ट्रीज लिमिटेड के बोर्ड में हैं। अपने पिता धीरूभाई अंबानी की मृत्यु के बाद, उन्हें जुलाई 2002 में कंपनी के अध्यक्ष के रूप में चुना गया था।
अपने पिता धीरूभाई की मृत्यु के बाद अंबानी ने रिलायंस के चेयरमैन के रूप में 2002 में कंपनी की कमान संभाली। तब से इसमें कोई शक नहीं है कि मुकेश अंबानी ने इस कंपनी को सबसे ऊंचाइयों तक पहुंचाया है। इसीलिए हर कोई चाहता है कि वह कुछ और सालों तक कंपनी के सीएमडी बने रहें। अब विशेष प्रस्ताव पारित होने पर ही वह कुछ और वर्षों तक सीएमडी रहेंगे। मुकेश अंबानी ने 2008-09 से 2019-20 तक रिलायंस इंडस्ट्रीज के चेयरमैन के रूप में 15 करोड़ रुपये का वार्षिक वेतन लिया। उल्लेखनीय है कि उन्होंने कोविड महामारी के बाद अपना पूरा वेतन छोड़ दिया था। खासकर 2021 के बाद से उन्होंने पूरी सैलरी लेना बंद कर दिया है। अंबानी ने बोर्ड से अनुरोध किया कि वह अब वेतन नहीं ले सकते हैं। ऐसा लगता है कि बोर्ड ने भी इस पर सकारात्मक प्रतिक्रिया दी है।
लेकिन भले ही अंबानी कंपनी के बॉस के रूप में कोई वेतन नहीं लेते हैं, लेकिन उन्हें कुछ विशेष भत्ते मिलते हैं। इसका मतलब है कि यात्रा, आवास, बोर्डिंग, व्यापार यात्राएं, फोन बिल, कार प्रावधानों की प्रतिपूर्ति की जाती है। इसके साथ ही कंपनी मुकेश अंबानी और उनके परिवार की सुरक्षा का खर्च भी उठाएगी। मुकेश अंबानी की पत्नी नीता अंबानी के बारे में कहने को तो कुछ नहीं है। वह कंपनी के बोर्ड में एक गैर-कार्यकारी निदेशक भी हैं। वित्तीय वर्ष 2022-23 में सिटिंग फीस के रूप में 6 लाख रुपए ले जाने की जानकारी है। साथ ही कमीशन के रूप में 2 करोड़ मिले है। दूसरी ओर, वह इंडियन प्रीमियर लीग में मुंबई इंडियंस फ्रेंचाइजी की भी प्रभारी हैं।
पिछले वित्त वर्ष में रिलायंस इंडस्ट्रीज ने इतिहास रच दिया है। रिलायंस इंडस्ट्रीज ने खुलासा किया है कि वित्तीय वर्ष 2022-23 में उनके समूह के विभिन्न व्यवसायों में 2,62,558 लोगों को नौकरी के अवसर दिए गए हैं। उल्लेखनीय है कि ज्यादातर रिलायंस रिटेल में 2,45,581 कर्मचारी हैं। रिलायंस रिटेल ने अकेले पिछले वित्तीय वर्ष में 100 करोड़ से अधिक लेनदेन किए। वहीं, कंपनी ने अपनी सालाना रिपोर्ट में खुलासा किया है कि रजिस्टर्ड ग्राहकों की संख्या 24.90 करोड़ तक पहुंच गई है। कंपनी के 2.60 लाख करोड़ रुपये के रेवेन्यू में डिजिटल-नए बिजनेस की हिस्सेदारी 18 फीसदी है। 3300 नए स्टोर खुले हैं और इनकी कुल संख्या 18040 तक पहुंच गई है।
देश भर में 5G सेवाओं का विस्तार करने के लिए स्वीडिश एक्सपोर्ट क्रेडिट एजेंसी की ओर से रिलायंस जियो ने रविवार को कहा कि उसे 18 हजार करोड़ रुपये की वित्तीय सहायता मिल रही है। कंपनी ने कहा कि वह 6.2 लाख गांवों में वायरलेस ब्रॉडबैंड सेवाएं मुहैया करा रही है। पिछले वित्त वर्ष में भी 70 हजार लोगों को रोजगार मिला है। देश के सबसे बड़े खुदरा विक्रेता और दूरसंचार ऑपरेटर बनने के बाद, अंबानी अब वित्तीय सेवाओं और नई ऊर्जा व्यवसायों पर ध्यान केंद्रित कर रहे हैं। मुकेश ने कहा कि हाल ही में कंपनी से अलग हुई जियो फाइनेंशियल सर्विसेज लिमिटेड जल्द ही शेयर बाजार में हिस्सा लेगी। इस महीने की 28 तारीख को शेयरधारकों की बैठक में इस तारीख का पता चलने की संभावना है।
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ జీతం, అలవెన్సులు మరియు ఇతర ఆసక్తికరమైన సమాచారం కోసం ఈ వార్తను చదవండి
హైదరాబాద్: రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అత్యధిక మార్కెట్ విలువ ఉన్న కంపెనీ. ఈ సంస్థకు ఛైర్మన్, ఎండీగా (CMD) ముకేశ్ అంబానీ (66) కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలాన్ని మరో ఐదేళ్లు కొనసాగించేందుకు ఇప్పుడు వాటాదార్ల ఆమోదం కోరుతోంది కంపెనీ. ప్రస్తుతానికి అంబానీ పదవీ కాలం 2024 ఏప్రిల్ 19 వరకు మాత్రమే ఉంది. దీనిని ఇప్పుడు 2029 ఏప్రిల్ 18 వరకు పొడిగించాలన్నది బోర్డు ప్రతిపాదనగా ఉంది. ఇక్కడే అప్పటివరకు అంబానీ సీఎండీగా కొనసాగాలంటే వాటాదార్లు ప్రత్యేక తీర్మానం చేయాల్సిందే. ఎందుకంటే అంబానీకి 2027 ఏప్రిల్ 19 వచ్చే సరికి 70 ఏళ్లు వస్తాయి. కంపెనీ చట్ట నిబంధనల ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వయసు 70కి మించొద్దు. ఇక 1977 నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డులో కొనసాగుతూ వస్తున్నారు ముకేశ్ అంబానీ. తండ్రి ధీరూభాయి అంబానీ మరణంతో.. 2002 జులైలో కంపెనీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.
తండ్రి ధీరూభాయి చనిపోయిన తర్వాత రిలయన్స్ ఛైర్మన్‌గా కంపెనీ పగ్గాలు 2002లో చేపట్టారు అంబానీ. అప్పటినుంచి ఈ సంస్థను ముకేశ్ అంబానీ అత్యున్నత శిఖరాలకు చేర్చారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అందుకే ఆయనే మరికొన్నేళ్ల పాటు సంస్థ CMD గా కొనసాగాలని అంతా కోరుకుంటున్నారు. ఇప్పుడు ప్రత్యేక తీర్మానం చేస్తేనే ఆయన ఇంకొన్నాళ్లు సీఎండీగా ఉంటారు. ముకేశ్ అంబానీ 2008-09 నుంచి 2019-20 వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్‌గా వార్షిక వేతనం రూ.15 కోట్ల చొప్పున తీసుకున్నారు. కొవిడ్ మహమ్మారి తర్వాత తన పూర్తి జీతం వదులుకోవడం విశేషం. ముఖ్యంగా 2021 నుంచి ఆయన జీతం మొత్తం తీసుకోవడమే మానేశారు. ఇకపైనా శాలరీ తీసుకోనని అంబానీ బోర్డుకు రిక్వెస్ట్ చేశారు. బోర్డు కూడా అందుకు సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది.
అయితే అంబానీ సంస్థ బాస్‌గా ఎలాంటి జీతం తీసుకోనని చెప్పినప్పటికీ ఆయనకు కొన్ని ప్రత్యేకమైన భత్యాలు ఉంటాయి. అంటే ట్రావెలింగ్, లాడ్జింగ్, బోర్డింగ్, బిజినెస్ ట్రిప్స్, ఫోన్ బిల్స్, కార్ ప్రొవిజన్స్ వంటివి రీయంబర్స్‌మెంట్ చేస్తారు. దీనితో సహా ముకేశ్ అంబానీకి.. ఆయన కుటుంబానికి అయ్యే భద్రతా (సెక్యూరిటీ) ఖర్చులు కూడా కంపెనీనే భరిస్తుంది. ఇక ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఈమె కూడా కంపెనీ బోర్డులో నాన్- ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆమె 2022-23 ఆర్థిక సంవత్సరంలో సిట్టింగ్ ఫీజు కింద రూ. 6 లక్షలు తీసుకున్నట్లు తెలిసింది. ఇంకా కమిషన్‌గా రూ. 2 కోట్లు పొందారు. మరోవైపు ఆమె ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీ బాధ్యతలు కూడా చూసుకుంటుండటం విశేషం.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇక గత ఆర్థిక సంవత్సరంలో చరిత్ర సృష్టించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 2,62,558 మందికి తమ గ్రూప్‌కు చెందిన వివిధ వ్యాపారాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు వెల్లడించింది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఎక్కువగా రిలయన్స్ రిటైల్‌లోనే ఇందులో 2,45,581 మంది ఉద్యోగులు ఉండటం విశేషం. రిలయన్స్ రిటైల్, గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 100 కోట్ల లావాదేవీలకు పైగా నిర్వహించింది. ఇక ఇదే సమయంలో రిజిస్టర్డ్ ఖాతాదారుల సంఖ్య 24.90 కోట్లకు చేరిందని సంస్థ తన యాన్యువల్ రిపోర్ట్‌లో వెల్లడించింది. ఇక కంపెనీ ఆదాయం రూ.2.60 లక్షల కోట్లలో డిజిటల్ – కొత్త వ్యాపారాల వాటా 18 శాతంగా ఉంది. ఇక కొత్త స్టోర్లు 3300 కాగా మొత్తం వీటి సంఖ్య 18040కి చేరింది.
ఇక దేశవ్యాప్తంగా 5G సేవల్ని విస్తరించేందుకు స్వీడిష్ ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ ఏజెన్సీ నుంచి రూ. 18 వేల కోట్ల ఆర్థిక సాయం అందుకున్నట్లు రిలయన్స్ జియో ఆదివారం తెలిపింది. వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవల్ని 6.2 లక్షల గ్రామాల్లో అందిస్తున్నామని.. గత ఆర్థిక సంవత్సరంలో కూడా 70 వేల మందికి ఉపాధి కల్పించినట్లు సంస్థ తెలిపింది. దేశంలో అతిపెద్ద రిటైలర్, టెలికాం ఆపరేటర్‌గా మారిన అంబానీ ఇప్పుడు ఫైనాన్షియల్ సర్వీసెస్, కొత్త ఇంధన వ్యాపారాలపై దృష్టి సారించారు. ఇక ఇటీవల సంస్థ నుంచి విడదీసిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌ను త్వరలోనే స్టాక్ మార్కెట్‌లో నమోదు చేస్తామని చెప్పారు ముకేశ్. ఈ నెల 28న వాటాదారుల సమావేశంలో ఈ తేదీ గురించి తెలిసే అవకాశముంది. (ఏజెన్సీలు)