हैदराबाद: महानगर की परिवहन प्रणाली में क्रांतिकारी बदलाव आने वाला है। नित्य लाखों लोगों को होने वाली परिवहन समस्याओं को हल करने के लिए मेट्रो, एमएमटीएस, और टीजीएसआरटीसी सेवाओं को जोड़ने वाली एक बड़ी योजना बनाई जा रही है। एक महीने के भीतर इस ‘इंटीग्रेटेड ट्रांसपोर्ट सिस्टम’ को लागू करने के लिए अधिकारी तेजी से काम कर रहे हैं।
हैदराबाद महानगर में परिवहन समस्याओं को कम करने के लिए सरकार ‘मल्टी मोडल इंटीग्रेशन’ पर तेजी से काम कर रही है। इस नई प्रणाली के तहत, मेट्रो या एमएमटीएस स्टेशन से उतरने वाले यात्री अपने गंतव्य तक पहुंचने के लिए अब घंटों तक इतंजार नहीं कर पाएंगे। स्टेशन के बाहर तैयार खड़ी टीजीएसआरटीसी की फीडर बसें यात्रियों को उनके घर या कार्यालय तक छोड़ देगी।

शहर के लोग जिस आरटीसी ‘कॉमन मोबिलिटी कार्ड’ का सालों से इंतज़ार कर रहे हैं, वह जल्द ही सच होने वाला है। अभी मेट्रो के लिए एक कार्ड और और एमएमटीएस के लिए अलग टिकट की ज़रूरत होती है। लेकिन आने वाले नए सिस्टम में, एक ही डिजिटल कार्ड या टिकट से तीनों ट्रांसपोर्ट सिस्टम में सफ़र किया जा सकेगा। इससे न सिर्फ़ समय बचेगा बल्कि कैशलेस सफ़र को भी बढ़ावा मिलेगा। शहर में हर दिन लाखों लोग अलग-अलग तरीकों से सफ़र करते हैं। मेट्रो के साथ-साथ शहर में 3,200 आरटीसी बसें लगभग 24 लाख यात्रियों को सर्विस देती हैं। इसमें से 4 लाख छात्र और कर्मचारी बस पास के ज़रिए सफ़र करते हैं। अभी सिकंदराबाद, काचीगुडा, नामपल्ली और फलकनुमा कॉरिडोर में 76 एमएमटीएस ट्रेनें चल रही हैं। अभी 32 हज़ार यात्री इनका इस्तेमाल करते हैं, जबकि पहले यह संख्या 1.68 लाख थी।
एमएमटीएस स्टेशनों पर उतरने के बाद लास्ट माइल कनेक्टिविटी न होने की वजह से यात्रियों को ऑटो पर निर्भर रहना पड़ता है। इसे दूर करने के लिए सरकार एमएमटीएस बस पास सिस्टम को लागू कर रही है। पहले इस कॉम्बो पास की कीमत 800 रुपये थी, लेकिन अब यह बढ़कर 1,350 रुपये हो गई है। इससे मिडिल क्लास यात्रियों को बहुत फायदा होगा क्योंकि इससे वे एक ही पास से ट्रेन और बस में सफर कर सकते हैं। अब तीनों पब्लिक ट्रांसपोर्ट सिस्टम को जोड़ने से आम आदमी को राहत मिलेगी।
यह भी पढ़ें-
నగర రవాణా వ్యవస్థలో ఒక విప్లవాత్మక మార్పు
హైదరాబాద్ : నగర రవాణా వ్యవస్థలో ఒక విప్లవాత్మక మార్పు రాబోతోంది. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు ఎదుర్కొంటున్న రవాణా కష్టాలను తీరుస్తూమెట్రో, ఎంఎంటీఎస్, టీజీఎస్‌ఆర్టీసీ సేవలను అనుసంధానం చేసే భారీ ప్రణాళిక పట్టాలెక్కుతోంది. నెల రోజుల్లోనే ఈ ‘ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్’ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు వేగంగా కసరత్తు చేస్తున్నారు.
హైదరాబాద్ మహానగరంలో రవాణా కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ‘మల్టీ మోడల్ ఇంటిగ్రేషన్’కు శ్రీకారం చుట్టింది. ఈ కొత్త విధానం ప్రకారం మెట్రో లేదా ఎంఎంటీఎస్ స్టేషన్లలో దిగిన ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు. స్టేషన్ల వెలుపలే సిద్ధంగా ఉండే ఆర్టీసీ ఫీడర్ బస్సులు ప్రయాణికులను వారి ఇళ్లు, కార్యాలయాల వద్దే దింపుతాయి.
నగరవాసులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ‘కామన్ మొబిలిటీ కార్డు’ త్వరలోనే సాకారం కానుంది. ప్రస్తుతం మెట్రోకు ఒక కార్డు, ఆర్టీసీకి, ఎంఎంటీఎస్‌కు వేరే టికెట్ తీసుకోవాల్సి వస్తోంది. కానీ రాబోయే కొత్త విధానంలో ఒకే డిజిటల్ కార్డు లేదా టికెట్ ద్వారా మూడు రవాణా వ్యవస్థల్లోనూ ప్రయాణించవచ్చు. ఇది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా.. నగదు రహిత ప్రయాణాన్ని ప్రోత్సహిస్తుంది. నగరంలో ప్రతిరోజూ లక్షలాది మంది వివిధ మార్గాల ద్వారా ప్రయాణిస్తున్నారు. మెట్రోతో పాటు నగరంలో 3,200 ఆర్టీసీ బస్సులు సుమారు 24 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. ఇందులో 4 లక్షల మంది విద్యార్థులు, ఉద్యోగులు బస్ పాస్ ద్వారా ప్రయాణిస్తున్నారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, ఫలక్‌నుమా కారిడార్లలో ప్రస్తుతం 76 ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్నాయి. ప్రస్తుతం 32 వేల మంది ప్రయాణికులు వీటిని వినియోగిస్తుండగా గతంలో ఈ సంఖ్య 1.68 లక్షలుగా ఉండేది.
ఎంఎంటీఎస్ స్టేషన్లలో దిగిన తర్వాత లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేక ప్రయాణికులు ఆటోలపై ఆధారపడాల్సి వస్తోంది. దీనిని అధిగమించేందుకు ఎంఎంటీఎస్ బస్ పాస్ విధానాన్ని ప్రభుత్వం బలోపేతం చేస్తోంది. గతంలో రూ. 800 ఉన్న ఈ కాంబో పాస్ ధర ప్రస్తుతం రూ. 1,350 కి పెరిగింది. ఒకే పాస్‌తో రైలు, బస్సులో ప్రయాణించే సౌకర్యం ఉండటం వల్ల మధ్యతరగతి ప్రయాణికులకు ఇది ఎంతో మేలు చేకూరుస్తుంది. ఇప్పుడు మూడు ప్రజా రవాణా వ్యవస్థలను కనెక్ట్ చేయటం ద్వారా సామాన్యులకు రిలీఫ్ దక్కనుంది. (ఏజెన్సీలు)
