हैदराबाद : टीपीसीसी अध्यक्ष रेवंत रेड्डी ने टीआरएस का नाम बदलकर बीआरएस किये जाने के केंद्रीय चुनाव आयोग की अनुमति के खिलाफ दिल्ली उच्च न्यायालय में याचिका दायर की। दायर याचिका पर सुनवाई करने वाली बेंच ने रेवंत रेड्डी को अहम सुझाव दिए। रेवंत रेड्डी को आईटी विभाग और अन्य संबंधित विभागों को प्रतिवादी के रूप में एक और याचिका दायर करने का निर्देश दिया। दिल्ली हाई कोर्ट ने रेवंत रेड्डी को एक और याचिका दायर करने की इजाजत दी है।
रेवंत रेड्डी ने 2018 में दिल्ली उच्च न्यायालय में एक याचिका दायर की थी, जिसमें आरोप लगाया गया कि ‘सोने की मजदूरी’ के नाम पर टीआरएस धन जुटा रही है। उस समय याचिका पर सुनवाई करने वाली पीठ ने आयकर विभाग को रेवंत रेड्डी के आरोपों का अध्ययन करने का निर्देश दिया था। बाद में मामले की जांच की गई थी। रेवंत रेड्डी ने हाल ही में चुनाव आयोग द्वारा बीआरएस की मंजूरी दिये जाने के मद्देनजर पुराना मुद्दा उठाया।
हाल ही में रेवंत रेड्डी ने दिल्ली उच्च न्यायालय में एक और याचिका दायर की, जिसमें सवाल किया कि चुनाव आयोग आईटी अध्ययन पूरा होने से पहले टीआरएस को बीआरएस में बदलने की अनुमति कैसे देती है। याचिका में कहा गया था कि अदालत ने पहले टीआरएस फंड की संरचना के मुद्दे पर आईटी को अध्ययन का आदेश दिया था, जो अभी तक पूरा नहीं हुआ है। रेवंत ने अपनी याचिका में कहा कि चुनाव आयोग द्वारा फंड का अध्ययन पूरा होने से पहले बीआरएस की अनुमति देना ठीक नहीं है।
इस याचिका पर जस्टिस सुब्रमण्यम प्रसाद की सिंगल बेंच ने सोमवार को सुनवाई की। पिछली याचिका पर सुनवाई समाप्त हो गई थी। इसीलिए रेवंत रेड्डी को आईटी और संबंधित विभागों को प्रतिवादी के रूप में एक अन्य याचिका दायर करने का निर्देश दिया। अदालत के निर्देशों के अनुसार रेवंत रेड्डी आईटी विभाग और ईसी को प्रतिवादी बनाते हुए एक और याचिका दायर कर सकते हैं। चुनाव आयोग द्वारा बीआरएस नाम की अनुमति दिये जाने की पृष्ठभूमि में पुराने मामले को रेवंत रेड्डी फिर से सामने लेकर आना महत्वपूर्ण बन गया है।
रेवंत रेड्डी ने चुनाव आयोग के रवैये के खिलाफ ट्वीट किया। आरोप लगाया कि चुनाव आयोग केंद्र सरकार की कठपुतली बन गई है। उन्होंने सवाल किया कि आईटी जांच पूरी किए बिना बीआरएस को अनुमति देने वाली अधिसूचना कैसे जारी करते है। रेवंत रेड्डी ने चुनाव आयोग पर आरोप लगाया कि कांग्रेस द्वारा उठाए गए बिंदुओं की अनदेखी कर रही है। आखिरकार रेवंत रेड्डी की याचिका के चलते बीआरएस के नाम पर राजनीतिक गलियारों में फिर से बहस शुरू हो गई है।
బీఆర్‌ఎస్‌పై ఢిల్లీ హైకోర్టులో రేవంత్‌రెడ్డి పిటిషన్, రాజకీయ వర్గాల్లో వాడివేడి చర్చ
Hyderabad: టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చుకోవడానికి కేంద్రం ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. రేవంత్ రెడ్డికి కీలక సూచనలు చేసింది. ఐటీ శాఖ, ఇతర సంబంధిత శాఖలను ప్రతివాదులుగా చేర్చుతూ మరో పిటిషన్ దాఖలు చేయాలని రేవంత్‌కు ఆదేశాలు జారీ చేసింది. మరో పిటిషన్ దాఖలు చేసేందుకు రేవంత్‌కు ఢిల్లీ హైకోర్టు అనుమతినిచ్చింది.
బంగారు కూలీ పేరిట టీఆర్ఎస్ నిధులను సమకూర్చుకుంటోందని ఆరోపిస్తూ 2018లో రేవంత్ రెడ్డి ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై అప్పట్లో విచారణ చేపట్టిన ధర్మాసనం.. రేవంత్ ఆరోపణలపై అధ్యయనం చేయాల్సిందిగా ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు సూచించింది. అనంతరం ఆ కేసుపై విచారణను ముగించింది. ఇటీవల బీఆర్ఎస్‌కు ఈసీ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి పాత అంశాన్ని బయటకు తీశారు.
ఐటీ అధ్యయనం పూర్తి కాకముందే టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చుకోవడానికి ఈసీ ఎలా అనుమతి ఇస్తుందంటూ తాజగా రేవంత్ రెడ్డి ఢిల్లీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో టీఆర్ఎస్ నిధుల కూర్పు అంశంపై ఐటీ అధ్యయనం చేయాలని కోర్టు తీర్పు ఇచ్చిందని, అది ఇప్పటికీ ఇంకా పూర్తి కాలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అది పూర్తి కాకముందే బీఆర్ఎస్‌కు ఈసీ అనుమతి ఇవ్వడం సరికాదని రేవంత్ తన పిటిషన్‌లో తెలిపారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ సుబ్రమణియమ్ ప్రసాద్ సింగిల్ బెంచ్ విచారణ చేపట్టింది. గతంలో వేసిన పిటిషన్‌పై విచారణ ముగిసినందున ఐటీ శాఖతో పాటు సంబంధిత శాఖలను ప్రతివాదులుగా చేర్చుతూ మరో పిటిషన్ దాఖలు చేయాలని రేవంత్ రెడ్డిని ఆదేశించింది. కోర్టు సూచనతో ఐటీ శాఖ, ఈసీలను ప్రతివాదులుగా చేర్చుతూ రేవంత్ రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేసే అవకాశముంది. బీఆర్ఎస్ పేరుకు ఈసీ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో పాత వ్యవహారాన్ని రేవంత్ ఇప్పుడు మళ్లీ కొత్తగా తెరపైకి తీసుకురావడం కీలకంగా మారింది.
ఈసీ తీరును వ్యతిరేకిస్తూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈసీ కేంద్ర ప్రభుత్వ గుప్పిట్లో పనిచేస్తోందని ఆరోపించారు. ఐటీ విచారణ ముగియకుండా బీఆర్ఎస్‌కు అనుమతి ఇస్తూ ఎలా నోటిఫికేషన్ జారీ చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ లేవనెత్తిన అంశాలను ఈసీ పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. మొత్తానికి రేవంత్ పిటిషన్లతో బీఆర్ఎస్ పేరుపై రాజకీయ వర్గాల్లో మళ్లీ చర్చ మొదలైంది.(Agencies)