పీపుల్స్ మార్చ్: “తెలంగాణ వచ్చినా పాలమూరులో వలసలు ఆగలేదు”

తెలంగాణ వచ్చినా పాలమూరులో వలసలు ఆగలేదు

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదు

అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పాలమూరు సాగు నీటి ప్రాజెక్టులను పూర్తే చేస్తాం

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

హైదరాబాద్: “తెలంగాణ వస్తే పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తామని కేసీఆర్ మాట ఇచ్చారు. కానీ తెలంగాణ వచ్చినా ఇంకా పాలమూరులో వలసలు ఆగలేదు, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగలేదు, రైతుల ఆత్మహత్యలు ఆగలేదు. కేసీఆర్ పాలమూరు పాలిట శనిలా, శకునిలా తయారయ్యారు” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా గురువారం జడ్చర్లలో నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

రాష్ట్రంలో అభివృద్ధి నిధులన్నీ సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లకు వెళుతున్నాయి ఆయన ఆరోపించారు. 2009లో కరీంనగర్ ప్రజలు బోంద పెడ్తరని భయడి పాలమూరుకు వస్తే ఇక్కడి ప్రజలు గెలిపించి కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టారు. తెలంగాణ పునర్నిర్మాణంలో పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తానని కేసీఆర్ మాట ఇచ్చి తప్పారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాళేశ్వరం, మల్లన్నసాగర్, కొండపోచమ్మ పూర్తయ్యాయి కానీ వాటి కంటే ముందు మొదలు పెట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 2010లో అలంపూర్ ప్రాంతంలో వరదలు వస్తే బంజారాహిల్స్ లోని తన ఇళ్లు అమ్మి అయిన వరద బాధితులకు అమ్మి ఇళ్లు కట్టిస్తా అని మాట ఇచ్చిండు. ఒక్క ఇళ్లు కట్టి ఇయ్యలేదు అని రేవంత్ రెడ్డి కేసీఆర్ ను విమర్శించారు.

“పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల కట్టడాన్ని ఎవరు అడ్డుకున్నారని కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నా.కేసీఆర్ చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా పాలమూరు ప్రజల రుణం తీర్చుకోలేరు. పాలమూరులో 10లక్షల ఎకరాలను ఎడారి చేసే హక్కు కేసీఆర్ ఎవరు ఇచ్చారు? తులసి వనంలో గంజాయి మొక్కలా… పాలమూరు అభివృద్ధిని కేసీఆర్ అడ్డుకుంటున్నారు” అని రేవంత్ రెడ్డి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.

సంబంధిత వార్త

2000లో చిన్నారెడ్డి నేతృత్వంలో 42 మంది శాసనసభ సభ్యులు సోనియా గాంధీకి తెలంగాణ కావాలని వినతి పత్రం ఇచ్చారు. అప్పుడు వనపర్తిలో సభ నిర్వహిస్తే 10 వేల మంది కూడా రారు అనుకుంటే 50 వేల మందికి పైగా వచ్చిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి, సూదిని జైపాల్ రెడ్డి, మహేంద్రనాథ్, మల్లు అనంతరాములు, మల్లికార్జున గౌడ్ వంటి మహామహులు ఇక్కడి ప్రాతినిధ్యం వహించారని రేవంత్ రెడ్డి అన్నారు. మన పాలమూరు బిడ్డలే అని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకొని బడుగు బలహీనవర్గాల బిడ్డలు కులవృత్తులు చేసుకోని బతకాలి అని అంటుండు. ఇందుకోసమే తెలంగాణ తెచ్చుకుంది? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

జడ్చర్ల ప్రాతినిధ్యం వహించిన లక్ష్మారెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి కూడా ఈ ప్రాంతానికి 100 పడకల ఆసుపత్రి తేలేకపోయారు. కనీసం ఆస్పత్రిలో కరెంట్ పోతే పెట్టుకునేందుకు జనరేటర్ కూడా లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎర్రశేఖర్, మల్లు రవి ఉన్నప్పుడే జడ్చర్ల అభివృద్ధి జరిగిందని, సెజ్ కూడా కాంగ్రెస్ హయాంలో వచ్చిందన్నారు. జడ్చర్లపై అభివృద్ధి చర్చకు సిద్ధమన్నారు రేవంత్ రెడ్డి. “నేను ఇంతకు ముందే సవాల్ విసిరా…మరోసారి ఇక్కడ లక్ష్మారెడ్డికి సవాల్ విసురుతున్న ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారో అక్కడే ఓట్లు అడగండి.. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన గ్రామాల్లో మేం ఓట్లు అడుగుతాం” దీనికి సిద్ధమాని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

“నేను మీరు నాటిన మొక్కను. 2006లో మిడ్జిల్ నుంచి జెడ్పీటీసీగా స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తే నన్ను గెలిపించారు. ఆ రోజు మీరు నాటిన మొక్క ఇవాళ మహా వృక్షమైంది. టీపీసీసీ అధ్యక్షుడుగా మీ ముందు నిలబడ్డా..ఇది మిడ్జిల్ ప్రజల గొప్పదనం..నల్లమల అడవుల్లో పుట్టిన మీ బిడ్డకు టీపీసీసీ అధ్యక్షుడుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నడిపించే బాధ్యతను సోనియా గాంధీ గారు అప్పగించారు. కాబట్టి మీ బిడ్డను ఆదరించండి. జిల్లాలో 14కు 14 అసెంబ్లీ స్థానాలను, 2 పార్లమెంటు స్థానాలను గెలిపించండి. అలా చేస్తేనే సోనియమ్మకు కృతజ్ఞత చెల్లించిన వాళ్లం అవుతాం. ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించి అంశం” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ఏడాదిలోనే పాలమూరు-రంగారెడ్డి, నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల, తుమ్మిళ్ల ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని రేవంత్ రెడ్డి అన్నారు. బోయలను ఎస్టీల్లో చేరుస్తామన్నారు. “కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5లక్షలు అందిస్తాం.రైతులకు 2లక్షల రుణమాఫీ అందిస్తాం. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. రూ. 500లకే పేదలకు గ్యాస్ సిలిండర్ అందించే బాధ్యత కాంగ్రెస్ ది. ఉచిత సిలిండర్ ఇస్తామని ఆడబిడ్డలని మోసం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తుండు.. ఉచిత సిలిండర్ కాదు.. కేసీఆర్ కిడ్నీలు అమ్మి ఇస్తానని చెప్పినా తెలంగాణ సమాజం నమ్మదు” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

మార్పు, మహోన్నత ఆకాంక్ష కోసమే పీపుల్స్ మార్చ్ పాదయాత్ర: భట్టి

ఈ క్రమంలో మార్పు, మహోన్నత ఆకాంక్ష కోసమే పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేపట్టానని అన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. మే 25వ తేదీ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీపై తప్పుడు కేసు పెట్టి ఇల్లు ఖాళీ చేపిస్తే.. కర్ణాటక ప్రజలు బీజేపీని ఆ రాష్ట్రం నుంచి ఖాళీ చేయించారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పోడు భూముల పట్టాలను ధరణి పోర్టల్ లో పొందుపర్చడం లేదని ఆదిలాబాద్ అడవి బిడ్డలు ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యానించారు. సింగరేణి ఆస్తులను కాపాడాలని బొగ్గు బావి కార్మికులను కోరారు. తల్లిదండ్రులు అప్పులు చేసి తమ బిడ్డలను కోచింగ్ సెంటర్లకు పంపి చదివిస్తే..ఈ ప్రభుత్వం పేపర్ లీక్ చేసి పరీక్షలను రద్దు చేసిందని మండిపడ్డారు.

రాష్ట్రంలో 24 లక్షల ఎకరాల పేదల భూములను సర్కారు అమ్ముకుంటోందని భట్టి విక్రమార్క ఆరోపించారు. పేదలకు ఇచ్చిన 5 లక్షల కోట్ల విలువైన ఇళ్ల పట్టాల సంపదనను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, బడా కంపెనీలకు ప్రభుత్వం కట్టబెట్టాలని చూస్తోందన్నారు. నాలుగైదు నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. కాంగ్రెస్ పంచిన భూముల్లో అరకలు కట్టిస్తాం..ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో వేస్తామని తెలిపారు .

కుర్చేసుకుని కూసోని కట్టిస్తామన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ మరిచారన్నారు.  పాలమూరు జిల్లాలో కట్టిన ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలోనివే అని చెప్పారు. అంతేకాదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను కట్టేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని తెలిపారు.  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. (ఏజెన్సీలు)

జడ్చర్ల లో సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా భారీ బహిరంగ సభ , ముఖ్యఅతిధిగా హాజరైన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సుఖు

సుఖ్విందర్ సుఖు కామెంట్స్:-

తెలంగాణా ఇచ్చిన ఘనత కేవలం సోనియా గాంధీ కే చెందుతుంది. మాకు రాజ్య ఆకాంక్ష ఉంటే రెండు రాష్ట్రాలుగా చేసి ఉండకుండా ఉండేది. కానీ 1500 మంది బలిదానాలు.. 70 ఏళ్ల పోరాటాన్ని చూసి.. ఏలాంటి ఆకాంక్ష లేకుండా రాష్ట్రం ఇచ్చాం.. ఆంధ్ర ప్రదేశ్ లో పూర్తిగా నష్ట పోయాం.. ఇక్కడ కూడా పెద్దగా మా పార్టీ గెలిచింది లేదు.

కానీ ఇక్కడ ప్రభుత్వము తమ సొంత ఇంటికి పరిమితమై పాలిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రవేశ పెట్టాము. ఇక్కడ కూడా OPS తీసుకు వస్తాం. మేము సామాజిక.. ఆర్థిక కోణంలో చుస్తాం… ప్రతిదీ లాభ నస్టాల లెక్కలు వెయ్యం. మా పార్టీ లక్ష్యాలు.. ఆలోచనలు పేద జనాల ఆకాంక్షల నుంచి వస్తాయి. ప్రతీ పేద జనాల అవసరాలను సోనియా గాంధీ.. రాహుల్ గాంధీ పెద్ద పీట వేస్తారు.

దేశంలో ఐక్యతను చాటేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మా పార్టీ దిశా నిర్దేశం వల్లే దేశంలో పురోగతి. దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకులు కేవలం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఇందిరా గాంధీ.. రాజీవ్ గాంధీ ల బలిదానం దేశం కోసం. ఇలా ఇద్దరు ప్రధానిగా చేసిన వారు ప్రపంచంలో ఎక్కడా లేదు. సోనియా గాంధీ కి ప్రధాన మంత్రి గా అవకాశం వచ్చినా వదులుకున్న త్యాగ మూర్తి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X