జరీన్ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించాలి
సన్మాన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ విజ్ఞప్తి
హైదరాబాద్ : రాష్ట్రంలో స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటుకు నిఖత్ జరీన్ కు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అన్ని రకాల సౌకర్యాలతో స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయాలన్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో నిజాం క్లబ్ లో ఏర్పాటు చేసిన బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కాంగ్రెస్ నేతలతో కలిసి జరీన్ ను సన్మానించారు.
జరీన్ ను గ్రూప్ 1 ఆఫీసర్ గా నియమించాలనే ప్రతిపాదన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉందని, అయితే జనవరి 26లోగా జరీన్ కు గ్రూప్ 1 అధికారిగా నియమించాలని కోరారు రేవంత్. జరీన్ సాధించిన విజయాన్ని గౌరవిస్తూ పార్టీ తరపున రూ.5లక్షలు బహుమతిగా ప్రకటించామని ఆయన తెలిపారు. జరీన్ కు కాంగ్రెస్ అండగా ఉంటుందని, తామంతా జరీన్ తో ఉన్నామని చెప్పేందుకే బహుమతిని ప్రకటించామన్నారు.

రాజకీయాలకు అతీతంగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు. రాజకీయాల్లోనూ క్రీడా స్ఫూర్తి అవసరమన్నారు. ఆ క్రీడా స్ఫూర్తిని కలిగించేందుకే ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిఖత్ జరీన్ ను కుటుంబ సభ్యులు ఎంతో ప్రోత్సహించారని, ఇందుకు వారికి అభినందనలు చెప్పాలన్నారు. లక్షలాదిమంది విద్యార్థులకు క్రీడా స్ఫూర్తిని కలిగించేలా మరోసారి నిఖత్ కు గొప్పగా సన్మానించేలా కార్యక్రమం నిర్వహించుకోవాల్సినవసరం ఉందన్నారు రేవంత్.

తనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడంపై బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. బహుమతిని ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారం ఉంటే క్రీడల్లో దేశం గర్వించేలా ముందుకెళతానని తెలిపారు జరీన్.
Government should allocate land to establish Zareen sports academy
- TPCC chief Revanth urged in her felicitation ceremony
- He demanded Zareen should be appointed as group 1 officer before January 26
Hyderabad: TPCC chief Revanth Reddy urged the state government to allocate land for Nikhat Zareen for establishing sports academy in the state. He attended the felicitation ceremony of boxing champion Nikhat Zareen as a chief guest under the auspices of TPCC at Nizam Club. Along with congress leaders, he felicitated Zareen.
The state government has the proposal to appoint Zareen as group 1 officer and the government should appoint her as group 1 officer before January 26th, said Revanth. He said honouring Zareen’s victory, the party sanctioned Rs 5 lakhs as cash prize. He said the prize money was given to give a message that the Congress party will be with Zareen.
He said this program is organised to encourage sportspersons cutting across party lines. He said sportsmanship is essential even in politics. We are organising these programs to bring that spirit in politics, he said. He said Nikhat Zareen was encouraged by her parents and that they should be appreciated for that. Another felicitation ceremony for Nikhat Zareen is essential to give motivation to lakhs of sportspersons, he said.
Boxing champion Nikhat Zareen expressed happiness for arranging a felicitation ceremony. She thanked for announcing cash prize. Zareen said with everyone’s support, she will make the country proud in sports.