తెలంగాణ భవన్లో రాఖీ వేడుకలు, హాజరైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

రాష్ట్రం నలుమూలల నుంచి తెలంగాణ భవన్ కి తరలివచ్చిన పార్టీ మహిళా శ్రేణులు

హైదరాబాద్ : రాఖి పండగను పురస్కరించుకొని తెలంగాణ భవన్ లో జరిగిన వేడుకలకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ మహిళా ప్రజాప్రతినిధులు పార్టీ నేతలు ఈరోజు కేటీఆర్ కు రాఖీ కట్టారు. పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, సీనియర్ నాయకురాళ్లు, మున్సిపల్ మహిళా చైర్మన్లు, కార్పొరేషన్ మహిళా చైర్మన్లు, కార్పొరేటర్లు, పలువురు పార్టీ కార్యకర్తలు కేటీఆర్ కి రాఖీలు కట్టారు.

రాష్ట్రంలోని ప్రతి సోదర సోదరీమణులకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు. మా సోదరీమణి కవిత గారు ఈ రాఖీ పౌర్ణమి పండగ రోజు తనకు రాఖీ కట్టే పరిస్థితి లేకపోవడం బాధాకరం, 155 రోజులుగా కవిత గారు వేదన అనుభవిస్తున్నారో.. దానికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుంది అని నమ్మకం ఉన్నదన్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా పండుగను పురస్కరించుకొని వచ్చి రాఖీ కట్టిన ప్రతి ఒక్క ఆడబిడ్డలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు.

Also Read-

అండగా నిలిచిన కేటీఆర్ అన్నకు ఆప్యాయంగా రాఖీ కట్టిన సోదరీమణులు

గతంలో తమ పిల్లలకు తమకు కేటీఆర్ అందించిన సహాయాన్ని గుర్తించుకొని మరీ రాఖీ కట్టి తమ ప్రేమను చాటుకున్న ఆడబిడ్డలు

తన ఇంజనీరింగ్ విద్యకు పూర్తి ఆర్థిక సహాయం అందించిన కేటీఆర్ కు అనాధ విద్యార్థిని రుద్రరచన

వినికిడి లోపంతో బాధపడుతున్న ఐదు సంవత్సరాల జోహార్ ఖాన్ చికిత్స కు సహాయం అందించిన కేటీఆర్ కు రాఖీ కట్టిన జోహాన్ ఖాన్ తల్లి

వీడి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడినప్పుడు ఆపరేషన్కు సహాయం అందించిన కేటీఆర్ కు రాఖీ కట్టిన ఐదేళ్ల కృతిక

గత పది సంవత్సరాల కాలంలో కేటీఆర్ తన వ్యక్తిగత హోదాలో మరియు మంత్రిగా వేలాదిమందికి అనేక సందర్భాలలో తనకు తోచిన స్థాయిలో సహాయ, సహకారం అందించారు. విద్య, వైద్య అవసరాల కోసం అనేకమందిని ఆదుకున్నారు. అందులో కొంతమంది ఈరోజు రాఖీ పండుగను పురస్కరించుకొని ప్రత్యేకంగా కేటీఆర్ ఇంటికి వచ్చి మరీ రాఖీ కట్టి తమ ప్రేమను చాటుకున్నారు. రాఖీ పండుగ సందర్భంగా బంజారా హిల్స్ లోని నంది నగర్ లో కేటీఆర్ నివాసానికి వచ్చి వారు కేటీఆర్ ని కలుసుకొని రాఖీ కట్టారు.

జగిత్యాలకు చెందిన అనాధ విద్యార్థిని రుద్రరచన చదువులో రాణించి ఇంజనీరింగ్ సీటు సాధించింది. అయితే ఆమె ఫీజులతో పాటు ఇతర అవసరాల కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న కేటీఆర్ తన వ్యక్తిగత హోదాలో ఆమె విద్యకు అవసరమైన పూర్తి ఖర్చులను భరించారు. ప్రస్తుతం రుద్రరచన తన చదువు పూర్తి చేసుకుని కాగ్నిజెంట్ కంపెనీలో ఉద్యోగాన్ని చేస్తుంది. కేటీఆర్ చేసిన సహాయానికి కృతజ్ఞతగా గత ఏడాది ఆమె తన మూడు నెలల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అనాధ విద్యార్థులను ఆదుకోవడం కోసం విరాళం ఇచ్చింది. ఈసారి కూడా రుద్ర రచన కేటీఆర్ ని కలిసి రాఖీ కట్టి తన ప్రేమను చాటుకుంది.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ కి చెందిన ఐదు సంవత్సరాల జోహాన్ ఖాన్ పుట్టుకతోనే వినికిడి సమస్యతో బాధపడుతున్న విషయం సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న కేటీఆర్ ఆయనకి వినికిడి చికిత్సకు అవసరమైన సహాయాన్ని అందించారు. ఐదు సంవత్సరాలుగా అనేక రకాలుగా ఇబ్బంది పడిన జోహాన్ ప్రస్తుతం అందరి పిల్లలు లాగానే వినడంతో పాటు మాట్లాడడం చేస్తున్నారు. తన కొడుకుకు భవిష్యత్తును అందించిన జోహాన్ ఖాన్ కుటుంబం కేటీఆర్ ని తమ ఇంటికి ఆహ్వానించి గతంలో కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు జోహాన్ ఖాన్ తల్లి కేటీఆర్ నివాసానికి వచ్చి రాఖీ కట్టి తన ప్రేమను చాటుకున్నారు

హైదరాబాద్ నగరానికి చెందిన ఐదు సంవత్సరాల కృతిక అనే బాలిక వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడితే కేటీఆర్ ఆమె ఆపరేషన్లకు అవసరమైన సహాయాన్ని అందించారు. చిన్నారి కృతిక ఈరోజు కేటీఆర్ ఇంటికి వచ్చి రాఖీ కట్టి ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్ అందించిన సహాయానికి కృతిక కుటుంబం కేటీఆర్ కి కృతజ్ఞతలు తెలియజేసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X