हैदराबाद : पूरे तेलंगाना में हड़कम मचा देने वाले रेडिसन ड्रग्स मामले में सनसनीखेज बातकं सामने आये हैं। ड्रग पेडलर अब्बास ने अपनी गवाही में अहम बातों का खुलासा किया। पुलिस ने इस मामले की एफआईआर में दो और आरोपियों को शामिल किया है। पुलिस ने ड्राइवर प्रवीण को A-11 और ड्रग सप्लायर मिर्जा वहीद बेग को A-12 के रूप में शामिल किया है। पुलिस ने बताया कि गज्जला विवेकानन्द एक साल से नशे का आदी हो गया था। पुलिस ने दावा किया कि विवेक और कृष ने अपने दोस्तों के साथ मिलकर ड्रग्स लिया है।
इसी महीने की 24 तारीख को विवेकानंद अपने दोस्तों के साथ पार्टी कर ली। इस पार्टी में रघुचरण, केदारनाथ और संदीप शामिल हुए। विवेकानंद ने श्वेता, लिसी, निल और डायरेक्टर कृष के साथ मिलकर ड्रग पार्टी कर ली। विवेकानंद ने दोस्तों के साथ पेपर रोल का इस्तेमाल कर 3 ग्राम कोकीन पी ली। रेडिसन होटल के 2 कमरों में ड्रग्स का सेवन करना स्वीकार किया है। पुलिस ने कहा कि उन्हें एक व्हाट्सएप चैट मिली है जहां विवेकानंद ने अपने दोस्तों को ड्रग पार्टी के लिए आमंत्रित किया था।
अब्बास ने मिर्जा वहीद से कोकीन खरीदी की थी। जांच पाया गया कि अब्बास खरीदी गई कोकीन को गज्जला विवेकानंद के ड्राइवर गद्दला प्रवीण को सौंपा था। पुलिस को पता चला कि एक ग्राम कोकीन 14 हजार रुपये में खरीदकर विवेकानंद को बेची गई। खुलासा हुआ है कि अब्बास अली को कोकीन सप्लाई करने के लिए विवेकानंद से कमीशन के पैसे मिलते थे। पता चला कि मामले के दोनों आरोपी एक साल से ड्रग्स का सेवन कर रहे हैं। पुलिस ने विवेकानंद की व्हाट्सएप चैट और ड्रग पार्टियों के गूगल पे भुगतान एकत्र किये हैं।
यह भी पढ़ें:
రాడిసన్ డ్రగ్స్ కేసు, రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాడిసన్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ వాంగ్మూలంలో కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసు ఎఫ్ఐఆర్‌లో మరో ఇద్దరిని నిందితులుగా పోలీసులు చేర్చారు. ఏ11గా డ్రైవర్ ప్రవీణ్, ఏ 12గా డ్రగ్ సప్లయర్ మీర్జా వహీద్ బేగ్‌ను పోలీసులు చేర్చారు. గజ్జల వివేకానంద్ ఏడాదిగా డ్రగ్స్‌కు అలవాటు పడ్డట్లు పోలీసులు తెలిపారు. వివేక్, క్రిష్ సహా తన స్నేహితులతో కలిసి డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు పేర్కొన్నారు.
ఈ నెల 24న వివేక్ తన స్నేహితులతో కలిసి పార్టీ చేరుకున్నారు. రఘుచరణ్, కేదరనాథ్, సందీప్‌తో కలిసి పార్టీ చేసుకున్నారు. శ్వేత, లిసి, నిల్, డైరెక్టర్ క్రిష్‌తో కలిసి వివేక్ డ్రగ్ పార్టీ చేసుకున్నారు. పేపర్ రోల్‌ని ఉపయోగించి స్నేహితులతో కలిసి వివేక్ 3 గ్రాముల కొకైన్ సేవించారు. రాడిసన్ హోటల్‌లోని 2 గదుల్లో డ్రగ్స్ సేవించినట్లు ఒప్పుకున్నారు. డ్రగ్స్ పార్టీ కోసం వివేక్ స్నేహితుల్ని ఆహ్వానించిన వాట్సప్ చాటింగ్ గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
మీర్జా వహీద్ దగ్గర అబ్బాస్ కొకైన్ కొనుగోలు చేశారు. గజ్జల వివేకానంద డ్రైవర్ గద్దల ప్రవీణ్‌కు కొనుగోలు చేసిన కొకైన్‌ను అబ్బాస్ అప్పగిస్తున్నట్లు తేలింది. గ్రాము కొకైన్ 14 వేలకు కొని వివేకానందకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కొకైన్ సరఫరా చేసినందుకు వివేకానంద నుంచి.. కమీషన్ డబ్బులను అబ్బాస్ అలీ పొందినట్లు తేలింది. కేసులో ఉన్న నిందితులందూ.. ఏడాదిగా డ్రగ్స్ వాడుతున్నట్లు గుర్తించారు. వివేకానంద డ్రగ్స్ పార్టీల వాట్సాప్ చాటింగ్, గూగుల్ పే పేమెంట్స్ ను పోలీసులు సేకరించారు. (ఏజెన్సీలు)