हैदराबाद : पंजाब के मुख्यमंत्री भगवंत सिंह मान ने प्रगति भवन में मुख्यमंत्री के चंद्रशेखर राव से मुलाकात की। मंगलवार (20 दिसंबर) शाम सीएम केसीआर ने प्रगति भवन पहुंचे पंजाब के मुख्यमंत्री का जोरदार स्वागत किया।
दोनों नेताओं ने मुख्य रूप से देश के ताजा राजनीतिक हालात पर चर्चा की। तेलंगाना में प्रगति, पंजाब के शासन और अन्य मुद्दों पर भी दोनों मुख्यमंत्रियों के बीच चर्चा हुई। खबर है कि दोनों मुख्यमंत्रियों ने केंद्र सरकार के रवैये और राज्यों की समस्याओं पर भी चर्चा की।
पंजाब के सीएम भगवंत मान ने केसीआर को राष्ट्रीय स्तर पर बीआरएस पार्टी के गठन की पृष्ठभूमि पर बधाई दी। इन चर्चाओं के बाद सीएम केसीआर ने पंजाब के मुख्यमंत्री को शाल ओढ़ाकर और स्मृति चिन्ह भेंट कर सम्मानित किया।
केसीआर पंजाब सहित कई राज्यों में बीआरएस किसान सेल स्थापित करने की योजना बना रहे हैं। उधर, तेलंगाना चुनाव लड़ने के लिए आम आदमी पार्टी अभी से जमीनी स्तर पर काम कर रही है। ऐसे में इन दोनों मुख्यमंत्रियों की मुलाकात को काफी अहमियत दी जा रही है।
पंजाब के सीएम भगवंत मान हैदराबाद में एक निवेश सम्मेलन समेत कई कार्यक्रमों में हिस्सा लेने यहां आए। उन्होंने अपनी यात्रा के तहत तेलंगाना के मुख्यमंत्री केसीआर से मुलाकात की। मालूम हो कि सीएम केसीआर ने हाल ही में दिल्ली में बीआरएस पार्टी के मुख्यालय का उद्घाटन किया था। तब से कई राज्यों के नेता, विभिन्न पार्टियों के नेता और किसान संघों के नेता केसीआर से मिल रहे हैं।
खबर है कि सीएम केसीआर इस महीने के अंत में कई राज्यों में बीआरएस की गतिविधियां शुरू कर रहे है। पार्टी के नेता इस विषय को लेकर विचार-विमर्श और गतिविधियों में तेजी कर दी है।
पंजाब के मुख्यमंत्री का स्वागत करने वालों में राज्यसभा सदस्य जोगीनापल्ली संतोष कुमार, राज्य योजना आयोग के उपाध्यक्ष बी विनोद कुमार, एमएलसी मधुसूदनचारी, पूर्व मंत्री कडियम श्रीहरि, सरकारी सचेतक बाल्का सुमन, विधायक ए जीवन रेड्डी, गुव्वाला बालराजू, सरकार के प्रधान सलाहकार राजीव शर्मा, मुख्यमंत्री सरकार सचिव सोमेश कुमार, पूर्व सांसद एस. वेणुगोपालाचारी, नागरिक आपूर्ति निगम के अध्यक्ष रविंदर सिंह और अन्य शामिल थे।
కేసీఆర్‌తో భగవంత్ సింగ్ మాన్ భేటీ
Hyderabad: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో భేటీ అయ్యారు. మంగళవారం సాయంత్రం ప్రగతి భవన్‌కు చేరుకున్న పంజాబ్ ముఖ్యమంత్రికి సీఎం చంద్రశేఖరరావు పుష్పగుచ్ఛం ఇచ్చి సాదరంగా స్వాగతం పలికారు. ఇరువురు నేతలు దేశంలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి ప్రధానంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి, పంజాబ్ రాష్ట్ర పాలన తదితర అంశాలు కూడా ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య చర్చకు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరి, రాష్ట్రాల ఇబ్బందులు ఇతర అంశాలపైనా ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించినట్టు తెలుస్తోంది.
జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కేసీఆర్‌కు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అభినందనలు తెలిపారు. ఈ చర్చల అనంతరం సీఎం కేసీఆర్.. పంజాబ్ ముఖ్యమంత్రికి శాలువా కప్పి, మెమొంటో బహూకరించి సత్కరించారు. పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్ కిసాన్ సెల్ ఏర్పాటు చేసే యోచనలో కేసీఆర్ ఉన్నారు. మరోవైపు.. ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ హైదరాబాద్‌లో ఓ పెట్టుబడుల సమావేశం సహా పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చారు. తన పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిశారు. సీఎం కేసీఆర్ ఇటీవల ఢిల్లీలో బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాటి నుంచి పలు రాష్ట్రాలకు చెందిన నేతలు, వివిధ పార్టీల నాయకులు, రైతు సంఘాల నాయకులు కేసీఆర్‌తో సంప్రదింపులు చేస్తున్నారు. ఈ నెలాఖర్లో సీఎం కేసీఆర్ పలు రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ నేతలు ఇందుకు సంబంధించిన సంప్రదింపులు, కార్యాచరణ వేగవంతం చేసినట్లు సమాచారం.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ కి ఆహ్వానం పలికిన వారిలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్, ఎమ్మెల్సీ మధుసూధనాచారి, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు ఎ. జీవన్ రెడ్డి, గువ్వల బాలరాజు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, మాజీ ఎంపీ ఎస్. వేణుగోపాలచారి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ తదితరులు ఉన్నారు. (Agencies)