हैदराबाद : प्रधानमंत्री नरेंद्र मोदी शुक्रवार को तेलंगाना आएंगे। मोदी शुक्रवार शाम 4:55 बजे बेगमपेट एयरपोर्ट पहुंचेंगे। वहां से वे मलकजगिरी के लिए रवाना होंगे। प्रधानमंत्री शाम 5:15 से 6:15 बजे तक रोड शो में हिस्सा लेंगे। यह रोड शो करीब 1.3 किमी तक जारी रहेगा। रोड शो खत्म होने के बाद शाम 6:40 बजे राजभवन पहुंचेंगे और आराम करेंगे।
प्रधानमंत्री मोदी शनिवार सुबह 10:45 बजे राजभवन से रवाना होंगे और 11 बजे बेगमपेट से नागरकर्नूल के लिए रवाना होंगे। प्रधानमंत्री वहां सुबह 11:45 से दोपहर 12:45 बजे तक आयोजित जनसभा को संबोधित करेंगे। इसके बाद दोपहर 1 बजे नागरर्नूल से गुलबर्गा जाएंगे। नरेंद्र मोदी 18 तारीख को फिर तलंगाना के लिए लौट आएंगे। मोदी जगित्याला जिले में आयोजित एक विशाल जनसभा में हिस्सा लेंगे और संबोधित करेंगे।
स्थानीय बीजेपी नेताओं ने इसकी सभी तैयारियां पूरी कर ली है। वहीं पुलिस ने पीएम मोदी के दौरे के चलते यातायात्र प्रतिबंध लगा दिया है। साथ ही जनसामान्य से वैकल्पिक मार्गों से जाने का सुझाव दिया है और सहयोग करने की अपील की है।
తెలంగాణకు ప్రధాని మోడీ, మల్కాజ్‌గిరిలో రోడ్ షో
హైదరాబాద్: ప్రధాని మోడీ నేడు తెలంగాణకు రానున్నారు. శుక్రవారం సాయంత్రం 4:55 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి మోడీ చేరుకోనున్నారు. అక్కడి నుంచి మల్కాజ్ గిరికి బయలుదేరనున్నారు. సాయంత్రం 5:15 గంటల నుంచి 6:15 వరకు రోడ్ షోలో మోడీ పాల్గొంటారు. ఈ రోడ్ షో దాదాపు 1.3 కిలోమీటర్ల దూరం సాగనుంది. రోడ్ షో ముగిసిన అనంతరం సాయంత్రం 6:40 గంటలకు ఆయన రాజ్ భవన్‌లో బస చేస్తారు.
శనివారం ఉదయం 10:45 గంటలకు రాజ్ భవన్ నుంచి ప్రధాని మోడీ బయలుదేరి 11 గంటలకు బేగంపేట నుంచి నాగర్‌కర్నూల్ వెళ్తారు. ఉదయం 11:45 నుంచి 12:45 వరకు అక్కడ నిర్వహించే సభలో ప్రధాని పాల్గొంటారు. అది ముగిసిన అనంతరం మధ్యాహ్నం 1 గంటలకు నాగర్ కర్నూల్ నుంచి గుల్బర్గాకు వెళ్లనున్నారు. తిరిగి మళ్లీ 18వ తేదీన ఆయన రానున్నారు. జగిత్యాల జిల్లాలో నిర్వహించే భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు.
ఈ సమావేశాల్లో బిజెపి కేంద్ర నాయకులు పాల్గొంటారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు & కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు పార్లమెంటరీ బోర్డు సభ్యులు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డి కె అరుణ, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శులు శ్రీ బండి సంజయ్ కుమార్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ లు శ్రీ తరుణ్ ఛుగ్, శ్రీ సునీల్ బన్సల్, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ ఏపీ జితేందర్ రెడ్డి, శ్రీ ఈటల రాజేందర్, బిజెపి శాసనసభ పక్ష నాయకులు శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బిజెపి శాసనమండలి పక్ష నాయకులు శ్రీ ఏవిఎన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర పదాధికారులు తదితరులు పాల్గొంటారు.(ఏజెన్సీలు)