हैदराबाद: राष्ट्रपति द्रौपती मुर्मू अपने शीतकालीन रिट्रीट कार्यक्रम के तहत सोमवार को हैदराबाद पहुंचेंगी। खबरे आ रही है कि राष्ट्रपति का तेलंगाना के मुख्यमंत्री के चंद्रशेखर राव स्वागत करने वाले हैं। मुर्मू इस महीने की 26 से 30 तारीख तक राष्ट्रपति आवास बोलारम में रहेगी। इस मौके पर वह कई कार्यक्रमों में शिरकत करेंगी। इसके साथ ही राष्ट्रपति आवास और आसपास के इलाकों में सुरक्षा कड़ी कर दी गई है। इसके आसपास चार स्तरीय सुरक्षा व्यवस्था की गई है। सुरक्षाबलों ने पहले ही इलाके को अपने कब्जे में ले लिया है। पुलिस, सेना, राजस्व, छावनी लोक निर्माण विभाग विभागों ने सभी तरह की व्यवस्थाएं पहले ही पूरी कर ली हैं। सुरक्षा बल इस इलाके में दो बार रूट काफिले का पूर्वाभ्यास कर चुके हैं।
सोमवार को शाम 4.30 बजे मुर्मू हकीमपेट पहुंचने पर उन्हें तीन बलों की सलामी दी जाएगी। उसके बाद पुष्प अर्पित कर स्वागत करने जैसे कार्यक्रम होंगे। सरकारी नियमों के मुताबिक अधिकारियों ने इस कार्यक्रम के लिए कुछ खास लोगों को ही अनुमति देने का फैसला किया है। साथ ही राष्ट्रपति के साथ कुछ और वीआईपी हाकिमपेट एयरपोर्ट पहुंचेंगे। हवाई अड्डे के परिसर में तंबू और कुर्सियां लगाई गई हैं। क्योंकि राष्ट्रपति उनसे बातचीत करने के लिए वहां कुछ समय बिताएंगे। इस बीच, दिल्ली से आई एक विशेष टीम ने पहले ही राष्ट्रपति आवास के आसपास का जायजा ले लिया है।
इस क्षेत्र में निषेधाज्ञा भी जारी कर दी गई है। केवल विशेष पास प्राप्त करने वाले आगंतुकों को ही राष्ट्रपति आवास के अंदर जाने की अनुमति दी जाएगी। मुर्मू के आगमन की पृष्ठभूमि में बोलाराम में राष्ट्रपति भवन को नव दुल्हन की तरह पूरी तरह से सजाजा गया है। राष्ट्रपति आवास परिसर के बगीचों को फूलों से खूबसूरती से सजाया गया है। पेयजल आपूर्ति में सुधार हुआ है। अधिकारियों ने आंतरिक सड़कों का निर्माण पूरा कर लिया है। मेडचल-मलकाजीगिरी जिलाधीश हरीश, प्रोटोकॉल अपर सचिव अरविंद सिंह, साइबराबाद आयुक्त स्टीफन रवींद्र, मुख्य प्रशासनिक अधिकारी नरेंद्र वर्मा, विंग कमांडर चौधरी, एयरपोर्ट प्रोटोकॉल सहायक सचिव शशिधर रेड्डी और अन्य व्यवस्थाओं की निगरानी कर रहे हैं।
सुरक्षा सूत्रों ने बताया है कि राष्ट्रपति द्रौपदी मुर्मू अपने शीतकालीन रिट्रीट के तहत सोमवार को एक विशेष विमान से सुबह 10 बजकर 10 मिनट पर शमशाबाद हवाईअड्डे पहुंचेंगी। वहां से वह विशेष हेलिकॉप्टर से श्रीशैलम मंदिर जाएंगी और मल्लिकार्जुस्वामी के दर्शन करेंगी। वहां से वे शाम 4.30 बजे सीधे हकीमपेट एयरपोर्ट लौट आएगी। वहां राष्ट्रपति का आधिकारिक औपचारिकताओं के साथ स्वागत किया जाएगा। वहां से वह सीधे राष्ट्रपति आवास बोलारम पहुंचेंगी।
రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఇవాళ తెలంగాణలో పర్యటన
హైదరాబాద్ : రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము తన శీతాకాల విడిది కార్యక్రమంలో భాగంగా సోమవారం హైదరాబాద్ రానున్నారు. రాష్ట్రపతికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్వాగతం పలకబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముర్ము ఈ నెల 26 నుంచి 30 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేస్తారు. ఈ సందర్భంగా ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీంతో రాష్ట్రపతి నిలయం, పరిసర ప్రాంతాలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆ పరిసరాల్లో నాలుగంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పోలీసు, ఆర్మీ, రెవెన్యూ, కంటోన్మెంట్ పబ్లిక్ వర్క్స్డిపార్టుమెంట్ విభాగాలు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశాయి. భద్రతా దళాలు ఇప్పటికే రెండు పర్యాయాలు ఈ ప్రాంతంలో రూట్ కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించాయి.
హకీంపేటలో సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ముర్ము చేరుకోగానే ఆమెకు త్రివిధ దళాలు గౌరవ వందనం చేస్తాయి. అనంతరం ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేయడం, స్వాగతం పలకడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే ప్రభుత్వ నిబంధనల మేరకు అతి ముఖ్యులైన కొద్ది మందిని మాత్రమే ఈ కార్యక్రమానికి అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. అలాగే హకీంపేట ఎయిర్పోర్టులో రాష్ట్రపతితో పాటు మరికొందరు వీఐపీలు రానున్నారు. దీంతో అక్కడ రాష్ట్రపతి వారితో సంభాషించేందుకు కొంత సమయం కేటాయించనున్నందున ఎయిర్పోర్టు ఆవరణలో టెంట్లు, కుర్చీలు ఏర్పాటు చేశారు. కాగా, ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఇప్పటికే రాష్ట్రపతి నిలయం పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకుంది. అలాగే ఈ ప్రాంతంలో నిషేధాజ్ఞలు జారీ చేశారు.
ఇక ప్రత్యేక పాస్లు పొందిన సందర్శకులనే రాష్ట్రపతి నిలయం లోపలకు అనుమతించనున్నారు. ఇక ముర్ము రాక నేపథ్యంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రంగులువేశారు. నిలయం ఆవరణలోని ఉద్యానవనాలను అందంగా తీర్చిదిద్దారు. తాగునీటి సదుపాయాన్ని మెరుగుపరిచారు అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసిన అధికారులు.. నిలయంలో పాములు ప్రవేశించకుండా ప్రత్యేక సిబ్బందిని ఉంచారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్, ప్రొటోకాల్ అడిషనల్ సెక్రటరీ అరవింద్ సింగ్, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి నరేంద్ర వర్మ, వింగ్ కమాండర్ చౌధురి, ఎయిర్పోర్టు ప్రొటోకాల్ అసిస్టెంట్ సెక్రటరీ శశిధర్రెడ్డి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదిలో భాగంగా సోమవారం ప్రత్యేక విమానంలో ఉదయం 10.10 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారని భద్రతా వర్గాలు వెల్లడించాయి. అక్కడి నుంచి ఆమె స్పెషల్ చాపర్లో శ్రీశైలం ఆలయానికి వెళ్లి మల్లికార్జుస్వామిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి తిరిగి నేరుగా 4.30 గంటలకు హకీంపేట్ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడ రాష్ట్రపతికి అధికారిక లాంఛనాలతో స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ఆమె నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. ఏటా రాష్ట్రపతి శీతకాల విడిది ముగిశాక బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి సందర్శకులను అనుమతించే సంగతి తెలిసిందే. (Agencies)