హైదరాబాద్ : ‘ఉరి కంబం నీడలో’ఒక బహుజనుడి ఆత్మకథ పుస్తకావిష్కరణ సన్నహక సమావేశం శనివారం రోజున సుప్రసిద్ధ దిగంబరకవి నిఖిలేశ్వర్ గారి నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి, రచయిత మరియు అనువాదకుడు డా. కారం శంకర్ మరియు WAJA (Writers and Journalists Association) జనరల్ సెక్రటరీ, ప్రముఖ అనువాదకుడు రచయిత మరియు కవి దేవా ప్రసాద్ మాయలా, సాక్షి చీఫ్ రిపోర్టర్ రాహూల్ మరియు ఉరి కంబం నీడలో( ‘ఫాఁసి’ హిందీ) మూల రచయిత కె. రాజన్న పాల్గొన్నారు.

పుస్తక ఆవిష్కరణ సన్నాహ సమావేశంలో వివిధ అంశాలపై కవి నిఖిలేశ్వర్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగ హిందీ ‘ఫాఁసి’ ని తెలుగులోకి అనువాదం చేసినందుకుగాను కారం శంకర్ ని అభినందించారు. నిఖిలేశ్వర్ తన రచనల్ని కారం శంకర్ కి అందించారు. ఆయన మాట్లాడుతూ పోలీస్ శాఖలో పనిచేస్తూ కవిగా, రచయితగా రాణించడం గొప్ప విషయమని అన్నారు.
Also Read-
అనంతరం అనంతరం కారం శంకర్ మాట్లాడుతూ నిఖిలేశ్వర్ గారితో సమావేశం అవడం ఇది నా జీవితంలో నిలిచిపోయే అరుదైన మరిచిపోలేని ఘట్టమని అన్నారు. అనంతరం పుస్తక ఆవిష్కరణ తేదీని కమిటీ త్వరలో ప్రకటిస్తుందని తెలపారు. ఈ సందర్భంగా కె రాజన్న ‘ఉరి కంబం నీడలో’ పుస్తకాన్ని నిఖిలేశ్వర్ గారికి అందజేసారు.
